Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shiva Worship: సోమవారం శివారాధన చేస్తే చక్కటి ఫలితాలు.. శనిదోష సమస్యలకు స్వస్తి..!

Lord Shiva Worship: హిందూ మతంలో చాలామంది సోమవారం శివారాధన చేస్తారు. మూలానికి నీళ్ళు పోసినప్పుడు కొమ్మల రూపంలో ఉండే దేవతలందరూ

Lord Shiva Worship: సోమవారం శివారాధన చేస్తే చక్కటి ఫలితాలు.. శనిదోష సమస్యలకు స్వస్తి..!
Lord Shiva
Follow us
uppula Raju

|

Updated on: Jan 24, 2022 | 3:27 PM

Lord Shiva Worship: హిందూ మతంలో చాలామంది సోమవారం శివారాధన చేస్తారు. మూలానికి నీళ్ళు పోసినప్పుడు కొమ్మల రూపంలో ఉండే దేవతలందరూ స్వయంచాలకంగా సంతోషిస్తారని నమ్ముతారు. దేవతల దేవుడిగా పిలువబడే మహాదేవుడు చాలా సరళుడు, అమాయకుడు అందుకే అతడిని భక్తులు భోలేనాథ్ అని పిలుస్తారు. శివుని ఆరాధన ఏ రోజున ఏ సమయంలోనైనా చేయవచ్చు అయితే సోమవారం శివారాధనకు ప్రత్యేకంగా అంకితం చేశారు. అంతేకాదు సోమవారం శివుడిని పూజించిన వెంటనే అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. శివుని ఆరాధనకు సంబంధించిన కొన్ని సాధారణ చర్యల గురించి తెలుసుకుందాం.

శివారాధనతో శని దోషం తొలగిపోతుంది

మీ జాతకంలో శని దోషం ఉంటే జీవితంలో అన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. అప్పుడు శివారాధన మీకు ఒక వరం కంటే తక్కువేమి కాదు. శని దోషాన్ని తొలగించడానికి ప్రతిరోజూ రాగి పాత్రతో శివలింగానికి జలాభిషేకం చేయాలి. రుద్రాక్షతో కూడిన జపమాలతో శివుని మంత్రాన్ని జపించాలి.

శివారాధనతో ఆరోగ్య దీవెనలు

మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే చికిత్స తర్వాత కూడా నయం కాకుంటే మృత్యుంజయ శివుడిని ఆరాధించాలి. శివుని అనుగ్రహం పొందడానికి కొన్ని పాలు, నల్ల నువ్వులను నీటిలో కలిపి సోమవారం శివలింగానికి సమర్పించాలి. ఈ పరిహారంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని కనీసం 11 రౌండ్లు జపించాలి. ఈ పరిహారాన్ని భక్తిశ్రద్ధలతో చేయడం వల్ల మీకు త్వరలో మంచి ఆరోగ్యం లభిస్తుంది.

గంగాజలంతో కోరికలు నెరవేరుతాయి

శివుని ఆరాధనలో గంగాజలాన్ని సమర్పిస్తే చాలా మంచిది. పవిత్రమైన శ్రావణ మాసంలో శివభక్తులు అనేక కిలోమీటర్లు నడిచి గంగాజలం తెచ్చి శివునికి సమర్పించడానికి ఇదే కారణం. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత మీ కోరికలు ఏవైనా నెరవేరకపోతే మీరు ప్రతి సోమవారం శివలింగానికి గంగాజలాన్ని సమర్పించాలి. ఈ పరిహారం చేయడం ద్వారా మీ కోరికల మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

వివాహ కోరిక నెరవేరుతుంది

మీ వివాహానికి తరచుగా అడ్డంకులు ఎదురవుతున్నట్లయితే లేదంటే వివాహం కుదిరిన తర్వాత చెడిపోతుంటే మీరు ప్రతి సోమవారం కుంకుమ కలిపిన నీటితో శివలింగానికి జలాభిషేకం చేయాలి. ఈ పరిహారం చేయడం వల్ల మీ సమస్యలు తొలగిపోయి మీకు కావలసిన జీవిత భాగస్వామి లభిస్తారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

Post Office Charges: పోస్టాఫీసు లావాదేవీలు, డిపాజిట్లపై ఎంత ఛార్జ్‌ వసూలు చేస్తుందో తెలుసా..?

Omicron New Symptom: ఒమిక్రాన్ కొత్త లక్షణం వెలుగులోకి.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..

Knowledge: ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..?