Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lunar Eclipse 2022 : ఈ రాశులవారు చంద్రగ్రహణం తర్వాత జాగ్రత్తగా ఉండండి.. ఇందులో మీ రాశి ఉందో లేదో చెక్‌ చేసుకోండి..

ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజునే చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో పలు రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని జ్యోతిశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.మీరు తరచూ అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.

Lunar Eclipse 2022 : ఈ రాశులవారు చంద్రగ్రహణం తర్వాత జాగ్రత్తగా ఉండండి.. ఇందులో మీ రాశి ఉందో లేదో చెక్‌ చేసుకోండి..
Zodiac Signs loyalty chart
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 02, 2022 | 7:13 AM

నవంబర్ నెలలో ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.. నవంబర్‌ 08 మంగళవారం రోజున ఏర్పడనున్న చంద్రగ్రహణం భారతదేశంలోని కోల్‌కతా, సిలిగురి, పాట్నా, రాంచీ, గౌహతి మొదలైన ప్రదేశాలలో సంపూర్ణంగా కనిపించే అవకాశాలున్నాయని ఖగోళ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజునే చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో కింద పేర్కొన్న మూడు రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని జ్యోతిశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 200 సంవత్సరాల తర్వాత ఈ సారి ఏర్పడబోయే చంద్రగ్రహణం రోజున రెండు దుష్ట యోగాలు ఏర్పడుతున్నాయంటున్నారు. ఫలితంగా కొన్ని రాశివారిపై దుష్ప్రభావాలుంటాయని చెబుతున్నారు.. అంగారక గ్రహానికి దగ్గరగా ఉన్నందుకు షష్టక యోగం, నీచరాజ్ భంగ యోగం ఆ దుష్ట యోగాన్ని సృష్టిస్తున్నాయి. మేషరాశిలో గ్రహణం ఉండబోతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అందులో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఏ పూజ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

మేష రాశి : చంద్రుడిప్రభావం మేష రాశిపై పడుతుంది. ఈ రాశి వారి పిల్లలపై దీని ఎఫెక్ట్​ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి వారు ఆందోళన చెందకుండా పిల్లలపై, చదువులపై శ్రద్ధ పెట్టాలి. వారిని ప్రోత్సహిస్తూ ఎడ్యుకేషన్​పై దృష్టి సారించేలా చూడాలి. మీరు తరచూ అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు, డ్రైవింగ్​ చేసే సమయంలో.. రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. హనుమంతుడు ఆరోగ్యప్రదాత..  మంగళవారాలు ఆంజనేయుడి గుడికి వెళ్లి కొబ్బరి కాయ కొట్టండి. హనుమాన్ చాలీసా చదవాలి.

తుల రాశి : చంద్రగ్రహణం తులారాశి వారికి కూడా కష్టంగానే ఉంటుంది. చంద్రుడి గ్రహణం వల్ల ఈ రాశి వారికి ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన చోట్ల అధికంగా ధనం వృథా అవుతుంది. దీని కారణంగా ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. ఈ సమయంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఒక విషయంలో జీవిత భాగస్వామితో గందరగోళం ఏర్పడవచ్చు. ఆఫీసులో జాగ్రత్త వహించండి. కోర్టు వివాదాలు వచ్చే అవకాశం ఉంది. తుల రాశి వారికి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారం చేసే తులారాశి వారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది. ఏ పనిలోనైనా జాగ్రత్త అవసరం. గణపతిని పూజించండి, మీ రాశిపై ఉన్న దృష్టి పోతుంది.

ఇవి కూడా చదవండి

కుంభ రాశి : ఈ రాశి వారి ఆరోగ్యంపై చంద్రగ్రహణంప్రభావం చూపుతుందట. తరచూ అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు, డ్రైవింగ్​ చేసే సమయంలో.. రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. హనుమంతుడు ఆరోగ్యప్రదాత కావునా 11 మంగళవారాలు ఆంజనేయుడి గుడికి వెళ్లి కొబ్బరి కాయ కొట్టండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి