- Telugu News Photo Gallery Spiritual photos Luck for these three zodiac signs with Ardhakendra Raja Yoga
అర్థకేంద్ర రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రగ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం సంపద, శాంతి, శ్రేయస్సుకు చిహ్నం. అయితే ఈ గ్రహం సంచారం చేయడం అలాగే శుక్ర, ఇంద్రగ్రహాల సంయోగం వలన మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.
Updated on: Aug 14, 2025 | 8:33 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది చాలా కామన్. అయితే ఆగస్టు14 నేడు శుక్ర గ్రహం, ఇంద్రగ్రహాలు సంయోగం జరపడం వలన అర్థకేంద్ర రాజయోగం ఏర్పడింది. అంటే ఈ రెండు గ్రహాలు ఒకదానికి ఒకటి 45 డిగ్రీలో దూరంలో వచ్చాయి. అయితే దీని ప్రభావం 12 రాశులపై పడగా, మూడు రాశుల వారికి అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. కాగా, ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం చూసేద్దాం.

కుంభరాశి :కుంభరాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహం వలన అఖండ రాజయోగం కలగనుంది. కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయి. స్థిరాస్తికొనుగోలు చేస్తారు. ఎవరైతే చాలా రోజుల నుంచి కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటారో వారికి ఇది బెస్ట్ సమయం. శుక్రుని ప్రభావం వల్ల సంపదలో భారీ పెరుగుదల ఉండబోతుంది.

మీనరాశి :మీన రాశి వారికి అర్థకేంద్ర రాజయోగం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. ఆదాయం పెరుగుతుంది.ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూసే వారికి మంచి సంబంధం ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు.

తుల రాశి : ఈ రాశి వారు అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆదాయం పెరుగడం వలన కుటుంబంలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది.

వైవాహిక జీవితం అద్భతంగా ఉంటుంది. వీరికి ఉన్న అప్పుల సమస్యలన్నీ తొలిగిపోయి, చేతినిండా డబ్బుతో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే చేపట్టిన పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది. విద్యార్థులు మంచి మార్కులు సంపాదిస్తారు. ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది.



