Women’s Shabarimala: ఈ ఆలయం స్త్రీలకు ప్రత్యేకం.. మహిళల శబరిమలగా ప్రసిద్ధి.. ఎక్కడో తెలుసా..
Women's Shabarimala: తమిళనాడు (Tamilanadu) సంస్కృతి, సంప్రదాయలకే కాదు.. ఘన చరిత్రకు ఆనవాలు. ఇక ఎక్కడ చూసినా గత వైభవాన్ని చాటి చెబుతూ.. అడుగడుగునా అనేక దేవాలయాల(Temples)తో ఆధ్యాత్మికత..
Women’s Shabarimala: తమిళనాడు (Tamilanadu) సంస్కృతి, సంప్రదాయలకే కాదు.. ఘన చరిత్రకు ఆనవాలు. ఇక ఎక్కడ చూసినా గత వైభవాన్ని చాటి చెబుతూ.. అడుగడుగునా అనేక దేవాలయాల(Temples)తో ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ఘనమైన ప్రాశస్త్యమున్న ఈ ఆలయాలు చారిత్రక ప్రత్యేకతలనూ కలిగిఉన్నాయి. ఆ కోవలోకే చెందుతుంది మండైకాడు భగవతి అమ్మాన్ దేవాలయం. న్యాకుమారి జిల్లా కొలచెల్ సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని ‘మహిళల శబరిమల’గా చెబుతుంటారు. ఇక్కడి అమ్మవారు గర్భగుడిలో కాకుండా గుహలో దర్శనమివ్వడం మరో ప్రత్యేకత. అయ్యప్ప భక్తులు 41 రోజులపాటు స్వామి మాల ధరించి స్వామివారిని దర్శించుకున్నట్లే మహిళలు భగవతి అమ్మాన్ మాల ధరించి ‘ఇరుముడి’ని తలపై పెట్టుకుని మండైకాడు భగవతి అమ్మాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఫిబ్రవరిలో జరిగే మాస పండుగ సందర్భంగా 41 రోజుల ఉపవాసం అనంతరం మండైకాడు భగవతి అమ్మాన్ ఆలయాన్ని దర్శిస్తారు. అందుకే దీనికి ‘మహిళల శబరిమల’ అని పేరు వచ్చింది. ఇక ఈ ఆలయం నిర్మాణంకూడా కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని పోలి ఉండటం విశేషం.
శతాబ్దాల క్రితం కేరళకు చెందిన ఓ వ్యక్తి మండైకాడు అడవిలో నుంచి వెళుతున్నాడు. విపరీతమైన ఆకలి బాధతో ఉన్న ఆ వ్యాపారికి భగవతి అమ్మాన్ దేవత వృద్ధురాలి రూపంలో వచ్చి ఆకలి తీర్చిందని చెబుతారు. ఆకలిని తీర్చేందుకు వృద్ధురాలి రూపంలో వచ్చింది భగవతీ దేవి అని తెలుసుకున్న ఆ వ్యక్తి తన వ్యాపారంలో వచ్చిన డబ్బులో కొంత భాగం ముడుపు కట్టి ఆలయానికి విరాళంగా ఇచ్చాడు. అనంతరం మండైకాడు అడవిలో జరిగిన అద్భుతాన్ని కేరళ కొల్లాంలోని తన స్వగ్రామంలో ప్రచారం చేశాడు. దీంతో తమ శ్రేయోభిలాషిని ఆకలి బాధ నుంచి విముక్తి చేసిన భగవతి అమ్మాన్‌కు పొంగల్ వండి ‘ఇరుముడి’తో మండైకాడుకు రావడం ప్రారంభించారు. దీనిని ఆకలితో ఉన్నవారికి వడ్డిస్తుంటారు. ఈ ప్రాంతంలోని వారందరినీ రక్షించేందుకు భగవతి అమ్మాన్ దేవి ఓ గుహలో వెలిసిందని.. వారిని రక్షిస్తూ భక్తులకు దర్శనమిస్తోందని చెబుతారు. ఇప్పటికీ 15 అడుగుల ఎత్తైన ఎర్రచందనం స్థూపంపై భగవతీ దేవి ముఖంతో పాటు.. చరిత్రను తెలిపే శాసనాలు అక్కడ దర్శనమిస్తాయి.
Also Read: వివాహం ఆలస్యం అవుతుందా.. అయితే ఈ 5 జ్యోతిష్య పరిహారాలు పాటించి చూడండి.. (photo gallery)