Whatsapp: వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసే ఉద్యోగుల‌కు కేంద్రం అల‌ర్ట్‌.. అందుకోసం వాట్సాప్‌, టెలిగ్రామ్ వాడొద్దంటూ..

Don't Use Whatsapp: ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో దాదాపు అంద‌రు ఉద్యోగులు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు. చివ‌రికి కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సైతం ఈ వెల‌సుబాటును క‌ల్పించారు. క‌రోనా కేసులు భారీగా పెరుగుత‌న్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే...

Whatsapp: వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసే ఉద్యోగుల‌కు కేంద్రం అల‌ర్ట్‌.. అందుకోసం వాట్సాప్‌, టెలిగ్రామ్ వాడొద్దంటూ..
Follow us

|

Updated on: Jan 24, 2022 | 6:44 AM

Don’t Use Whatsapp: ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో దాదాపు అంద‌రు ఉద్యోగులు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు. చివ‌రికి కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సైతం ఈ వెల‌సుబాటును క‌ల్పించారు. క‌రోనా కేసులు భారీగా పెరుగుత‌న్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఇదే స‌మ‌యంలో కొంద‌రు ఉద్యోగులు ముఖ్య‌మైన ఇన్ఫ‌ర్మేష‌న్‌, డాక్యుమెంట్ల‌ను షేర్ చేసుకోవ‌డం కోసం వాట్సాప్‌, టెలిగ్రామ్ వంటి యాప్‌ల‌ను ఉప‌యోగిస్తున్నారు. అయితే ఇది ఎంత మాత్రం సుర‌క్షితం కాద‌ని, వెంట‌నే ఈ ప‌నిని మానుకోవాల‌ని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల‌ను అల‌ర్ట్ చేసింది.

ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, కేంద్రం కొత్త‌గా క‌మ్యూనికేష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. సాధార‌ణంగా సోష‌ల్ మీడ‌యాలో సర్వ‌ర్లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రైవేటు సంస్థ‌ల చేతుల్లోనే ఉన్నాయి, డేటా సెంట‌ర్ల‌ను కూడా ప్రైవేటే సంస్థ‌లో నిర్వ‌హిస్తుంటాయి. ఈ నేస‌థ్యంలో దేశ భ‌ద్ర‌త‌కు సంబంధించిన స‌మాచారాన్ని శతృత్వ దేశాల‌ను దుర్వినియోగం చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని కేంద్రం తెలిపింది. కాబ‌ట్టి ముఖ్యంగా కీల‌క ప‌దువుల్లో ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌మాచార మార్పిడి కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన యాప్స్ ద్వారా మాత్ర‌మే క‌నెక్ట్ కావాల‌ని కేంద్రం తెలిపింది. ఇక అమెజాన్‌, అలెక్సా యాపిల్ హోమ్ పాడ్‌, గూగుల్ మీట్‌, జూమ్ వంటి వాటికి కూడా ఇలాంటి నిబంధ‌న‌లే ఉంటాయ‌ని కేంద్రం తెలిపింది.

జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించిన స‌మ‌స్య‌లపై చ‌ర్చించే స‌మావేశాల స‌మ‌యంలో స్మార్ట్ వాచీలు, స్మార్ట్ ఫోన్‌ల‌ను ఉప‌యోగించవ‌ద్ద‌ని ప్ర‌భుత్వ ఉన్నవ‌ర్గాలు తెలిపాయి. డిపార్ట్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్(సి-డిఎసి), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) ఏర్పాటు చేసిన మద్యమాల ద్వారా మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ జరపాలని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

Also Read: DRDO Recruitment: ఐటీఐ చేసిన వారికి డీఆర్‌డీఓలో అప్రెంటిస్ పోస్టులు.. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి..

Anantapur district: రూపాయికే దోసె.. సావిత్రమ్మా.. నీ మనసు ఎంత గొప్పది అమ్మా..!

Vastu Tips: ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. వెంటనే వాస్తు నియమాలలో మార్పులు చేయండి..