Kacha Badam Song: కొనసాగుతున్న కచ్చా బాదాం సాంగ్ ఫీవర్.. ఈ సారి పోలీసుల వంతు.. వీడియో వైరల్
Update: ''కొనసాగుతున్న కచ్చా బాదాం సాంగ్ ఫీవర్.. ఈ సారి పోలీసుల వంతు.. వీడియో వైరల్'' అని ఇంతకముందు మేము చేసిన పోస్ట్ పూర్తి అవాస్తవమని తెలియజేస్తున్నాం. ‘ఫ్యాక్ట్‌లీ’ అనే ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాసే వెబ్ సైట్.. పైన పేర్కొన్న వార్తకు వివరణ ఇస్తూ ఏప్రిల్ 13, 2022న ఓ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. టీవీ9 పబ్లిష్ చేసిన వార్తలోని వీడియోలో ‘కచ్చా బాదం’ పాటకు డ్యాన్స్ చేస్తున్నది నిజమైన పోలీస్ అధికారులు కాదు.
Update: ”కొనసాగుతున్న కచ్చా బాదాం సాంగ్ ఫీవర్.. ఈ సారి పోలీసుల వంతు.. వీడియో వైరల్” అని ఇంతకముందు మేము చేసిన పోస్ట్ పూర్తి అవాస్తవమని తెలియజేస్తున్నాం. ‘ఫ్యాక్ట్‌లీ’ అనే ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాసే వెబ్ సైట్.. పైన పేర్కొన్న వార్తకు వివరణ ఇస్తూ ఏప్రిల్ 13, 2022న ఓ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. టీవీ9 పబ్లిష్ చేసిన వార్తలోని వీడియోలో ‘కచ్చా బాదం’ పాటకు డ్యాన్స్ చేస్తున్నది నిజమైన పోలీస్ అధికారులు కాదు. పోలీస్ యూనిఫాం ధరించి ఈ వీడియోలో డాన్స్ వేస్తున్నది ‘రకచ్చాషి’ అనే సినిమాలో పనిచేస్తున్న నటీనటులు అని స్పష్టం చేసింది. ‘రకచ్చాషి’ సినిమాలో నటిస్తున్న ప్రీతి గోస్వామి ఈ వీడియోని 08 మర్చి 2022 నాడు తన ఇన్స్టాగ్రామ్ పేజిలో కూడా షేర్ చేసింది. కావున, ”కొనసాగుతున్న కచ్చా బాదాం సాంగ్ ఫీవర్.. ఈ సారి పోలీసుల వంతు.. వీడియో వైరల్” అని మేము చేసిన పోస్ట్ తప్పు(నిరాధారమైంది) అని గమనించగలరు.
Kacha Badam Song: కళకు, కళాకారులకు భాషాబేధం లేదు.. స్పందించే హృదయం ఉంటె చాలు.. ఈ విషయం అనేక విషయాల్లో రుజువు అవుతూనే ఉంది. ఇక ఇటీవల పుష్ప (Pushpa Movie) లోని సాంగ్స్. కచ్చా బాదం సాంగ్ (Kacha Badam Song) సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ దేశ, విదేశాల వారిని ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. కచ్చా బాదం సాంగ్ ఫీవర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి పశ్చిమ బెంగాల్‌కు చెందిన వేరుశెనగ విక్రేత పాడిన ఈ పాట వైరల్‌గా మారింది. దేశం మొత్తం ఈ పాటకు అభిమానులుగా మారారు. ఈ ఆకర్షణీయమైన పాటకు పోలీసులు తమ పదం కలిపారు. ‘కచా బాదమ్‌కు పోలీసులు డ్యాన్స్ చేస్తున్న వీడియో వీడియో వైరల్ గా మారింది.
మార్చి 21న @GoofyOlives ఖాతా నుంచి ట్విట్టర్‌లో ఒక వినియోగదారు పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు 479 రీట్వీట్లు, 3000 పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. ఈ వీడియోకి ‘ఖాకీలు ఎందుకు సరదాగా ఉండకూడదు’ అనే క్యాప్షన్ జత చేశారు. పోలీసు యూనిఫాంలో ఉన్న ఐదుగురు పోలీసులు “కచా బాదం: సాంగ్ కు నృత్యం చేస్తున్నారు. వీరిలో ఒక మహిళా పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. డ్యాన్స్ చాలా చేసినప్పటికీ ఈ రీల్ పై నెటిజన్లు విభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. యూనిఫాంలో ఉన్నప్పుడు పోలీసులు ఇలా డ్యాన్స్ చేయడం కరెక్ట్ కాదంటూ కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఖాకీ యూనిఫామ్ లో ఉంటే మాత్రం పోలీసులు ఆనందాన్ని ఎందుకు పొందకూడదు అంటూ మరికొందరు పోలీసులకు సపోర్ట్ చేస్తున్నారు.
Why shouldn’t khaki have some fun. Watch out on left and right most. pic.twitter.com/izKTzrq0Sm
— Da_Lying_Lama?? (@GoofyOlives) March 21, 2022
ఈ వీడియోపై నెటిజన్ల అభిప్రాయం ఎలా ఉన్నా, ‘కచా బాదం’ పాట విపరీతంగా పాపులర్ అయిందని.. అన్ని వర్గాల వారు ఈ పాటను ఆస్వాదిస్తున్నారని మరోసారి తెలిసింది.
Disclaimer: (ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు, పలు ప్రాంతీయ, జాతీయ డిజిటల్ మీడియాలో ప్రచురితమైన కథనాలు ఆధారంగా పబ్లిష్ చేయబడింది. ఈ వార్త వెనుక ఉన్న నిజానిజాలపై టీవీ9 తెలుగు డిజిటల్ టీమ్ ఎలాంటి ఫ్యాక్ట్ చెక్ నిర్వహించలేదు. దీనిని పాఠకులు గమనించగలరు)
Also Read:
Toothpaste: ఆ వ్యాపార ప్రకటనలపై నిషేధం.. తప్పుదారి పట్టించేలా ఉన్నాయంటూ జరిమానా