AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి

సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ జనవరి నెలలో వచ్చే జయ ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల విష్ణువు నుంచి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి, అయితే, ఈ ఉపవాసంలో ఒక చిన్న పొరపాటు కూడా ఉపవాసం యొక్క మొత్తం ఫలాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ రోజున కొన్ని తప్పులను నివారించాలి.

Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
Jaya Ekadashi 2026
Rajashekher G
|

Updated on: Jan 24, 2026 | 9:58 AM

Share

Jaya Ekadashi 2026: సనాతన ధర్మంలో ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజు చాలా మంది ఉపవాసం ఉండి మహా విష్ణువును ఆరాధిస్తుంటారు. నెలలో రెండుసార్లు ఏకాదశి వస్తుంది. కృష్ణ పక్షం, శుక్ల పక్షం యొక్క ఏకాదశి స్థితిలో వస్తుంది. ఇక, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన జయ ఏకాదశి మాఘ మాసంలోని శుక్ల పక్షం యొక్క ఏకాదశి తిథిలో జరుపుకుంటారు. అన్ని ఏకాదశి ఉపవాసాలు కూడా మహా విష్ణువుకు అంకితం చేయబడినవే. హిందూ విశ్వాసాల ప్రకారం.. జయ ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం వల్ల విష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. శ్రేయస్సుతో కూడిన జీవితానికి దారితీస్తుంది. అంతేగాక, జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారు. ఈ ఏకాదశి ఉపవాసం పాటించేవారికి మరణానంతరం జీవితం ఉండదని భావిస్తారు.

అయితే, ఈ ఉపవాసంలో ఒక చిన్న పొరపాటు కూడా మొత్తం ఫలాన్ని లేకుండా చేస్తుంది. అందుకే ఈరోజున కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జయ ఏకాదశి ఎప్పుడు?

పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి జనవరి 28న సాయంత్రం 4:35 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి తిథి జనవరి 29న మధ్యాహ్నం 1:55 గంటలకు ముగుస్తుంది. కాబట్టి, ఉదయించే తేదీ ప్రకారం.. ఈ సంవత్సరం జయ ఏకాదశి ఉపవాసం జనవరి 29న పాటించడం జరుగుతుంది.

జయ ఏకాదశి నాడు ఈ తప్పులు చేయొద్దు

ఏకాదశి ఉపవాస సమయంలో అన్నం, బియ్యంతో చేసిన పదార్థాలు తినరాదు. కాబట్టి, జయ ఏకాదశి నాడు బియ్యం లేదా దానితో తయారు చేసిన ఏదైనా తినకండి. అలా చేయడం వల్ల విష్ణువుకు కోపం వస్తుంది. తద్వారా ఉపవాసం యొక్క ప్రయోజనాలు శూన్యం అవుతాయి.

ఉపవాసాలను సాత్వికంగా పరిగణిస్తారు. ఉపవాస సమయంలో సాత్విక ఆహారాలు తీసుకుంటారు. కాబట్టి జయ ఏకాదశి ఉపవాస సమయంలో వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, మద్యం వంటి వాటిని తినకుండా ఉండాలి. అలా చేయడం వల్ల ఇంట్లోకి పేదరికం వస్తుంది.

ఉపవాసం లేదా పూజ సమయంలో నల్లని దుస్తులు ధరించడం నిషిద్ధం. కాబట్టి, జయ ఏకాదశి ఉపవాసం లేదా పూజ సమయంలో నల్లని దుస్తులు ధరించడం మానుకోండి.

తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. తులసిని ఆయనకు నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ ఏకాదశి నాడు, తల్లి తులసి విష్ణువు కోసం నీరు లేకుండా ఉపవాసం ఉంటుంది, కాబట్టి ఏకాదశి నాడు తులసి ఆకులను కోయకండి.

జయ ఏకాదశి ఉపవాస సమయంలో పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఈ రోజున ఎవరితోనూ గొడవలు పడటం లేదా గొడవ పడటం మానుకోండి. ఎవరిపైనా దుర్భాష వాడటం మానుకోండి.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించదు.)

సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య సేన
సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య సేన
అక్కడ SI.. తెలుగులో విలన్.. దేవి సినిమా నటుడి గురించి తెలిస్తే..
అక్కడ SI.. తెలుగులో విలన్.. దేవి సినిమా నటుడి గురించి తెలిస్తే..
అనేక రోగలను దూరం చేసే బెస్ట్ స్నా..రోజూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
అనేక రోగలను దూరం చేసే బెస్ట్ స్నా..రోజూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా
మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా
పుష్పరాగము ఉంగరం ధరిస్తే.. మీ జీవితంలో ఊహించని లాభాలు చూస్తారు..!
పుష్పరాగము ఉంగరం ధరిస్తే.. మీ జీవితంలో ఊహించని లాభాలు చూస్తారు..!
లోన్ కట్టలేదని ఇల్లు జప్తు.. యజమాని ఏం చేశాడో తెలిస్తే
లోన్ కట్టలేదని ఇల్లు జప్తు.. యజమాని ఏం చేశాడో తెలిస్తే
కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి..? మీరు చేసే ఈ పొరపాట్లతో మీ..
కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి..? మీరు చేసే ఈ పొరపాట్లతో మీ..
ఇవి మీ కలల్లోకి వస్తే త్వరలోనే మీరు లక్షాధికారి అవుతారట..!
ఇవి మీ కలల్లోకి వస్తే త్వరలోనే మీరు లక్షాధికారి అవుతారట..!
2005లో ఈ సినిమా సంచలనం.. ఇప్పటికీ ట్రెండింగ్..
2005లో ఈ సినిమా సంచలనం.. ఇప్పటికీ ట్రెండింగ్..
మతిమరుపుతో సమస్యా?ఈ 5 అలవాట్లను పాటిస్తే తిరుగే ఉండదు..
మతిమరుపుతో సమస్యా?ఈ 5 అలవాట్లను పాటిస్తే తిరుగే ఉండదు..