ఆ రాష్ట్రంలో ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం.. దేవాలయ పవిత్ర, స్వచ్ఛత కాపాడేందుకు హైకోర్టు సంచలన తీర్పు
పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దేవాలయాల వద్దకు దైవ దర్శనం చేసుకునే సమయంలో కూడా సెల్ ఫోన్ వాడకాన్ని మానడం లేదు.. ఈ నేపథ్యంలో ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించింది మద్రాస్ హైకోర్టు
Mobiles Ban Inside Temples: నేటి మనిషి తినకుండా నిద్ర లేకుండా జీవిస్తాడు ఏమో గానీ.. సెల్ ఫోన్ లేకపోతే జీవించలేరేమో అన్న చందంగా కాలం మారిపోయింది. ఆహారం తినే సమయం నుంచి నిద్ర పోయేవరకూ ఎక్కడకు వెళ్లినా కర్ణుడి సహజ కవచ కుండలాలుగా సెల్ ఫోన్ ఉండాల్సిందే అనిపిస్తుంది నేటి మనుషులను చూస్తే ఎవరికైనా.. అయితే పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దేవాలయాల వద్దకు దైవ దర్శనం చేసుకునే సమయంలో కూడా సెల్ ఫోన్ వాడకాన్ని మానడం లేదు.. ఈ నేపథ్యంలో ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించింది మద్రాస్ హైకోర్టు. దేవాలయాల వద్ద ఫోన్ డిపాజిట్ లాకర్లు ఏర్పాటు చేయాలని మద్రా హైకోర్టు పేర్కొంది. దేవాలయాలలో మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించే చర్య ప్రార్థనా స్థలాల స్వచ్ఛత, పవిత్రతను కాపాడటానికే అంటూ కోర్టు స్పష్టం చేసింది. అయితే దేవాలయాకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయాల వద్ద ఫోన్ డిపాజిట్ లాకర్లు ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది.
సుబ్రమణ్య స్వామి ఆలయంలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు .. ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. పవిత్రమైన ఆలయాల్లో మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం భక్తుల దృష్టి మరల్చడంతోపాటు దేవతల చిత్రాలను ఫోన్లలో తీయడం ఆగమ శాస్త్ర నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు. ఆలయాల్లో తీస్తున్న ఫొటోలవలన దేవాలయాల భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని చెప్పారు. అంతేకాదు తమ అనుమతి లేకుండా తమ చిత్రాలను తీస్తుండడంవలన మహిళల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని ఆయన అన్నారు. అంతేకాదు దేవాలయాలకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులను ధరించేలా డ్రెస్ కోడ్‌ను అనుసరించాలని కూడా సుబ్రమణ్య స్వామి కోరుకుంటున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..