తిరుమల ఆలయం పరిసరాల్లో అడవి పందుల సంచారం.. స్పందించిన టీటీడీ అధికారులు
పుణ్యక్షేత్రంలో ఇటీవలి కాలంలో అడవి పందుల సంచారం పెరిగిపోయింది. అడవి నుంచి ఓ పందుల గుంపు ఆలయ పరిసరాల్లో సంచరిస్తోంది. అవి స్వేచ్చగా తిరుగుతున్నా...
Wild Boars at Tirumala Temple : తిరుమల అంటే ఓ పవిత్ర పుణ్య క్షేత్రం. కోరిన కోర్కెలు తీర్చే వెంకన్న కొలువుదీరిన దివ్య స్థలం. నిత్య కల్యాణం.. పచ్చతోరణంలా కళకళలాడుతుంటుంది. ఎప్పుడూ గోవింద నామ స్మరణతో మార్మోగుతూ ఉంటుంది. అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ, ప్రశాంత వాతావరణంతో భక్తులను పులకింపజేస్తుంది.
అలాంటి పుణ్యక్షేత్రంలో ఇటీవలి కాలంలో అడవి పందుల సంచారం పెరిగిపోయింది. అడవి నుంచి ఓ పందుల గుంపు ఆలయ పరిసరాల్లో సంచరిస్తోంది. అవి స్వేచ్చగా తిరుగుతున్నా పట్టించుకున్న నాథులే కరువయ్యారు. దీంతో పరిశుభ్రతకు, పవిత్రతకు మారుపేరైన తిరుమలలో..వరాహాలు సంచరిస్తుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం స్వామివారి వాహన సేవలు జరిగే మాడ వీధుల్లో పందులు ప్రవేశించడమేంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు. దీనిపై స్పందించిన అధికారులు.. ఇకపై శ్రీవారి ఆలయం వద్దకు పందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
లాక్ డౌన్ సమయంలో కొండపై జనసంచారం లేకపోవడంతో కొండకు సమీపంలోని ఫారెస్ట్ నుంచి వణ్యప్రాణుల సంచారం పెరిగింది.
ఇవి కూడా చదవండి :
Cooked Chicken : నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. ఇలా చేసి తినమంటు సూచనలు చేసిన కేంద్రం
భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా అండ్ మహీంద్రా.. ఒక్కో వాహనంపై ఎంత తగ్గింపు అంటే…