Medaram: మేడారం మినీ జాతరకు వేళాయే.. తేదీలు ప్రకటించిన ఆలయ కమిటీ.. ఉత్సవాలు ఎప్పటినుంచంటే..
Medaram: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పెరుగాంచిన సమ్మక్క-సారలమ్మ చిన్న జాతరకు వేళయింది.
Medaram: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పెరుగాంచిన సమ్మక్క-సారలమ్మ చిన్న జాతరకు వేళయింది. ప్రతి ఏటా జరిగే మేడారం చిన్న జాతర నిర్వహణకు ఆలయ కమిటీ అధికారులు సంసిద్ధమయ్యారు. వచ్చే నెలలో మేడారం మినీ జాతరను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ జాతర జరగనుందని అధికారులు ప్రకటించారు. కాగా, మేడారం చిన్న జాతర తేదీలు ఖారురు కావడంతో అధికారులు జాతర కోసం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మలు కొలువుదీరిన విషయం తెలిసిందే. గిరిజనులు ఆరాధ్య దైవంగా గెలిచే సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం ప్రధాన జాతరను రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులే కాకుండా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు.
Also read: