AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..?

Assembly Election 2022: కొద్ది రోజుల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో చాలామంది పోటీ చేస్తారు.

Knowledge: ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..?
Election Contest
uppula Raju
|

Updated on: Jan 24, 2022 | 2:18 PM

Share

Knowledge: కొద్ది రోజుల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో చాలామంది పోటీ చేస్తారు. సమాజానికి ఏదైనా చేయాలని అనుకుంటే మీరు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అయితే చాలా మంది ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు కానీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సంక్లిష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అర్హతలు ఏంటి, ఎలాంటి పత్రాలు సబ్‌మిట్‌ చేయాలి. తదితర వివరాల గురించి తెలుసుకుందాం.

ఎన్నికల్లో ఎవరు పోటీ చేయవచ్చు?

సాధారణ నిబంధనల గురించి మాట్లాడినట్లయితే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక వ్యక్తి భారతదేశ పౌరుడిగా ఉండటం అవసరం. దీంతో పాటు ఆ వ్యక్తి పేరు ఓటరు జాబితాలో ఉండాలి. మీరు పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గం నుంచి ఓటరు కావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఓటు వేసినా ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ చేయవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి వయస్సు గురించి మాట్లాడితే 25 ఏళ్లు పైబడిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. ఇది కాకుండా వ్యక్తి పూర్తిగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటం అవసరం.

ఎన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చు?

1996కి ముందు సెక్షన్ 33 ప్రకారం అభ్యర్థి ఎన్ని నియోజకవర్గాలలోనైనా పోటీ చేసే అవకాశం ఉండేది. అయితే అభ్యంతరాలు రావడంతో 1996లో ఈ నిబంధనను సవరించారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33 (7) ప్రకారం, ఇప్పుడు ఎన్నికల్లో గరిష్టంగా రెండు స్థానాల నుంచి మాత్రమే పోటీ చేయవచ్చు. అంటే ఒక వ్యక్తి రెండు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది. రెండు స్థానాల్లో గెలిస్తే ఒక్క సీటును వదులుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజుల్లోగా ఆయన ఈ పని చేయాలి. ఆ తర్వాత ఖాళీ అయిన సీటుకు మళ్లీ ఎన్నికలు జరుగుతాయి.

ఏ పత్రాలు అవసరం?

ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్నికల కమిషన్ సూచించిన విధానం ప్రకారం అభ్యర్థి అనేక రకాల ఫారమ్‌లను పూరించాలి. అనేక ప్రశ్నలకు వివిధ రూపాల్లో సమాధానాలు చెప్పాలి. అభ్యర్థి వ్యక్తిగత గుర్తింపు, చిరునామా, వయస్సు, ఆస్తులు, కోర్టు కేసులకి సంబంధించి అన్ని పత్రాలను సమర్పించాలి. దీంతో పాటు ఇంటి పన్ను చెల్లింపు రసీదు, అన్ని పన్నుల రసీదు సమాచారం కూడా ఇవ్వాలి. పార్టీ నుంచి పోటీ చేస్తే గుర్తు కేటాయింపు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.

మొత్తం ప్రక్రియ ఏమిటి?

ముందుగా ఎన్నికల కమిషన్ అన్ని ఫారమ్స్‌ని పూరించాలి. ఇది కాకుండా ఇద్దరు సాక్షులతో పాటు అఫిడవిట్ సమర్పించాలి. అందులో తన గురించి, తన ఆస్తి గురించి సమాచారం ఇవ్వాలి. ఈ ప్రక్రియ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఉంటుంది. ఆఫ్‌లైన్ విధానంలో ఎంపిక చేయాలంటే కలెక్టరేట్‌లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మీరు ఈ వెబ్‌సైట్ https/suvidha.eci.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ మాధ్యమంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయవచ్చు. ఆన్‌లైన్ ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ఇందులో ఒకటి దరఖాస్తు, అఫిడవిట్, మూడోది అనుమతి దశ. ఇక్కడ మీరు అనేక పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

JIO, Airtel: జియో, ఎయిర్‌టెల్‌ 300 ప్లాన్.. ధర ఒకే విధంగా ఉన్నా ప్రయోజనాలు వేరు..?

Delhi Rains: దేశ రాజధానిలో 122 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన వర్షం.. గత 24 గంటల్లో 19.7 మిల్లీమీటర్ల వర్షం

Post Office: పోస్టాఫీసులోని ఈ ఖాతా గురించి మీకు తెలుసా..? ప్రతి పైసా సురక్షితం..