Monday Puja Tips: సోమవారం పొరపాటున కూడా ఈ వస్తువులతో శివయ్యకు పూజ చేయవద్దు.. ఆర్ధిక ఇబ్బందులు తప్పవు..
హిందూ మతంలో సోమవారం శివుడిని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివలింగాన్ని పూజించడం వల్ల జీవితంలోని అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సోమవారం రోజున శివలింగాన్ని పూజించే సమయంలో పొరపాటున కూడా శివలింగానికి కొన్ని వస్తువులను సమర్పించకూడదు. అవి ఏమిటో తెలుసుకోవాలి.
హిందూ మత గ్రంథాలలో సోమవారం ఉపవాసం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. శివుడిని భర్తగా పొందేందుకు పార్వతిదేవి సోమవారం రోజున ఉపవాసం ఉండేదని మత విశ్వాసం. సోమవారం సృష్టి లయకారుడైన మహా దేవుడిని పూజకు అంకితం చేయబడింది. సోమవారం రోజున ఉపవాసం చేయడం వలన లభించిన పుణ్యం వల్లే పరమశివుడు, పార్వతి వివాహం చేసుకున్నట్లు చెబుతారు. సోమవారం ఉపవాస సమయం ఉండి మహాదేవుడిని పూజించాలి. సోమవారం శివలింగానికి పూజ సముంలో పూలతో సహా అనేక వస్తువులు సమర్పిస్తారు.
అయితే శివలింగానికి కొన్ని వస్తువులను సమర్పించడం వలన అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని నమ్ముతారు. కనుక సోమవారం పూజ సమయంలో శివలింగానికి కొన్ని వస్తువులను పొరపాటున కూడా సమర్పించవద్దు. పురాణ గ్రంధాల ప్రకారం శివలింగానికి కొన్ని వస్తువులను సమర్పించడం నిషేధం. ఈ రోజు సోమవారం శివలింగానికి ఏమి సమర్పించకూడదో తెలుసుకుందాం.
శివలింగానికి ఏ వస్తువులు సమర్పించకూడదంటే
తులసి దళం: శివలింగానికి తులసి దళాలను సమర్పించకూడదు. పురాణాల ప్రకారం శివుడు తులసి భర్త జలంధరుడనే రాక్షసుడిని చంపాడు. ఈ కారణంగా శివలింగానికి తులసి ఆకులను సమర్పించకూడదు. అలాగే శివారాధనలో తులసి ఆకులను ఉపయోగించరాదు.
పసుపు: హిందూ మతంలో పసుపును పవిత్రమైనదిగా భావిస్తారు. పసుపును ప్రతి శుభ కార్యాలలో ఉపయోగిస్తారు. అయితే పసుపును శివలింగానికి సమర్పించకూడదు. శివయ్యను పుసుపుతో పూజిస్తే ఆగ్రహిస్తాడని పూజా ఫలితం లభించదని నమ్మకం.
కొబ్బరినీళ్లు: సోమవారం లేదా మరే ఇతర రోజు శివలింగానికి కొబ్బరినీళ్లు సమర్పించకూడదు. కొబ్బరి నీళ్లతో శివలింగానికి కోపం వస్తుందని మత విశ్వాసం. అలాగే వ్యక్తి జీవితంలో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
బియ్యం నూకలు: శివలింగానికి విరిగిన అన్నం అస్సలు నైవేద్యంగా పెట్టకూడదు. విరిగిన బియ్యం అంటే.. నూకలతో అక్షతలను ఉపయోగించవద్దు.. అదే సమయంలో అటువంటి బియ్యంతో చేసిన పదార్ధాలు నైవేద్యంగా పెట్టడం వల్ల శివునికి కోపం వస్తుందని, పూజ ఫలితం ఉండదని ఒక నమ్మకం. శివుడికి మాత్రమే కాదు ఏ పుజలోనూ పగిలిన అన్నం సమర్పించవద్దు.
నువ్వులు: నువ్వులను పాలలో కలిపి శివలింగానికి నైవేద్యంగా పెట్టకూడదు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.