విశాఖ వాసులకు ముఖ్య గమనిక.. పలు స్పెషల్ రైళ్ల వేళల్లో మార్పులు.. పూర్తి వివరాలివే.!
Special Trains Timing Change: విశాఖ వాసులకు రైల్వే బోర్డు ముఖ్య గమనిక అందించింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ల సమయాల్లో...
Special Trains Timing Change: విశాఖ వాసులకు రైల్వే బోర్డు ముఖ్య గమనిక అందించింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పులు జరిగాయని.. ప్రయాణీకులు దాన్ని గమనించాలని వాల్తేర్ డివిజన్ మేనేజర్ ఏకే త్రిపాఠి కీలక ప్రకటన చేశారు. ఈ మార్పులు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
టైమింగ్స్ మారిన స్పెషల్ ట్రైన్స్ వివరాలు…
రాయగడ-విశాఖపట్నం(08507).. ఈ ట్రైన్ ప్రతీరోజూ ఉదయం 5.45 గంటలకు రాయగడలో బయల్దేరి. అదే రోజు ఉదయం 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 08508 నెంబర్‌తో విశాఖలో ప్రతీ రోజూ రాత్రి 6 గంటలకు బయల్దేరి.. రాయగడ రాత్రి 10.05 గంటలకు చేరుకుంటుంది. సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, పార్వతీపురం స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.
పలాస-విశాఖపట్నం(08531)… రోజూ పలాసలో ఉదయం 5 గంటలకు బయల్దేరి ఈ ట్రైన్ అదే రోజు ఉదయం 9.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08532) ప్రతీరోజూ సాయంత్రం 5.45 గంటలకు విశాఖలో బయల్దేరి రాత్రి 10 గంటలకు పలాస చేరుకుంటుంది. ఈ ట్రైన్ సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళంరోడ్డు, తిలారు, నౌపడ స్టేషన్లలో మాత్రమే హల్టింగ్ ఉంది.