AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithiin: మాచర్ల నియోజకవర్గం మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేది అప్పుడే..

యూత్ స్టార్ నితిన్ (Nithiin) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam).

Nithiin: మాచర్ల నియోజకవర్గం మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేది అప్పుడే..
Nithiin
Rajitha Chanti
|

Updated on: Mar 24, 2022 | 4:19 PM

Share

యూత్ స్టార్ నితిన్ (Nithiin) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). ఈ సినిమాతో ఎస్ రాజ శేఖర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. ఈ సినిమాలో కేథరిన్ థెరిసా, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్.. ఎంటర్‌టైన్‌మెంట్స్‌‏తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటివలే ఈ మూవీ షూటింగ్ భారీ షెడ్యూల్‌‏ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్.. టీజర్ త్వరలో రిలీజ్ కాబోతున్నాయంటూ టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మాచర్ల నియోజకవర్గం ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది.

ఇటీవలే ఫైట్ మాస్ట‌ర్ అనల్ అరసు నేతృత్వం‌లో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసి.. ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సూపర్ మాస్ డ్యాన్స్ నంబర్ కూడా పూర్తి చేసారు. ఈ సంద‌ర్భంగా మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఛార్జ్ పేరుతో ఫస్ట్ లుక్‌‏కి సంబంధించిన అప్‌డేట్‌‏తో మేకర్స్ ముందుకు వచ్చారు. వినూత్నంగా మార్చి 26న ఫస్ట్ ఛార్జ్ తీసుకోబోతున్న‌ట్లుగా ప్రభుత్వ ఉత్తర్వు శైలిలో ప్రకటన విడుద‌ల చేశారు. మ‌రోవైపు ఐఏఎస్ అధికారి యొక్క కింది పోస్ట్ తక్షణమే అమలులోకి వస్తుంది – శ్రీ ఎన్ . సిద్ధార్థరెడ్డి, IAS (2022) గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. తన మొదటి ఛార్జ్‌ని మార్చి 26న ఉదయం 10:08 గంటలకు తీసుకుంటున్నారు. అంటూ ఆర్డ‌ర్ కాపీలో పేర్కొన్నారు. గుంటూరులో జిల్లా కలెక్టర్‌ గా కథానాయకుడు ఎదుర్కోబోయే సవాళ్లను సూచించేదిగా ఈ ఆర్డర్ కాపీ ఎర్ర‌టి మ‌ర‌క‌ల‌తో నిండి ఉంది.

రాజ‌కీయ నేప‌థ్యంతో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌ లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో భారీ తారాగణం కూడా ఉంది. అనుభవంగల సాంకేతిక సిబ్బంది పని చేస్తున్నారు. భీష్మ, మాస్ట్రో తర్వాత మహతి స్వర సాగర్ మూడవసారి నితిన్‌ తో కలిసి పనిచేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో ఉన్న పర్సన్.. మీ, మా, మనందరి ఫేవరెట్.. ఎవరో గుర్తుపట్టారా..?

OTT Platforms: ఓటీటీ వేదికపై సందడి చేయనున్న పెద్ద సినిమాలు ఇవే.. స్ట్రీమింగ్ డేట్స్ ఏంటంటే..

Ghani Movie: ఫ్యాన్స్‌కు గని నుంచి స్పెషల్‌ ట్రీట్‌.. తమన్న స్టెప్పులకు ఫిదా అవుతోన్న కుర్రకారు..

RRR: విడుదలకు ముందే ఊచకోత.. ప్రీమియర్స్​లో ‘ఆర్​ఆర్​ఆర్’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డ్ బ్రేక్