Sleep Mistakes: మీరు బాగా నిద్రపోవాలంటే పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు..?

Sleep Mistakes: కొన్నిసార్లు రాత్రి నిద్రపోయినప్పటికీ ఉదయం లేవగానే చాలా అలసిపోతారు. తగినంత నిద్ర లేకపోవడమే దీనికి కారణం. రాత్రిపూట సరిపడా

Sleep Mistakes: మీరు బాగా నిద్రపోవాలంటే పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు..?
Sleeping Disorder
Follow us
uppula Raju

|

Updated on: Jan 24, 2022 | 7:52 AM

Sleep Mistakes: కొన్నిసార్లు రాత్రి నిద్రపోయినప్పటికీ ఉదయం లేవగానే చాలా అలసిపోతారు. తగినంత నిద్ర లేకపోవడమే దీనికి కారణం. రాత్రిపూట సరిపడా నిద్రపోకపోతే జీర్ణక్రియ సమస్యలు, బ్లడ్ షుగర్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నివేదికల ప్రకారం.. సరైన నిద్ర లేకపోతే అది పెద్ద ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మీరు గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం వంటి వ్యాధుల బారినపడవచ్చు. వాస్తవానికి సరిగ్గా నిద్రపోకపోవడం వెనుక కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. వీటిని మనం అవైడ్‌ చేస్తే మంచిది. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. నిద్రవేళకు ముందు బాగా తినడం

మీరు నిద్ర సమయంలో లేదా చాలా ఆలస్యంగా ఆహారం తీసుకుంటే అది జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే రాత్రిపూట అసిడిటీ సమస్య రావచ్చు అది నిద్ర భంగం కలిగిస్తుందని తెలుసుకోండి. నిద్రపోయే 3 నుంచి 4 గంటల ముందు రాత్రి భోజనం చేయడం మంచిది.

2. గాడ్జెట్లను అధికంగా వాడటం

మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రపోవడానికి సహాయపడుతుంది కానీ నిద్రపోయే ముందు గాడ్జెట్‌లను ఉపయోగిస్తే అది ఈ హార్మోన్‌పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నీలి కాంతి నిద్రని ప్రభావితం చేస్తుంది. అందుకే పడుకునే గంట ముందు ఎలాంటి గాడ్జెట్‌లు వాడకూడదని నిపుణులు చెబుతున్నారు.

3. సరైన సమయంలో నిద్ర

నిద్రించే దినచర్య సరిగ్గా లేకపోవడం పెద్ద కారణం. తరచుగా ప్రజలు రాత్రి 10 లేదా 12 గంటలకి నిద్రపోతారు కానీ ఇది శరీరానికి నిద్రకు రెండింటికీ మంచిది కాదు. అలాగే నిద్రపోయే ముందు కావాలంటే విశ్రాంతి తీసుకోవడానికి ఒక పుస్తకాన్ని చదివితే మంచిది.

4. రాత్రి భారీ వ్యాయామం

కొంతమందికి ఉదయం పూట కాకుండా సాయంత్రం పూట హెవీ వర్కవుట్‌లు చేయడం అలవాటు. నిపుణుల అభిప్రాయం ప్రకారం దీని కారణంగా శరీరం చాలా అలసిపోతుంది. నొప్పుల వల్ల సరిగ్గా నిద్రపోవడంలో సమస్యను సృష్టిస్తుంది. నిద్రకు 3 లేదా 4 గంటల ముందు వర్కవుట్స్ చేస్తే మంచిది.

IND vs SA: ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి.. 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం..

Deepak Chahar: కంటతడి పెట్టిన దీపక్ చాహర్.. మ్యాచ్‌ని గెలిపించలేకపోయానే.. విరోచిత పోరాటం వృథా..

Carrot Soup: చలికాలంలో వేడి వేడి క్యారెట్‌ సూప్.. ఆరోగ్యంతో పాటు అదిరే రుచి..