- Telugu News Photo Gallery Spiritual photos Money Astrology 2025: These Lucky Zodiac Signs to Become Crorepatis Details in Telugu
ధన కారకుడు గురువు అనుగ్రహం.. ఈ రాశులవారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!
Money Astrology: ఈ నెల(ఆగస్టు) 16 నుంచి, అంటే రవి తన స్వక్షేత్రమైన సింహరాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి డిసెంబర్ 16 లోగా మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు తప్పకుండా ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఉంది. వీరు ఇంత వరకూ ఎంత సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ, ఈ నాలుగు నెలల కాలంలో అతి కొద్ది ప్రయత్నంతో మిలియనీర్లు కావడం మాత్రం తప్పకుండా జరుగుతుంది. ధన కారకుడైన గురువు బాగా అనుకూలంగా మారుతుండడంతో పాటు, అక్టోబర్ 5 నుంచి డిసెంబర్ 3 వరకు ఉచ్ఛ స్థితికి కూడా చేరుతున్నందువల్ల వీరి ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలించి కోటీశ్వరులు, అపర కుబేరులు కావడం జరుగుతుంది.
Updated on: Aug 15, 2025 | 3:13 PM

మేషం: ఏ విషయంలోనైనా అగ్రస్థానంలో ఉండాలన్న వీరి తపన వల్ల వీరు ఆదాయ వృద్ది మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. ధన కారకుడు గురువు ఈ ఏడాదంతా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వీరు అదనపు ఆదాయ ప్రయత్నాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. వీరి ప్రయత్నాలు ఫలించి ఈ రాశివారు అక్టోబర్, డిసెంబర్ నెలల మధ్య తప్పకుండా అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ఆదాయ ప్రయత్నాలన్నీ గ్రాండ్ సక్సెస్ అవుతాయి.

వృషభం: ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో సిద్ధహస్తులైన ఈ రాశివారికి ధన స్థానంలోనే గురువు సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆర్థిక లాభం పొందడం జరుగుతుంది. వీరి ప్రయత్నాలు, వీరి కృషి వల్ల ఆర్థిక పరిస్థితి క్రమంగా మారడం మొదలవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం, సంపద వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.

మిథునం: ఈ రాశిలో ధన కారకుడు గురువు సంచారం వల్ల ఈ రాశివారి దృష్టి ఆదాయ వృద్ధి మీద పడే అవకాశం ఉంది. దూరదృష్టికి, వ్యూహ, పథక రచనలకు మారుపేరైన ఈ రాశివారు తమ లక్ష్యాన్ని సాధించే విషయంలో ఏ విధంగానూ రాజీపడరు. తమకు అందివచ్చిన ప్రతి ఆదాయ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. అక్టోబర్, డిసెంబర్ నెలల మధ్య గురువు ధన స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల వీరి ప్రయత్నాలన్నీ సఫలమై, అపర కుబేరులుగా అవతరించే అవకాశం ఉంది.

సింహం: ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ ఏడాది ఈ రాశివారు తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. వీరి పట్టుదల, కృషి, వ్యూహాల వల్ల వీరు తప్పకుండా ఆదా యాన్ని, ఆస్తులను వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. లాభ స్థానంలో సంచారం చేస్తున్న గురువు ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలను కల్పించడం జరుగుతుంది. ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు కనక వర్షం కురిపిస్తాయి. ఆస్తిపాస్తులు సమకూరుతాయి.

తుల: వ్యాపార తత్వం ఎక్కువగా కలిగిన ఈ రాశివారు అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకునే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు వీరికి విపరీతంగా లాభిస్తాయి. అవసరమైతే, ఉద్యోగాలు మారడం, వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టడం జరుగుతుంది. గురువు భాగ్య స్థానంలో ఉన్నందువల్ల ఆదాయపరంగా వీరి అదృష్టం కొత్త పుంతలు తొక్కుతుంది. అనేక వైపుల నుంచి ధన ప్రవాహం ఉంటుంది. ఏ ఆదాయ అవకాశాన్నీ జారవిడుచుకోరు.

ధనుస్సు: ఈ ఏడాది వీరికి పూర్తి స్థాయిలో గురువు అనుగ్రహం కలుగుతుంది. సంపన్నుల కోవలో చేరా లన్న వీరి ఆశయం నెరవేరుతుంది. ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ప్రవేశం వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బడిముబ్బడిగా ధన లాభం కలుగుతుంది. ఆస్తుపాస్తుల విలువ అంచనాలకు మించి పెరుగుతుంది. లాటరీల ద్వారా ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం కూడా ఉంది.

కుంభం: పంచమ స్థానంలో ధన, లాభాధిపతి అయిన గురువు సంచారం వల్ల ఈ ఏడాది వీరి దృష్టి ఆదాయ వృద్ధి మీద కేంద్రీకృతమవుతుంది. వీరిలోని పట్టుదల, కృషి, దూరదృష్టి వంటి లక్షణాల వల్ల వీరు ఈ ఏడాది ఆదాయాన్ని, బ్యాంక్ బ్యాలెన్స్ ను బాగా పెంచుకోవడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అత్యధికంగా ధనాదాయ అవకాశాలు కలిసి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు ధనవర్షం కురిపిస్తాయి.



