Main Door Vastu Tips: స్నానం చేసిన అనంతరం రోజూ ప్రధాన ద్వారం దగ్గర చేయాల్సిన చర్యలు.. వాటి వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే..

ఇంట్లోని అన్ని తలుపులు, కిటికీలను తెరవడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగెటివ్ ఎనర్జీ నాశనం అవుతుందని వాస్తు కూడా చెబుతోంది. అంతేకాదు ఉదయమే స్నానం చేసిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద 3 వస్తువులను చల్లడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని వాస్తులో కూడా చెప్పబడింది. ఈ రోజు ప్రధాన ద్వారం వద్ద చేయాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం.. 

Main Door Vastu Tips: స్నానం చేసిన అనంతరం రోజూ ప్రధాన ద్వారం దగ్గర చేయాల్సిన చర్యలు.. వాటి వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే..
Main Door Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: Jul 30, 2023 | 8:41 AM

వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఉదయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద సానుకూల శక్తి ఉంటుందని నమ్ముతారు. ఇంటి కిటికీలు, తలుపులు అన్నీ ఉదయాన్నే తెరవాలని హిందువుల విశ్వాసం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అదే సమయంలో ఉదయాన్నే ఇంట్లోని అన్ని తలుపులు, కిటికీలను తెరవడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగెటివ్ ఎనర్జీ నాశనం అవుతుందని వాస్తు కూడా చెబుతోంది. అంతేకాదు ఉదయమే స్నానం చేసిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద 3 వస్తువులను చల్లడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని వాస్తులో కూడా చెప్పబడింది. ఈ రోజు ప్రధాన ద్వారం వద్ద చేయాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం..

పసుపు నీటిని చిలకరించడం

సనాతన ధర్మంలో పసుపును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఉదయాన్నే ప్రధాన ద్వారం వద్ద నీటిలో పసుపు కలిపి ఆ నీటిని చల్లుకోవాలి. ఇలా చేయడం లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఉదయం పూజ సమయంలో రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో చిటికెడు పసుపు వేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీసుకొచ్చి ప్రధాన ద్వారం మీద చల్లాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి చుట్టూ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.ఇంట్లో దేనికీ లోటు ఉండదని విశ్వాసం.

గంగా జలం

హిందూ మత విశ్వాసాలలో గంగాజలం పవిత్ర జలంగా పరిగణించబడుతుంది. అన్ని రకాల ప్రతికూలతలను తొలగించే శక్తి గంగాజలానికి ఉందని చెబుతారు. రోజూ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని చుక్కల గంగాజలాన్ని చల్లండి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఒత్తిడి దూరమవుతుంది. అలాగే అన్ని రకాల ప్రతి కూలతలు ఇంటి నుండి పారిపోతాయి.

ఇవి కూడా చదవండి

ఉప్పునీరు చిలకరించడం

నిజానికి, ఉప్పు కూడా చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. చాలా మంది ప్రజలు తమ ఇంటిని  ప్రతిరోజూ ఉప్పునీటితో శుభ్రం చేసుకుంటారు. అంతే కాకుండా రోజూ మెయిన్ డోర్ పై నీళ్లలో ఉప్పును కలిపి ఆ నీటిని చిలకరిస్తే అన్ని రకాల బ్యాక్టీరియాలు నశిస్తాయి. అంతేకాదు ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశించదు. ఉప్పునీరు చల్లడం వల్ల అన్ని రకాల వ్యాధులు..ఇంటికి దూరంగా ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)