ఆలయం మనిషికి నైతికశక్తినిచ్చే సాధనం, సమాజ రక్షణకు మార్గం, మానసిక ప్రవర్తనలో మార్పు తెచ్చే నిలయం : చిన్న జీయర్ స్వామి

ఆలయం మనిషికి నైతిక శక్తిని ఇచ్చే సాధనం అని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చెప్పారు. ఆలయాలు సమాజ రక్షణకు మార్గమని మన పూర్వీకులు భావించారని..

  • Venkata Narayana
  • Publish Date - 12:30 pm, Sun, 17 January 21
ఆలయం మనిషికి నైతికశక్తినిచ్చే సాధనం, సమాజ రక్షణకు మార్గం, మానసిక ప్రవర్తనలో మార్పు తెచ్చే నిలయం : చిన్న జీయర్ స్వామి

ఆలయం మనిషికి నైతిక శక్తిని ఇచ్చే సాధనం అని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చెప్పారు. ఆలయాలు సమాజ రక్షణకు మార్గమని మన పూర్వీకులు భావించారని ఆయన తెలిపారు. మనిషిలో మానసిక ప్రవర్తనలో మార్పు తెచ్చేవి ఆలయాలని ఆయన ఉద్ఘాటించారు. దేవుడి సన్నిధి ప్రతీ చోటా ఉండాలని ఆలయాల నిర్మాణాలు జరిగాయని ఆయన స్పష్టం చేశారు. ఆ విలువను గుర్తించలేక.. ఆలయాలను రక్షించుకోవడం మానేశామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తీర్థ ప్రసాదాలు ఇచ్చే కేంద్రాలుగా ఆలయాలను చూస్తున్నామని, అందుకే ఇప్పుడు అనేక అనర్థాలు వస్తున్నాయని ఆయన అన్నారు. ఆలయాలను రక్షించుకోవాలని ఆయన సూచించారు. మన ఆశ్రద్ద వల్ల లోపాలు వస్తున్నాయి.. అందుకే ఒక కార్యాచరణతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నామని జీయర్ చెప్పారు. గత నెలలో జరిగిన రామతీర్థం ఘటన ఒక ఘాతుకమని, ఇలాంటి స్థితి ఎక్కడా తలెత్తకుండా చూసుకునేలా యాత్ర చేస్తున్నామని చిన్న జీయర్ స్వామి వెల్లడించారు.   ఆలయాలపై దాడుల నేపథ్యంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ఏపీ పర్యటన షురూ.. ఈ నెల 28 వరకు 5 జిల్లాల్లో యాత్ర