AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JIO, Airtel: జియో, ఎయిర్‌టెల్‌ 300 ప్లాన్.. ధర ఒకే విధంగా ఉన్నా ప్రయోజనాలు వేరు..?

JIO, Airtel: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ల మధ్య పోటీ ఎప్పుడు ఉంటుంది. రెండు కంపెనీలు నిరంతరం కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతుంటాయి. అయితే

JIO, Airtel: జియో, ఎయిర్‌టెల్‌ 300 ప్లాన్.. ధర ఒకే విధంగా ఉన్నా ప్రయోజనాలు వేరు..?
Jio And Airtel
uppula Raju
|

Updated on: Jan 24, 2022 | 9:57 AM

Share

JIO, Airtel: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ల మధ్య పోటీ ఎప్పుడు ఉంటుంది. రెండు కంపెనీలు నిరంతరం కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతుంటాయి. అయితే 300లోపు ఉన్న ఈ రెండు కంపెనీల ప్లాన్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం. రెండు ప్లాన్‌ల ధర ఒకేలా ఉన్నప్పటికీ ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. వాటిని బట్టి మీకు ఏ ప్లాన్ ఉత్తమమో సెలక్ట్‌ చేసుకోండి.

రిలయన్స్ జియో రూ.299 ప్లాన్

రిలయన్స్ జియో రూ. 299 ప్లాన్‌ని కలిగి ఉంది. ఇందులో వినియోగదారులు ప్రతిరోజూ 2 GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ కింద వినియోగదారులు అపరిమిత కాలింగ్ పొందుతారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 100 మెస్సేజ్‌లను ఉచితంగా పొందుతారు. మొత్తం డేటా గురించి మాట్లాడితే వినియోగదారులు 56 GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. అలాగే ఈ ప్లాన్‌లు Jio కాంప్లిమెంటరీ యాప్‌ల యాక్సెస్‌ను పొందుతాయి. అవి JioTV, JioCinema, JioSecurity లాంటివి.

ఎయిర్‌టెల్ రూ. 299 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ. 299 ప్లాన్. ఇందులో రోజువారీ వినియోగదారులు 1.5 GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. వాయిస్ కాలింగ్ కోసం వినియోగదారులకు అపరిమిత కాలింగ్ ఇచ్చారు. ఈ ప్లాన్‌లో రోజుకు 100 SMSల ఆఫర్ ఉంది. ఇతర ప్రయోజనాల గురించి మాట్లాడితే.. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ ఫ్రీకి ఉచిత యాక్సెస్ ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్‌లో ఫాస్టాగ్‌లో రూ.100 క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది.

మీరు వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే జియో ప్లాన్‌కు ఎక్కువ ఇంటర్నెట్ డేటా లభిస్తోంది. ఎందుకంటే రిలయన్స్ జియో తన ప్లాన్‌లో మొత్తం 56GB డేటాను అందిస్తుంది. అయితే Airtel 42GB డేటాను మాత్రమే అందిస్తోంది. ఈ కాలింగ్, SMS కోసం ఈ రెండు ప్లాన్‌లలో ప్రయోజనాలు ఒకే విధంగా ఉండటం మనం గమనించవచ్చు.

Delhi Rains: దేశ రాజధానిలో 122 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన వర్షం.. గత 24 గంటల్లో 19.7 మిల్లీమీటర్ల వర్షం

Post Office: పోస్టాఫీసులోని ఈ ఖాతా గురించి మీకు తెలుసా..? ప్రతి పైసా సురక్షితం..

Sleep Mistakes: మీరు బాగా నిద్రపోవాలంటే పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు..?