Japamala: మంత్రాలను జపించడానికి ఆయా దేవుళ్లకు సంబంధించిన జపమాల ఉంది.. నియమాలు ఏమిటో తెలుసా..

సనాతన సంప్రదాయంలో వివిధ దేవతలను పూజించడానికి వివిధ  జప మాలలతో జపించే పద్ధతి ఉంది. ఏదైనా దేవతను జపించేటప్పుడు.. మరికొన్ని ముఖ్యమైన నియమాలను పేర్కొన్నారు.  నియమనిష్టలతో మంత్రాలను జపిస్తే చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రతిరోజూ లేదా ప్రత్యేక పర్వదినాల్లో జపమాల జపించే నియమాల గురించి తెలుసుకుందాం.. 

Japamala: మంత్రాలను జపించడానికి ఆయా దేవుళ్లకు సంబంధించిన జపమాల ఉంది.. నియమాలు ఏమిటో తెలుసా..
Japa Mala
Follow us
Surya Kala

|

Updated on: Jun 02, 2023 | 9:28 AM

హిందూ మతంలో దేవుణ్ణి పూజించే సమయంలో కొన్ని నియమాలున్నాయి. దేవతలు, దేవతలకు ప్రత్యేక గ్రహాలకు మంత్రాలు జపించే నియమం ఉంది. పూజలో ఈ మంత్రాలను జపించడానికి వివిధ రకాల దండలు ఉపయోగిస్తారు. సనాతన సంప్రదాయంలో వివిధ దేవతలను పూజించడానికి వివిధ  జప మాలలతో జపించే పద్ధతి ఉంది. ఏదైనా దేవతను జపించేటప్పుడు.. మరికొన్ని ముఖ్యమైన నియమాలను పేర్కొన్నారు.  నియమనిష్టలతో మంత్రాలను జపిస్తే చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రతిరోజూ లేదా ప్రత్యేక పర్వదినాల్లో జపమాల జపించే నియమాల గురించి తెలుసుకుందాం..

ఏ ఏ దేవతలకు ఏఏ మాలను ఉపయోగించాలంటే..

హిందూ విశ్వాసం ప్రకారం, ఏదైనా దేవత లేదా దేవుడి మంత్రాన్ని జపించాలంటే.. వారికి సంబంధించిన దండను ఎల్లప్పుడూ ఉపయోగించాలి. పసుపు గంధం లేదా తులసి మాల విష్ణువు, వైజయంతీ మాల శ్రీకృష్ణుడు, రుద్రాక్ష మాల శివుడు, కమలగట్ట దండను లక్ష్మీదేవికి, ముత్యాల హారము చంద్రుడు, పగడపు మాల అంగారకుడు, పసుపు జపమాలతో బృహస్పతి మంత్రాన్ని జపిస్తే.. సాధకుడు తగిన ఫలితాలను  పొందుతాడు. త్వరలో శుభ ఫలితాల అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

రోజూ ఎలా మంత్రం జపించాలంటే 

దేవతలకు లేదా దేవతలలో ఎవరినైనా పూజిస్తూ మంత్రాన్ని జపించాలంటే.. జపమాల తీసుకునే ముందు  శరీరం, మనస్సు స్వచ్ఛంగా ఉంచుకోవాలి. తర్వాత శుభ్రమైన, నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చొని మంత్రాన్ని జపించండి. మాల జపించే సమయంలో దేవతకు సంబంధించిన రంగు ఆసనంపై కూర్చోవాలి. జపమాలతో మంత్రం జపించిన తర్వాత కూర్చున్న ఆసనం దగ్గర రెండు చుక్కల నీటిని వదలండి. అనంతరం నీటిని  నుదిటిపై జల్లుకోవాలి, ఇలా చేయడం వలన జపమాలతో చేసిన మంత్ర పుణ్యం లభిస్తుందని విశ్వాసం.  ఎల్లప్పుడూ నిర్దిష్ట సంఖ్యలో.. నిర్దిష్ట సమయంలో  జపమాలతో మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి.

జపమాల జపించేటప్పుడు చేయకూడని తప్పులు 

మంత్రాలను జపించే జపమాలను ఎప్పుడూ మెడలో ఎప్పుడూ ధరించకూడదు. మంత్రాలను జపించే జపమాల వేరుగా ఉండాలి. అదే విధంగా మేడలో వేసుకునే మాల వేరుగా ఉండాలి. హిందూ విశ్వాసాల ప్రకారం.. మెడలో ధరించే దండను మంత్రాలు జపించడానికి ఎప్పుడూ ఉపయోగించకూడదు.. అదే విధంగా  మరొకరి దండతో మంత్రాలను జపించకూడదు.