Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Dev Worship: శని దోషం, ఏలిన నాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారా.. నల్ల నువ్వులతో ఇలా చేసి చూడండి

శని దోషం పోవాలంటే మంగళవారం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ పరిహారం ద్వారా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని నమ్మకం. 

Shani Dev Worship: శని దోషం, ఏలిన నాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారా.. నల్ల నువ్వులతో ఇలా చేసి చూడండి
Shani Dev Worship
Follow us
Surya Kala

|

Updated on: Dec 03, 2022 | 4:25 PM

తిలలు అంటే నువ్వులు విష్ణువు చెమట నుండి ఉద్భవించాయి కాబట్టి నల్ల నువ్వులు విష్ణువుకు చాలా ప్రీతికరమైనవని శాస్త్రాలలో చెప్పబడింది. అందుకే వీటిని భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తారు. నల్ల నువ్వులు ఉపయోగించకుండా ఏ పూజా పరిపూర్ణం కాదని నమ్మకం. అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల నువ్వులకు సంబంధించిన కొన్ని చర్యలు జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, గ్రహాల అశుభ చెడు దృష్టి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా ఏలిన నాటి శని దోషం నుంచి పరిహారంగా ఉపయోగపడతాయి.

శనిదోషం తొలగిపోవాలంటే శని దోషం పోవాలంటే పచ్చి పాలు, పంచదార, నల్ల నువ్వులను నీళ్లలో కలిపి శనివారం నాడు రావి చెట్టుకు నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేసిన తర్వాత.. రావి చెట్టుకు మూడుసార్లు ప్రదక్షిణ చేయండి. శనివారం రోజున నువ్వులు కలిపిన కిచడీని ఆహారంగా తీసుకోండి. ఇలా చేయడం వలన అనేక రకాల దుఃఖాలు కూడా తొలగిపోతాయి. శని దోషం పోవాలంటే మంగళవారం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ పరిహారం ద్వారా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని నమ్మకం.

ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కష్టపడి పనిచేసినా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నా.. మీకు డబ్బు విషయంలో అన్ని వైపుల నుండి నిరాశ ఎదురవుతున్నా నల్ల నువ్వులు, నల్ల ఉల్లిని నల్లని బట్టలను ప్రతి శనివారం పేదలకు దానం చేయండి. ఇలా చేయడం ద్వారా.. క్రమంగా ఆర్ధిక ఇబ్బందులు తొలగి.. డబ్బును ఆదా చేయగలుగుతారు.. వ్యాపారం కూడా పుంజుకుంటుంది.

ఇవి కూడా చదవండి

వ్యాధుల నుండి బయటపడటానికి ప్రతిరోజూ ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటిని తీసుకుని అందులో నల్ల నువ్వులను వేయాలి. ఆ తర్వాత ఈ నీటితో శివలింగానికి జలాభిషేకం చేయండి. నీటిని సమర్పించేటప్పుడు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. దీని ద్వారా వ్యక్తికి రోగాల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

పితృ దోష నివారణ కోసం పితృ దోషం వల్ల కొన్నిసార్లు జీవితంలో సమస్యలు కలుగుతాయని నమ్మకం. ఏ వ్యక్తి జాతకంలోనైనా  కాలసర్పం, పితృ దోషం, ఏలిన నాటి శని దోషము ఉన్నా.. ఆవనూనెలో నల్ల నువ్వులను వేసి శనివారం నాడు తమ ఛాయను చూడాలి. ఇప్పుడు ఈ నూనెను దేవాలయంలో లేదా రావి చెట్టు వద్ద ఉంచినా ప్రయోజనం ఉంటుంది.

పనిలో విజయం కోసం మీరు చేసే పనిలో ఏదైనా అడ్డంకి ఏర్పడి విజయం సాధించలేకపోతే.. ఆ పని కోసం బయటికి వెళ్లేటప్పుడు.. మీరు ఒక గుప్పెడు నువ్వులను తీసుకుని.. దారిలో ప్రవహించే నీటిలో ఎక్కడైనా వేయండి. ఇలా చేయలేని పక్షంలో పేదవాడికి నువ్వులు దానం చేస్తే మేలు జరుగుతుంది.

సూర్యుడు శుభ దృష్టి కోసం  మీ జాతకంలో రవి బలంగా ఉంటే.. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. సూర్యుని దృష్టి అశుభంగా ఉంటే దీని ప్రభావంతో బాధపడే వారు స్నానం చేసిన తర్వాత సూర్యోదయానికి ముందే తిలాంజలి ఇస్తే.. రవి స్థానం బలపడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..