AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tourism: వారణాసి అందాలను వీక్షించాలనుకుంటున్నారా?.. అయితే ఈ ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీ మీకోసమే..

IRCTC Varanasi Tour: దేశంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను అందిస్తోన్న సంగతి తెలిసిందే.

IRCTC Tourism: వారణాసి అందాలను వీక్షించాలనుకుంటున్నారా?.. అయితే ఈ ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీ మీకోసమే..
Varanasi
Basha Shek
|

Updated on: Mar 24, 2022 | 7:53 AM

Share

IRCTC Varanasi Tour: దేశంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. అలా తాజాగా వారణాసికి (Varanasi) వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్పెషల్ టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ‘స్వదేశ్‌ యాత్ర.. మహాలయ పిండ దాన్’ పేరుతో సాగే ఈ రైల్ టూర్ 5రాత్రులు, 6 రోజుల పాటు సాగతుంది. వారణాసితో పాటు గంగ ప్రయాగ్ సంగం, గయ తదితర పుణ్యక్షేత్రాలు ఈ టూర్‌ ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి. 2022 సెప్టెంబర్ 15న ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వాసులు ఈ టూర్‌ ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు.

టూర్‌ ఎలా సాగుతుందంటే..

ఇక యాత్ర విషయానికొస్తే.. ‘మహాలయ పిండ దాన్’ యాత్ర మొదటి రోజు తెల్లవారుజాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభమవుతుంది. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌లో కూడా యాత్రికులు రైలు ఎక్కొచ్చు. రెండో రోజు వారణాసి చేరుకుంటారు. గంగా నదిలో స్నానాలు, సైట్‌సీయింగ్ ఉంటాయి. ఆ తర్వాత కాశీ విశ్వనాథ, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి, కాళ భైరవ ఆలయాల సందర్శన ఉంటుంది. సాయంత్రం సంధ్యా హారతి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఆ రాత్రికి వారణాసిలోనే బస చేయాలి. మూడో రోజు ఉదయం వారణాసి నుంచి ప్రయాగ్‌రాజ్ బయలుదేరాలి. నాలుగో రోజు ప్రయాగ్‌రాజ్ దగ్గర త్రివేణి సంగంలో స్నానాలు, తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆనంద్ భవన్, హనుమాన్ మందిర్, అలోపి శక్తి పీఠ్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత శృంగవెన్పూర్, గయలను సందర్శించుకోవచ్చు. ఐదో రోజు గయలో విష్ణుపాద ఆలయ దర్శనం ఉంటుంది. అక్కడ పిండ ప్రదాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత బోధగయకు బయల్దేరాలి. ఆ తర్వాత గయ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆరో రోజు భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు పర్యాటకులు చేరకోవడంతో టూర్ ముగుస్తుంది.

ధరలు ఎలా ఉన్నాయంటే.

ఈ టూర్ ఫ్యాకేజీ ధరలు రెండు రకాలుగా ఉన్నాయి. స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.14,485 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.18,785. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ రైలు ప్రయాణం, హోటల్‌లో వసతి, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కవర్ అవుతాయి. ఇక ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Also Read:

Chennai Super Kings: IPL 2022లో కొత్త జెర్సీలో కనిపించనున్న సీఎస్కే ఆటగాళ్లు..

Covid-19 4th Wave: దేశంలో కరోనా ఫోర్త్ వేవ్‌ అలజడి.. అప్రమత్తమైన రాష్ట్రాలు.. నిపుణులు ఏమంటున్నారంటే..?

Viral Video: బాబోయ్.. పామునే మడతబెట్టేసిన బుడ్డోడు.. వీడియో చూస్తే ఫ్యూజులౌవుట్..