AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohini Ekadashi: మోహిని ఏకాదశి రోజున ఈ కథను చదవండి.. అన్ని దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు..

మోహినీ ఏకాదశికి సంబంధించి సముద్ర మథనం సమయంలో అమృత పాత్ర లభించినప్పుడు దేవతలు,  రాక్షసుల మధ్య పంచుకోవడంలో గందరగోళం ఏర్పడిందని ఒక నమ్మకం. దేవతల కంటే రాక్షసులు ఎక్కువ శక్తిమంతులు కావడంతో రాక్షసులు దేవతలను ఆక్రమించడం ప్రారంభించారు. ఆ తర్వాత దేవతలందరూ విష్ణువును రక్షించమని అభ్యర్థించగా.. విష్ణువు మోహినీ రూపాన్ని ధరించి రాక్షసులను తన భ్రమలో చిక్కుకునే విధంగా చేసుకుని దేవతలకు అమృతాన్ని తాగడానికి ఇచ్చాడు.

Mohini Ekadashi: మోహిని ఏకాదశి రోజున ఈ కథను చదవండి.. అన్ని దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు..
Mohini Ekadashi 2024
Surya Kala
|

Updated on: May 13, 2024 | 6:45 PM

Share

హిందూ మతంలో మోహినీ ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు. పంచాంగం ప్రకారం మోహినీ ఏకాదశి  శనివారం, మే 18 వ తేదీ , 2024 ఉదయం 11.22 గంటలకు ప్రారంభమవుతుంది. మే 19, 2024న మధ్యాహ్నం 1.50 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి కారణంగా మే 19న మోహినీ ఏకాదశి ఉపవాసం ఉంటారు.

మోహినీ ఏకాదశి ప్రాముఖ్యత

మోహినీ ఏకాదశికి సంబంధించి సముద్ర మథనం సమయంలో అమృత పాత్ర లభించినప్పుడు దేవతలు,  రాక్షసుల మధ్య పంచుకోవడంలో గందరగోళం ఏర్పడిందని ఒక నమ్మకం. దేవతల కంటే రాక్షసులు ఎక్కువ శక్తిమంతులు కావడంతో రాక్షసులు దేవతలను ఆక్రమించడం ప్రారంభించారు. ఆ తర్వాత దేవతలందరూ విష్ణువును రక్షించమని అభ్యర్థించగా.. విష్ణువు మోహినీ రూపాన్ని ధరించి రాక్షసులను తన భ్రమలో చిక్కుకునే విధంగా చేసుకుని దేవతలకు అమృతాన్ని తాగడానికి ఇచ్చాడు. దీని ద్వారా దేవతలందరూ అమరత్వాన్ని పొందారు. అందుకే ఈ ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు.

మోహిని దేవీ గురించి పురాణాల కథ

పురాణాల ప్రకారం సరస్వతీ నది ఒడ్డున భద్రావతి నగరం ఉండేది. ద్యుతిమాన్ అనే చంద్రవంశీ రాజు ఆ నగరాన్ని పరిపాలించేవాడు. విష్ణు భక్తుడైన ధనపాల్ అనే వైశ్యుడు కూడా ఈ నగరంలో నివసించేవాడు. ధనపాల్ నగరంలో పూటకూళ్ల ఇల్లు, చెరువులు, బావులు, చెరువులు, ధర్మశాలలను నిర్మించారు. వైశ్యుడికి 5 కుమారులు ఉన్నారు. వారి పేర్లు సుమన్, సద్బుద్ధి, మేధావి, సుకృతి, దృష్ట బుద్ధి. అతని ఐదవ కుమారుడికి చెడు అలవాట్లు ఉన్నాయి. చెడు పనుల కోసం తన తండ్రి సంపదను నాశనం చేసేవాడు. అతని చర్యలతో కలత చెందిన ధనపాల్ అతడిని ఇంటి నుంచి గెంటేశాడు. ఆ తర్వాత ఆకలి, దాహంతో బాధపడుతూ  ధనపాల్ కొడుకు దొంగతనం బాట పట్టాడు. ఒకరోజు అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అయితే రాజు కూడా అతన్ని ధనపాల్ కొడుకుగా గుర్తించి కఠినమైన శిక్ష విధించలేదు.

ఇవి కూడా చదవండి

దీంతో దృష్ట బుద్ధి దొంగ తన మార్గాన్ని వదలలేదు. ఒక రోజు అతను మళ్లీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అతను రెండవసారి పట్టుబడినప్పుడు రాజు అతన్ని జైలులో పెట్టాడు. అక్కడ అతనికి తీవ్రమైన చిత్రహింసలను శిక్షగా ఇచ్చారు. అనంతరం నగరం నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత అతను అడవిలో నివసించడం ప్రారంభించాడు. జంతువులు, పక్షులను వేటాడడం ద్వారా తన జీవనోపాధిని పొందడం ప్రారంభించాడు. ఒక రోజు ఆకలి, దాహంతో విలవిలలాడుతూ ఆహారం కోసం కౌడిన్య ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో వైశాఖ మాసం, మహర్షి గంగలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు. మహర్షి తడి బట్టలు అతనిపై పడటం వల్ల అతనికి కొంత జ్ఞానం వచ్చింది.

కౌడిన్య ఋషి మోక్షమార్గాన్ని చూపాడు

దీంతో కౌడిన్య మహర్షికి చేతులు జోడించి.. ఓ మహర్షీ! నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను. ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఏదైనా పరిష్కారం చెప్పండి. మహర్షి సంతోషించి మోహినీ ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని కోరాడు. దీని వలన సమస్త పాపాలు నశిస్తాయి. ఆ తర్వాత నియమ నిష్ఠల ప్రకారం ఉపవాసం చేశాడు. ఈ వ్రత ప్రభావం వల్ల పాపాలన్నీ నశించి మరణానంతరం గరుడునిపై కూర్చొని విష్ణులోకానికి వెళ్లాడు. ఈ వ్రతం పాటించడం వల్ల ఋణానుబంధం ముగుస్తుంది. ఇంతకంటే మంచి ఉపవాసం లేదు. ఈ కథ చెప్పడం వల్ల వినడం వల్ల వెయ్యి గోవులను దానం చేసిన సమానమైన పుణ్యఫలం లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు