Medaram Jatara 2022: వనదేవతలను దర్శించుకుని.. బంగారం మొక్కు చెల్లించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
Medaram Jatara 2022: ఆదివాసీ అస్తిత్వం మేడారం జాతర.. వాళ్ల పోరాటానికి చిహ్నం… అది జాతర కాదు.. ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక. గిరిజన స్వయంపాలనకు దిక్సూచి..
Medaram Jatara 2022: ఆదివాసీ అస్తిత్వం మేడారం జాతర.. వాళ్ల పోరాటానికి చిహ్నం… అది జాతర కాదు.. ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక. గిరిజన స్వయంపాలనకు దిక్సూచి అయిన మేడారం జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. అమ్మ తల్లుల జాతరలో ఆదివాసులే కాదూ.. సకల జనులూ భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. అమ్మా బైలెల్లినామో.. తల్లీ బైలెల్లినామో అంటూ సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma)ను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తూనే ఉన్నారు. పక్కరాష్ట్రాల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
తెలంగాణకు తలమానికంలా నిలిచే మేడారం జాతర ఈనె 16న ప్రారంభమైంది. వనదేవత సమ్మక్కను ఇవాళ మేడారం తీసుకొచ్చారు. చిలుకలగుట్ట దగ్గర భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను ప్రధాన పూజారి కొక్కెర కిష్టయ్య కోలాహలం నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క చేరికతో మేడారం జాతర పతాకస్థాయికి చేరుకుంది. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారలమ్మజాతరకు ప్రముఖులు క్యూ కట్టారు. అమ్మవార్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించుకున్నారు. తులాభారం వేసి అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.
సామాన్య భక్తులతో పాటు విఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మేడారం జాతరలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వరుసగా మూడవ రోజు బిజీ బీజీగా గడిపారు. సామన్య భక్తులతో పాటు వీఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నీ తానై ఏర్పాట్లను చూస్తున్నారు. సమ్మక్క- సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చే అతిధులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. శుక్రవారం మేడారం జాతరకు వచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సాదరంగా ఆహ్వానం పలికారు. అలాగే జాతరంతా కలియతిరుగుతూ… ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.
Also Read: