Nirjala Ekadashi: నిర్జల ఏకాదశి రోజున విష్ణువుని పూజించే విధానం .. పాటించాల్సిన నియమాలు

Nirjala Ekadashi: ఏకాదశి తిథికి హిందూ ధర్మలో చాలా ప్రాముఖ్యత ఉంది. అన్ని ఏకాదశిల్లో నిర్జల ఏకాదశి ఉత్తమమైనది. నిర్జల ఏకాదశి ఉపవాసాలను పాటించడం...

Nirjala Ekadashi: నిర్జల ఏకాదశి రోజున విష్ణువుని పూజించే విధానం .. పాటించాల్సిన నియమాలు
Nirjala Ekadashi
Follow us
Surya Kala

|

Updated on: Jun 19, 2021 | 10:45 AM

Nirjala Ekadashi: ఏకాదశి తిథికి హిందూ ధర్మలో చాలా ప్రాముఖ్యత ఉంది. అన్ని ఏకాదశిల్లో నిర్జల ఏకాదశి ఉత్తమమైనది. నిర్జల ఏకాదశి ఉపవాసాలను పాటించడం ద్వారా, 24 ఏకాదశి ఉపవాసాలకు సమానమైన ఫలితాలను పొందుతారని విశ్వాసం. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఏకాదశి ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది. ఒకసారి కృష్ణ పక్షంలో మరియు ఒకసారి శుక్ల పక్షంలో. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశిలు వస్తాయి. జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఏకాదశి విష్ణువుకు ప్రియమైనది. ఈ రోజు విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

నిర్జల ఏకాదశిని చేసేవారు పాటించాల్సిన నియమాలు

నిర్జల ఏకాదశి ఉపవాస సమయంలో కనీసం నీరు కూడా తాగారు. ఏకాదశి ఉపవాసం విడిచిన అనంతరం నీరు తాగుతారు. ఏకాదశి పూజ బ్రహ్మ ముహర్తంలో మొదలవుతుంది. అమృత కాలంతో ముగుస్తుంది.

నిర్జల ఏకాదశి పూజ విధానం:

బ్రహ్మ ముహర్త కాలంలో నిద్ర లేచి స్నానమాచరించాలి. దేవుడి ముందు దీపం వెలిగించాలి. తర్వాత విష్ణువును గంగా నీటితో అభిషేకం చేయాలి. విష్ణువుకు పువ్వులు, తులసిదళ్లను అర్పించండి. ఆరోజు విష్ణు సహస్రనామాలతో పూజని నిర్వహించండి.

పూజ అనంతరం విష్ణువు సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అయితే అలా నైవేద్యంగా సమర్పించే ఆహారంలో తలసి దళాన్ని వేయాలి. తులసి దళం లేని నైవేద్యాన్ని విష్ణువు స్వీకరించడని భక్తుల నమ్మకం. ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధించండి.

Also Read: వైద్య పరీక్షల నిమిత్తం భార్య తో కలిసి స్పెషల్ ప్లైట్ లో అమెరికాకు పయనమైన రజనీకాంత్