AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు చదువులో సరస్వతి.. సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు..

ఒక వ్యక్తి పుట్టిన తేదీతో అతని స్వభావం ఏమిటో లేదా భవిష్యత్తులో అతను ఏ రంగంలో తనదైన ముద్ర వేయగలడో తెలుసుకోవచ్చు. సంఖ్యాశాస్త్రంలో ఒక వ్యక్తి పుట్టిన తేదీకి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ తేదీలో పుట్టిన వారు అమితమైన తెలివి తేటలు కలిగి ఉంటారు. ముఖ్యంగా చదువులో అపర సరస్వతి అనిపిస్తారో ఈ రోజు తెలుసుకుందాం..

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు చదువులో సరస్వతి.. సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు..
Number 3 Numerology
Surya Kala
|

Updated on: Aug 14, 2025 | 4:59 PM

Share

సంఖ్యాశాస్త్రంలో ప్రతి సంఖ్య ఏదో ఒక గ్రహానికి సంబంధించినదని నమ్ముతారు. అందుకనే ఆ గ్రహ ప్రభావం ఆ సంఖ్యకి చెందిన వ్యక్తిపై కూడా పడుతుంది. ఈ రోజు మనం అలాంటి సంఖ్యకి చెందిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం.. వీరు చదువులో చాలా తెలివైనవారు. ఈ సామర్థ్యం కారణంగా జీవితంలో కూడా చాలా విజయాలు సాధిస్తారు. ఈ సంఖ్యలో జన్మించిన వ్యక్తులు చదువుతో తమ ప్రావీణ్యతతో.. పెద్ద అధికారులు అవుతారు. ఈ సంఖ్య ఏమిటి? ఆ సంఖ్యకు సంబంధించిన ఇతర ప్రత్యేకతలను గురించి తెలుసుకుందాం.

చాలా తెలివైనవారు ఈ రోజు మనం మూల సంఖ్య 3 ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాము. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా 3, 12, 21 లేదా 30 తేదీలలో జన్మించిన వారి మూల సంఖ్య 3 ఉంటుంది. ఈ మూల సంఖ్య పాలక గ్రహం గురువు (బృహస్పతి). గురువు జ్ఞానం, విద్య, తెలివితేటలకు చిహ్నంగా భావిస్తారు. కనుక ఈ సంఖ్య లో జన్మించిన వ్యక్తులు బృహస్పతి ప్రభావం వల్ల చాలా తెలివైనవారు. వీరి మనస్సు చాలా వేగంగా పనిచేస్తుంది. ఈ వ్యక్తులు తమ కృషితో తాము పని చేస్తున్న చోట ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

ఏ రంగాలలో విజయం సాధిస్తారంటే 3వ సంఖ్య గల వ్యక్తులు తెలివైనవారు. ప్రతిష్టాత్మకులు. సృజనాత్మక వ్యక్తులు. ఈ వ్యక్తులు ఆత్మగౌరవం, స్వావలంబన కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు విద్య, పరిపాలన, కళ మొదలైన రంగాలలో బాగా రాణిస్తారు. ఏ పని మొదలు పెట్టినా విజయం సాధిస్తారు. బృహస్పతి ప్రభావం కారణంగా ఈ వ్యక్తులు మంచి న్యాయవాదులు కూడా కావచ్చు.

ఇవి కూడా చదవండి

సంఖ్య 3 యొక్క లక్షణాలు 3వ సంఖ్య ఉన్న వ్యక్తులు ఎటువంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. దీనితో పాటు వీరు ఏ పని చేయాలని నిర్ణయించుకున్నా.., దానిని పూర్తి చేసే వరకు విశ్రాంతి తీసుకోని గుణం వీరి సొంతం. ఈ వ్యక్తులు పరిస్థితికి అనుగుణంగా తమను తాము మలుచుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. 3వ సంఖ్య ఉన్న వ్యక్తులు జీవితంలో పెద్ద లక్ష్యాలను కలిగి ఉంటారు. తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు విశేషమైన కృషి చేస్తారు. వాటిని సాధిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.