Kadiri Temple: కొనసాగుతున్న కాటమరాయుడి బ్రహ్మోత్సవాలు.. నేడు రథోత్సవ వేడుక.. భారీగా తరలివచ్చిన భక్తులు

Kadiri Temple: ఇసుకేస్తే రాలంత జనం నమో నరసింహ..గోవిందా గోవిందా అంటూ కదిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం(Shree Lakshmi Narasimha Kshetram ) ప్రతిధ్వనిస్తోంది. ఉదయం..

Kadiri Temple: కొనసాగుతున్న కాటమరాయుడి బ్రహ్మోత్సవాలు.. నేడు రథోత్సవ వేడుక.. భారీగా తరలివచ్చిన భక్తులు
Kadiri Rathotsavam
Follow us
Surya Kala

|

Updated on: Mar 23, 2022 | 1:37 PM

Kadiri Temple: ఇసుకేస్తే రాలంత జనం నమో నరసింహ..గోవిందా గోవిందా అంటూ కదిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం(Shree Lakshmi Narasimha Kshetram ) ప్రతిధ్వనిస్తోంది. ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల మధ్య అనురాధ నక్షత్రం మేష లగ్నంలో రథోత్సవం ప్రారంభమైంది. వేద పండితుల వేద మంత్రాలు ప్రబంధ పారాయణాలతో అనంతపురం జిల్లా(Ananatapuram District ) కదిరి లో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన బ్రహ్మ రథోత్సవం వేడుక కనులారా వీక్షించడానికి తెలుగు రాష్డల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు.

అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం స్వామివారి రథాన్ని కుటాగుళ్ల, మూర్తిపల్లి, గజ్జలరెడ్డి పల్లి గ్రామస్తులు స్వామివారు ఆశీనులైన బ్రహ్మ రథం ముందుకు లాగుతున్నారు. రథం లాగేందుకు వీలుగా పెద్ద పెద్ద తాళ్ళు,నియంత్రించేందుకు తెడ్లు సిద్ధం చేశారు.

స్వామివారి రథోత్సవం ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ యదస్థానానికి చేరుకోవడం అద్భుత దృశ్యం,మాటల్లో చెప్పలేని భక్తి మదూరానుభూతిని కనులారా వీక్షించడానికి భక్తులు భక్తి పరవశ్యంతో తన్మయత్వం పొందుతున్నారు.

దేశంలోనే అతి పెద్ద మూడవ రథంగా కదిరి రథోత్సవానికి పేరుంది. తమిళనాడు లోని అండాల్ అమ్మవారి శ్రీవళ్లి పుత్తూరు రథం, తంజావూరు లోని తిరువల్లూరు రథం తరువాత మూడవ అతి పెద్ద రథం కదిరి నరసింహుడిదే అని చరిత్ర చెబుతోంది. యేటా పదిహేను రోజుల పాటు కదిరి నరసింహుడి బ్రహ్మోత్సవాలు జరుపుతారు. జై నరసింహ అంటూ కులాలు, మతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు కదిరి కి తరలి వస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద మూడవ రథంగా ప్రసిద్ధి గాంచిన ఈ రథం బరువు 540 టన్నులు 37.5 అడుగుల ఎత్తు ఉంటుంది. 120 యేళ్ళ క్రితం ఈ రథం తయారు చేశారు.

Also Read:

Kacha Badam Song: కొనసాగుతున్న కచ్చా బాదాం సాంగ్ ఫీవర్.. ఈ సారి పోలీసుల వంతు.. వీడియో వైరల్

Viral Video: పార్క్‌లో ఆడుకుంటున్న పాప దగ్గరకు వచ్చిన భారీ సర్పం.. ఆ తర్వాత ఏమైందంటే..