- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips in Telugu: These Vastu related mistakes may be the reason behind fights in your house, know
Vastu Tips: ఇంట్లో గొడవలకు వాస్తు దోషాలు కూడా కారణం కావచ్చు.. ఈ తప్పులు చేస్తున్నారేమో చూడండి
Vastu Tips: వాస్తు(Vastu)లో ఉన్న లోపాల వల్ల ఆర్థికంగా, శారీరకంగానే కాకుండా దంపతుల(Couple) మధ్య కొన్నిసార్లు గొడవలు ఎక్కువ అవుతాయి. ఒకొక్కసారి విడిపోవాలి అనుకునే వరకూ ఆ గొడవలు చేరుకుంటాయి. అందుకనే వాస్తు దోషాలు ఉంటే వాటిని సరిచేసుకోవడం ముఖ్యం. అలాంటి కొన్ని వాస్తు దోషాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
Updated on: Jan 24, 2022 | 3:08 PM

ఇంట్లో ఉన్న పూజ గది రకాల సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అందుకనే పూజగదికి సంబంధించి వాస్తు దోషం ఉండటం శ్రేయస్కరం కాదు. వాస్తు ప్రకారం, విగ్రహాలను ఎప్పుడూ ఒకదానికి ఒకటి ఎదురెదురుగా పెట్టకూడదు ఇలా దేవుడి విగ్రహాలు ఉంటే కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు నెలకొని తరచూ గొడవలు కూడా జరుగుతాయని చెబుతున్నారు. కనుక మీ పూజ గదిలో కనుక ఇలాగే ఉంటే ఈరోజే మార్పులు చేసుకోండి.

ఇంట్లో బల్బులు లేదా లైట్లు కూడా వాస్తు ప్రకారం ఉండాలి. లేదంటే అశుభంగా పరిగణించబడుతుంది. ఇంటి మూలల్లో చీకటిగా ఉంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, కలహాలు ఏర్పడతాయని అంటున్నారు.

చీపురు సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవికి చిహ్నం. దీనిని పెట్టె ప్లేస్ సరైనది కాకపోతే.. కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. చీపురు ఇంట్లో జనం కంట పడని చోట ఉంచాలని అంటారు. అలాగే పొరపాటున కూడా చీపురు వంటగదిలో పెట్టకూడదు. ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.

ఇంట్లో ఎక్కడైనా నీరు కారుతున్న సమస్య ఉంటే ఇది పెద్ద వాస్తు దోషమని చెబుతున్నారు. నీరు కారడం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని నమ్మకం. కనుక ఎక్కడ నుంచి అయినా నీరు కారు తుంటే.. వెంటనే సరిచేయండి.

రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది




