Maha Kumbha Mela: మహా కుంభ మేళాలో మొదటి రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి..

ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళా జాతర 2025 జనవరి 13 వ తేదీ నుంచి మొదలు కానుంది. కుంభమేళా సమయంలో నదీ స్నానం అత్యంత పవిత్రమని భావిస్తారు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు గంగా స్నానం కోసం పోటెత్తుతారు. దాదాపు 45రోజుల పాటు జరిగే ఈ కుంభమేళా జాతర సమయంలో కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో రాజ స్నానం చేస్తారు. మొదటి రాజ స్నానం ఎప్పుడు? అనుకూలమైన సమయం ఎప్పుడో తెలుసుకుందాం..

Maha Kumbha Mela: మహా కుంభ మేళాలో మొదటి రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి..
Maha Kumbha Mela 2025
Follow us
Surya Kala

|

Updated on: Dec 19, 2024 | 7:52 PM

మహా కుంభ మేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమం. ఈసారి ఈ మహా కుంభ మేళా 13 జనవరి 2025 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో జరగబోతోంది. ఈ మహా కుంభ మేళాలో ప్రపంచం నలుమూలల నుంచి సాధువులు, భక్తులు విశ్వాసంలో మునిగిపోతారు. ఈ మహా కుంభ మేళాలో ఆరు రాజ స్నానాలు జరగానున్నాయి. మహా కుంభ మేళాలోని మొదటి రాజ స్నానం 13 జనవరి 2025న జరుగుతుంది. ఈ రోజు పుష్య మాసం పౌర్ణమి. అందుకే మొదటి రోజు రాజ స్నానాన్ని పుష్య మాసం పౌర్ణమి స్నానం అని కూడా అంటారు.

మొదటి రాజ స్నానానికి శుభ సమయం ఏది?

పంచాంగం ప్రకారం నూతన సంవత్సరంలో పుష్య మాసం పూర్ణిమ తిధి జనవరి 13, 2025 ఉదయం 5.03 గంటలకు ప్రారంభమై జనవరి 14, 2025 తెల్లవారుజామున 3.56 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో పౌర్ణమి తిధి జనవరి 13 సోమవారం జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ రోజున పుష్య మాసం పూర్ణిమ స్నానం కూడా చేస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. ఈ రోజున చేసే రాజ స్నానానికి బ్రహ్మ ముహూర్తం ఉదయం 5.27 నుంచి 6.21 వరకు ఉంది.

పుష్య మాసం పౌర్ణమి ప్రాముఖ్యత

సనాతన ధర్మంలో పుష్య పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గంగ నదితో సహా పవిత్ర నదులలో స్నానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఈ రోజున దానధర్మాలు కూడా చేస్తారు. విశ్వాసాల ప్రకారం ఈ రోజున చేసే దానధర్మాలు వల్ల అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి. ఎంతో పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. ఈ రోజున లోక రక్షకుడైన శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు దానధర్మాలు చేసే వారిపై కురుస్తాయి.

ఇవి కూడా చదవండి

రాజ స్నానం చేయడం వలన కలిగే ప్రయోజనాలు

  1. సనాతన ధర్మం విశ్వాసాల ప్రకారం పుష్య మాసం పౌర్ణమి సందర్భంగా స్నానం చేయడం వల్ల శరీరం, మనస్సు, ఆత్మ శుద్ధి అవుతాయి.
  2. ఎవరైతే పుష్య పౌర్ణమి నాడు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ నశిస్తాయి. అలాగే మోక్షాన్ని పొందుతాడు.
  3. ఈ రోజు రాజ స్నానం చేసే వ్యక్తిని లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుంది. ఇల్లు సిరి సంపదతో నిండి ఉంటుంది.
  4. ఈ రోజు స్నానం చేసిన వ్యక్తి కోరికలన్నీ నెరవేరుతాయి. దీనితో పాటు గ్రహసంబంధమైన అడ్డంకులు కూడా తొలగిపోతాయి.
  5. ఈ రోజు స్నానం చేయడం వల్ల పంచేంద్రియాలు బలపడతాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.