- Telugu News Photo Gallery Do you know what happens when you look at your face in mirror in morning? check here is details
Vastu Tips: లేచిన వెంటనే అద్దంలో మీ ముఖాన్ని మీరే చూసుకుంటున్నారా?
ఇంట్లో ఆడవాళ్లకు ఎన్నో పనులు ఉంటాయి. ఉదయం లేచింది మొదలు.. ఎంతో హడావిడిగా తమ పనులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జుట్టు సరిచేసుకోవడానికో.. ముఖం తుడుచుకోవడానికో లేచిన వెంటనే అద్దంలో తమ ముఖాన్ని తామే చూసుకుంటూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం అస్సలు మంచిది కాదట. రోజూ ఉదయాన్నే తమ ముఖాన్ని అద్దంలో చూసుకోవడం వలన పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు..
Updated on: May 13, 2024 | 5:51 PM

ఇంట్లో ఆడవాళ్లకు ఎన్నో పనులు ఉంటాయి. ఉదయం లేచింది మొదలు.. ఎంతో హడావిడిగా తమ పనులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జుట్టు సరిచేసుకోవడానికో.. ముఖం తుడుచుకోవడానికో లేచిన వెంటనే అద్దంలో తమ ముఖాన్ని తామే చూసుకుంటూ ఉంటారు.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం అస్సలు మంచిది కాదట. రోజూ ఉదయాన్నే తమ ముఖాన్ని అద్దంలో చూసుకోవడం వలన పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

నిద్ర లేచిన వెంటనే ఆడవారు తమ ముఖాన్ని అద్దంలో చూసుకోవడం వలన.. వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వస్తాయట. ఉదయాన్నే అద్దంలో ముఖాన్ని చూసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మీపై పడే అవకాశం ఉందని అంటున్నారు.

నెగిటివ్ ఎనర్జీ కారణంగా మానసిక సమస్యలు, కోపం, చిరాకు, ఆరోగ్యం దెబ్బతినడం, ఆత్మస్థైర్యం కోల్పోవడం వంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

అద్దంలో మీ ముఖాన్నిచూడటం వల్ల మీలో ఉండే శక్తిని అద్దాలు లాగేసుకుంటాయి. కాబట్టి ఉదయం లేవగానే అద్దాన్ని చూడటం మానుకోండి. మా బెడ్ రూమ్‌లో అద్దాలు ఉంటే.. వాటిపై ఓ క్లాత్ వంటివి కప్పేయండి.




