- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti: These are the three secrets that make a person great!
చాణక్య నీతి : ఒక వ్యక్తిని గొప్పవాన్ని చేసే మూడు రహస్యాలు ఇవే!
ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గొప్పపండితుడు. తత్వవేత్త, చంద్రగుప్త మౌర్య సలహాదారు చాణక్యుడు. ఈయనను కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా ఎన్నో విషయాలను సమాజానికి అందించారు. అవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయి.
Updated on: Aug 14, 2025 | 4:28 PM

చాణక్యుడు గెలుపు, ఓటమి, రాజకీయం, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం, సమాజం, నైతికల విలువలు, ఆర్థిక అంశాలు, బంధాలు ఇలా ప్రతి ఒక్క విషయం గురించి ఎన్నో సూత్రాలను తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఒక వ్యక్తిని గొప్ప వాన్ని చేసే మూడు రహస్యల గురించి కూడా ఆయన గొప్పగా వివరించారు. దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆ చార్యచాణక్యుడు చెప్పిన ఎన్నో విషయాలు నేటి తరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, క్లిష్ట సమయాల్లో ఎలా ధైర్యంగా ఉండాలి. పరిస్థితులను ఎలా అనుకూలంగా మార్చుకోవాలి. ఇలా చాలా విషయాల గురించి ఆయన బోధించడం జరిగింది. అదే విధంగా చాణక్యుడు, కొన్ని రహస్యాలను పాటిస్తే జీవితాన్ని మార్చుకోవచ్చని తెలిపాడు. అవి ఏవి అంటే?

కష్టసమయాలను అవకాశాలుగా మార్చుకోండి అంటూ చాణక్యుడు తెలియజేశాడు. ఎందుకంటే, క్లిష్టపరిస్తుతుల్లో కొన్నింటిని వదులుకునే బదులు, పరిష్కారాల కోసం ఎదురు చూసే వారు మాత్రమే తమ జీవితాలకు దిశానిర్దేశం చేయగలుగుతారంట. అలాగే, ఇతరులపై కాకుండా మీ పై మీరే, ఆధారపడట, స్వాలంబన కలిగిన వారే జీవితంలో గొప్ప వ్యక్తిగా నిలుస్తారంట.

జీవితంలో ఎశరైనా సరే, సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే ఆ వ్యక్తి విజయం సాధిస్తాడని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు. అలాగే సంపద, పదవి ఎప్పు్డు కోల్పోతామో, ఎవ్వరికీ తెలియదు. అందుకే తెలివిని , మంచి జ్ఞానం మాత్రమే కోల్పోలేము కాబట్టి, జీవితంలో మొదట విద్యపై దృష్టిపెట్టమని చెబుతున్నాడు చాణక్యుడు.

అలాగే స్నేహితులలో శత్రువలను గుర్తించడం చాలా ముఖ్యం, ఇది తెలివైన పని. దీనిని ఎవరైతే తెలుసుకుంటారో, వారు తప్పక జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారని చెబుతున్నాడు ఆచార్య చాణఖ్యుడు. అలాగే ఎఫ్పుడూ కూడా తొందరపడి అడుగు వేయకూడదని చెబుతున్నాడు చాణక్యుడు.



