Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goolge Drive: యూజ‌ర్ల భ‌ద్ర‌త‌కు మ‌రింత భ‌రోసా ఇస్తోన్న గూగుల్‌.. గూగుల్ డ్రైవ్‌లో స‌రికొత్త ఫీచ‌ర్..

Goolge Drive: ప్ర‌స్తుతం ఇంట‌ర్ నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. వినోదం నుంచి ఉద్యోగం వ‌ర‌కు అన్ని ర‌కాల ప‌నుల‌ను స్మార్ట్ ఫోన్‌లోనే చేసేస్తున్నారు. ఇక మొబైల్‌లో యాప్స్ కంటే క్లౌడ్ స్టోరేజ్ మీద ఎక్కువ‌గా ఆధార ప‌డుతున్నారు...

Goolge Drive: యూజ‌ర్ల భ‌ద్ర‌త‌కు మ‌రింత భ‌రోసా ఇస్తోన్న గూగుల్‌.. గూగుల్ డ్రైవ్‌లో స‌రికొత్త ఫీచ‌ర్..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 24, 2022 | 7:41 AM

Goolge Drive: ప్ర‌స్తుతం ఇంట‌ర్ నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. వినోదం నుంచి ఉద్యోగం వ‌ర‌కు అన్ని ర‌కాల ప‌నుల‌ను స్మార్ట్ ఫోన్‌లోనే చేసేస్తున్నారు. ఇక మొబైల్‌లో యాప్స్ కంటే క్లౌడ్ స్టోరేజ్ మీద ఎక్కువ‌గా ఆధార ప‌డుతున్నారు. ఫోన్‌పై స్టోరేజ్ విష‌యంలో ఎలాంటి భారం ప‌డ‌ద‌నేది ఒక కార‌ణ‌మైతే సుల‌భంగా యాక్సెస్ చేసుకోవ‌చ్చనే మ‌రో కార‌ణంతో వీటి వినియోగం పెరిగింది. ఈ క్ర‌మంలో అందుబాటులోకి వ‌చ్చిందే ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్‌కు చెందిన గూగుల్ డ్రైవ్‌. చాలా మంది ఎలాంటి ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకున్నా వెంట‌నే.. గూగుల్ డ్రైవ్ నుంచి డాక్యుమెంట్ల‌ను యాక్సెస్ చేస్తున్నారు.

అయితే ఇదే స‌మ‌యంలో కొంద‌రు సైబ‌ర్ నేర‌గాళ్లు ఈ డ్యాక్యుమెంట్స్‌తో కొన్ని మోస‌పూరిత లింక్‌ల‌ను పంపుతూ ఫోన్‌ల‌ను హ్యాక్ చేస్తున్నారు. అయితే ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డానికి గూగుల్ ప్ర‌త్యేక ఫీచర్‌ను తీసుకొచ్చింది. డ్యాక్యుమెంట్ల ద్వారా స్పైవేర్‌లను జొప్పించే ప్రమాదానికి చెక్ పెట్ట‌డానికే గూగుల్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. గూగుల్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ స‌హాయంతో.. మీ డివైజ్‌లోకి వ‌చ్చిన‌ ఏదైనా ప్ర‌మాద‌ర‌క‌ర‌మై డాక్యుమెంట్ కానీ ఫోటోను మీరు ఓపెన్ చేసిన వెంట‌నే.. గూగుల్ స్కాన్ చేసి వినియోగ‌దారులను అప్ర‌మ‌త్తం చేస్తుంది.

స్క్రీన్ పైభాగంలో స‌ద‌రు డాక్యుమెంట్‌లో ఉన్న అనుమానాద‌స్ప‌ద విష‌యాన్ని అల‌ర్ట్ రూపంలో చూపిస్తుంది. మీ వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని దొంగ‌లించే ప్ర‌మాదం ఉంద‌ని మిమ్మ‌ల్ని హెచ్చ‌రిస్తుంది. ప్ర‌స్తుతం కొంద‌రికి మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వ‌ర‌లోనే అంద‌రికీ అందుబాటులోకి రానుంది.

Also Read: Dump at Farm Land: వ్యవసాయ బావి వద్ద గొయ్యి.. అనుమానంతో తవ్వీ చూసిన పోలీసులు షాక్!

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

Currency Note Press Jobs: క‌రెన్సీ నోట్ ప్రెస్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న గ‌డువు..