AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Mantra: జీవితంలో విజయం పొందాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.. లక్ష్యం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..

జీవితంలో భారీ లక్ష్యంతో ముందుకు సాగడం ఎల్లప్పుడూ సరైన నిర్ణయమే  అయినప్పటికీ, ఇది సాధ్యం కాకపోతే.. మీరు చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా మీ గమ్యాన్ని చేరుకోవచ్చు.

Success Mantra: జీవితంలో విజయం పొందాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.. లక్ష్యం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..
Success Mantra
Surya Kala
|

Updated on: Oct 20, 2022 | 7:14 AM

Share

మీరు జీవితంలో ఎంతవరకు విజయం సాధిస్తారు అనేది మీ లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. మీరు సరైన లక్ష్యాన్ని ఎంచుకుని, దాని వైపు నిరంతరం కదులుతూ ఉంటే, ఖచ్చితంగా మీరు మీ గమ్యాన్ని సమయానికి చేరుకుంటారు. అయితే మీరు మీ లక్ష్యం నుండి వేరొక మార్గంలో నడుస్తున్నట్లయితే, అపుడు విజయాన్ని సాధించడం కష్టం. మనం జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వెంటనే, మనకు జీవితం దిశ, లక్ష్యం రెండూ లభిస్తాయి. అయితే అది లేకుండా మన జీవితం అర్థరహితంగా కనిపిస్తుంది. ఇప్పుడు మన లక్ష్యం చిన్నదా పెద్దదా అనే ప్రశ్న తలెత్తుతోంది. జీవితంలో భారీ లక్ష్యంతో ముందుకు సాగడం ఎల్లప్పుడూ సరైన నిర్ణయమే  అయినప్పటికీ, ఇది సాధ్యం కాకపోతే.. మీరు చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా మీ గమ్యాన్ని చేరుకోవచ్చు. పెద్దలు,  మహానుభావులు చెప్పిన విలువైన మాటలను జీవితంలో లక్ష్యం ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం.

  1. లేవండి, మేల్కొనండి..  మీ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకండి.
  2. లక్ష్యం లేని జీవితం చిరునామా లేని కవరు లాంటిది.. అది ఎక్కడికీ చేరదు.
  3. జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించడం ద్వారా, ఒక వ్యక్తి తన ప్రాధాన్యతలను సులభంగా గుర్తించగలడు. దీని సహాయంతో, అతను విజయాల బాటలో సంచరించకుండా తన గమ్యాన్ని సులభంగా సాధించగలడు.
  4. లక్ష్యాలను నిర్దేశించుకున్న వ్యక్తులు, వారు ఇతర వ్యక్తుల కంటే త్వరగా, సులభంగా తమకు కావలసిన విజయాన్ని సాధిస్తారు.
  5. మీరు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, దాని కోసం మాత్రమే ఆలోచించవద్దు. దానిని పొందడం కోసం వేచి ఉండకండి, ఎందుకంటే నిరంతర ప్రయత్నం ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఇవి కూడా చదవండి
పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..
2 సెకన్లలో 700 కిలో మీటర్ల స్పీడ్‌ అందుకున్న రైలు!
2 సెకన్లలో 700 కిలో మీటర్ల స్పీడ్‌ అందుకున్న రైలు!