AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Real Estate Astrology: గురు గ్రహం అనుకూలత.. ఈ రాశుల వారికి సొంత ఇళ్లు, ఆస్తిపాస్తులు ఖాయం!

జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో చతుర్థ స్థానం, చతుర్థ స్థానాధిపతి ఏమాత్రం అనుకూలంగా ఉన్నా సొంత ఇల్లు, సొంత వాహనం, ఆస్తిపాస్తులు తప్పకుండా కలుగుతాయి. వీటన్నిటికీ కారకుడైన గురు గ్రహం కూడా అనుకూలంగా ఉన్న పక్షంలో ఇవన్నీ తేలికగా, ఎటువంటి సమస్యలూ లేకుండా అమరే అవకాశం ఉంది. ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశులకు గృహ, వాహన, ఆస్తులు లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొద్ది ప్రయత్నంతో వీరు వీటిని సాధించుకోవడానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 14, 2025 | 7:59 PM

Share
వృషభం: ఇల్లు, వాహనాలను, ఆస్తిపాస్తులను ఏర్పాటు చేసుకోవడమన్నది ఈ రాశుల వారికి మొదటి నుంచి ఒక కల. వీరు వీటి కోసం మొదటి నుంచి ఆదాయాన్ని సమకూర్చుకోవడం జరుగుతుంటుంది. ప్రస్తుతం వీరికి చతుర్ధాధిపతి రవితో పాటు గృహ కారకుడైన గురువు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది చివరి లోగా వీరు తమ కలలను సాకారం చేసుకోవడం తప్ప కుండా జరుగుతుంది. ఇల్లు, వాహనం అమరుతాయి. తండ్రి నుంచి ఆస్తి లాభం కలుగుతుంది.

1 / 6
మిథునం: ఈ ఏడాది రాశ్యధిపతి బుధుడు, సంపద కారకుడైన గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి అక్టోబర్, డిసెంబర్ నెలల మధ్య తప్పకుండా గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది. జీవితంలో ఆర్థిక భద్రతకు, హ్యాపీ జీవితానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఈ రాశివారు సాధా రణంగా సొంత ఇల్లు, ఆస్తిపాస్తులను ఒక ప్రణాళిక ప్రకారం సాధించుకోవడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు బాగా అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది.

2 / 6
సింహం: సుస్థిర జీవితం కోసం, ఆర్థిక భద్రత కోసం ఈ రాశివారు పాటుబడినంతగా మరే రాశులవారు పాటుబడరు. వీరి ధ్యాసంతా సొంత ఇల్లు, వాహనం, ఆస్తిపాస్తుల మీద కేంద్రీకృతమై ఉంటుంది. అందరి కంటే అగ్రస్థానంలో ఉండాలన్న తపన కారణంగా వీరు చర, స్థిరాస్తుల కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీ లోపు వీరికి సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. పొలాలు, స్థలాల మీద వీలైనంత సొమ్మును పెట్టుబడి పెట్టడం జరుగుతుంది.

3 / 6
తుల: గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారు ఆదాయాన్ని బాగా పెంచుకోవడంతో పాటు ఒకటికి రెండు ఇళ్లు సమకూర్చుకునే అవకాశం ఉంది. తప్పకుండా వాహన యోగం కలుగుతుంది. సహజ వ్యాపార ధోరణి కారణంగా ఈ రాశివారు స్థలాల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు తదితర ఆర్థిక లావాదేవీలతో పాటు అదనపు ఆదాయ ప్రయత్నాల ద్వారా సంపదను పెంచుకుని, ఇళ్లు, స్థలాల మీద మదుపు చేసే సూచనలున్నాయి.

4 / 6
ధనుస్సు: ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడం మీద ఈ రాశివారికి మక్కువ ఎక్కువ. ప్రస్తుత గ్రహ సంచారం కారణంగా ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగాన్ని వృత్తిగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. వీరికి మీ ఏడాది అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నందువల్ల  పొలాలు, స్థలాల మీద పెట్టుబడులు పెట్టే సూచనలున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో రాశినాథుడు, చర, స్థిరాస్తులకు కారకుడైన గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల తప్పకుండా గృహ, వాహన యోగాలు కలుగుతాయి.

5 / 6
మకరం: ఆర్థిక భద్రత, స్థిర నివాసం వంటివి ఈ రాశివారి జీవిత లక్ష్యాలు. వీటిని సమకూర్చుకోవడానికి ఈ రాశివారికి శుభ గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది. వీరు ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలతో ఆదాయాన్ని మదుపు చేసి, అదనపు ఆదాయాన్ని వృద్ధి చేసుకుని సొంత ఇంటిని, సొంత వాహనాన్ని, స్థలాలను అమర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చేపట్టే ప్రయత్నాలకు అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉచ్ఛ గురువు బలం కూడా తోడవుతుంది. వీరికి ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక భద్రత కలుగుతాయి.

6 / 6
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..