Lord Shiva: శివయ్యను పూజించే సమయంలో పొరపాటున కూడా ఈ ఐదు తప్పులు చేయవద్దు..

శివయ్య సంతోష పడితే.. ఎంతగా తన భక్తులను అనుగ్రహిస్తాడో.. అదే విధంగా ఆయనకు కోపం వస్తే.. అంతగా ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తాడు. కనుక జంగమయ్యను పూజించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

Lord Shiva: శివయ్యను పూజించే  సమయంలో పొరపాటున కూడా ఈ ఐదు తప్పులు చేయవద్దు..
Lord Shiva Puja On Monday
Follow us

|

Updated on: Dec 25, 2022 | 8:37 AM

లయకారుడు శివుడిని పూజించడం ద్వారా అన్ని రకాల కోరికలు వీలైనంత త్వరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పరమశివుడిని కేవలం మానవులు మాత్రమే కాదు దేవతలు , రాక్షసులు, మునులు సైతం పూజిస్తారు. నిండైన హృదయంతో  జలంతో అభిషేకించిన సంతోషించి తన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే గరళకంఠుడు. అందుకే శివుడిని భోళాశంకరుడు అని పిలుస్తారు. శివయ్య సంతోష పడితే.. ఎంతగా తన భక్తులను అనుగ్రహిస్తాడో.. అదే విధంగా ఆయనకు కోపం వస్తే.. అంతగా ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తాడు. కనుక జంగమయ్యను పూజించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పూజలు తప్పుగా చేస్తే  శివయ్యకు కోపం వస్తుంది. అటువంటి పరిస్థితిలో శివుని పూజించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

తులసి దళం:  హిందూ మతంలో తులసి మొక్క చాలా పవిత్రమైనది. తులసి దళం లేకుండా విష్ణువు , శ్రీకృష్ణుని ఆరాధన సంపూర్ణంగా పరిగణించబడదు. అయితే శివుడికి తులసి ఆకును సమర్పించడం నిషేధం. పొరపాటున కూడా శివలింగానికి తులసి దళాన్ని సమర్పించవద్దు. వాస్తవానికి.. దీని వెనుక ఒక పురాణం కథ ఉంది.  దాని ప్రకారం తులసికి బృంద అనే పేరు కూడా ఉంది. శివుడు .. బృంద భర్త జలంధరుడనే రాక్షసుడిని సంహరించాడు. అందుకే తులసి శివుడిని శపించింది. ఈ కారణంగా శివయ్యకు తులసిని సమర్పించడం నిషేధించబడింది.

ఎరుపు పువ్వు శివుడికి బిల్వ పత్రం, మారేడు, జమ్మి,  తెల్లని పుష్పలు చాలా ఇష్టం. అయితే శివుడి పూజకు ఎర్రటి పువ్వులను ఉపయోగించడం నిషేధం. శివుని పూజకు  తామర పువ్వు, ఎర్రటి మందారం, గులాబీ పువ్వు, మొగలి పువ్వు వంటి వాటిని ఉపయోగించడం నిషేధించబడింది.

ఇవి కూడా చదవండి

శంఖం:  హిందూ మతంలో శంఖం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శంఖం శబ్దంతో ప్రతికూల శక్తి నశిస్తుందని నమ్మకం. పూజా స్థలంలో శంఖాన్ని పూజించడం సాంప్రదాయం. అయితే శివుని పూజలో శంఖాన్ని ఉపయోగించడం నిషేధించబడింది. శంఖచూరుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించినట్లు ఒక నమ్మకం. ఈ కారణంగా శివుని పూజలో శంఖాన్ని ఉపయోగించడంపై నిషేధించబడింది.

కొబ్బరి కాయ హిందూమతంలో.. కొబ్బరికాయకు విశిష్ట స్థానం ఉంది. పూజాధికార్యక్రమాలతో పాటు వివాహాది శుభకార్యాలకు కొబ్బరికాయను తప్పనిసరిగా ఉపయోగిస్తారు.  అయితే శివుని పూజలో కొబ్బరికాయను ఉపయోగించరు. అంతేకాదు కొబ్బరి నీటిని ఉపయోగించడం కూడా నిషేధం. వాస్తవానికి, కొబ్బరికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి విష్ణువు భార్య.. కనుక శివుని పూజలో కొబ్బరికాయను సమర్పించడం నిషేధించబడింది.

స్మశానంలో నివసించే శివుడు యోగి. పౌరుషానికి ప్రతీక, అందుకే పసుపు, కుంకుమ, సౌందర్య వస్తువులను శివయ్య పూజలో ఉపయోగించరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Latest Articles
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..