Dog Temples: మన దేశంలో కుక్కలకూ దేవాలయాలు.. దేవుళ్ళుగా పూజించే కుక్కల ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే…
భారతదేశం విశ్వాసం, నమ్మకాలకు నిలయం. ఇక్కడ ప్రతి మూలలో ప్రత్యేక సంప్రదాయం, రహస్యాలకు నెలవైన కొన్ని దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి అద్భుతమైన సంప్రదాయం కుక్కలను కాలభైరవుడి గా భావిస్తారు. కుక్కలను దైవంగా భావించి పూజించే ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయాలు మనిషికి, కుక్కలకు మధ్య సంబంధం ఎంతో లోతైనది. పవిత్రమైనది అని రుజువు చేస్తాయి.

భారతదేశ మత, సాంస్కృతిక వారసత్వంలో వైవిధ్యం చాలా లోతైనది. ఇక్కడ దేవుళ్లతో పాటు, జంతువులను పూజించే సంప్రదాయం కూడా ఉంది. ఆవు, పాము, కోతి, ఏనుగులను పూజించడం సర్వసాధారణం అయితే, కొన్ని ప్రదేశాలలో కుక్కలను కూడా దేవునితో సమానంగా గౌరవిస్తారు. కుక్కలను విశ్వాసం, ధైర్యం, రక్షకుని చిహ్నంగా భావిస్తారు. దేశంలోని అనేక ప్రాంతాలలో కుక్కల విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులు వాటిని పూజించే దేవాలయాలు ఉన్నాయి. కుక్కలను పూజించే భారతదేశంలోని కొన్ని ప్రత్యేకమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం.
కుకురదేవ మందిరం, ఛత్తీసగఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో ఉన్న ఖాప్రి గ్రామంలోని కుకుర్‌దేవ్ ఆలయం అటువంటి ప్రత్యేకమైన ప్రదేశం. ఈ ఆలయంలో కుక్క విగ్రహం ఏర్పాటు చేయబడింది. దీనిని ప్రజలు భక్తి శ్రద్దలతో పూజిస్తారు.
ఆలయానికి సంబంధించిన కథ ఏమిటి? ఈ ఆలయానికి సంబంధించిన ఒక కథ ప్రకారం చాలా సంవత్సరాల క్రితం ఒక సంచారి తన కుక్కతో ఇక్కడ నివసించేవాడు. ఒకసారి కరువు కారణంగా సంచారి తన ఇంటిని వదిలి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు అతను తన కుక్కను వడ్డీ వ్యాపారికి తాకట్టు పెట్టాడు. ఒక రాత్రి వడ్డీ వ్యాపారి ఇల్లు దోచుకోబడింది. దొంగలు అన్ని వస్తువులతో పారిపోయారు. కుక్క దొంగలను వెంబడించి. వారు వస్తువులను దాచిపెట్టిన స్థలాన్ని కనుగొంది. కుక్క వడ్డీ వ్యాపారిని ఆ ప్రదేశానికి తీసుకెళ్లింది. వడ్డీ వ్యాపారి తన వస్తువులన్నింటినీ తిరిగి పొందాడు. కుక్క విధేయతకు సంతోషించిన వడ్డీ వ్యాపారి దానిని విడిపించాడు.
అయితే సంచారి తన కుక్క తనను వదిలి పారిపోయిందని భావించాడు.. ఒక్కసారిగా కుక్క కనిపించగానే ముందు వెనుక ఆలోచించకుండా కోపంతో కుక్కను చంపాడు. తరువాత అతనికి మొత్తం కథ తెలిసినప్పుడు, అతను చాలా పశ్చాత్తాపపడ్డాడు. తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, అతను తన విశ్వాసపాత్రమైన కుక్క జ్ఞాపకార్థం ఒక ఆలయాన్ని నిర్మించాడు. నేడు ఈ ఆలయం విశ్వాసానికి చిహ్నంగా మాత్రమే కాదు, మానవులకు కూడా తమ తప్పులను అంగీకరించే శక్తి ఉందని చూపిస్తుంది.
భైరవ బాబా ఆలయం, గ్రేటర్ నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని చిపియానా బుజుర్గ్ గ్రామంలో ఉన్న భైరవ్ బాబా ఆలయంలో ఒక ప్రత్యేక కుక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ కుక్క భైరవ బాబా వాహనం, నిజమైన సేవకుడు అని నమ్ముతారు. ఇక్కడి భక్తులు భైరవ బాబాతో పాటు కుక్క విగ్రహానికి పూలు, దండలు సమర్పిస్తారు. ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి జీవితంలో భద్రత, శ్రేయస్సు లభిస్తుందని ప్రజలు నమ్ముతారు.
ఆలయానికి సంబంధించిన నమ్మకం అంటే ఏమిటి? భైరవ బాబా స్వయంగా ఒక నల్ల కుక్కపై స్వారీ చేస్తూ వస్తాడని నమ్ముతారు. అందువల్ల భైరవ బాబా దర్శనం చేసుకునే ముందు భక్తులు ఈ కుక్క విగ్రహాన్ని పూజిస్తారు. ఇక్కడి ప్రజలు కుక్కను పూజించడం ద్వారా భైరవ బాబా సంతోషించి తమ కోరికలన్నీ తీరుస్తారని నమ్ముతారు. ఈ ఆలయం విశ్వాసం , పురాణాలు కలిసి ఒక ప్రత్యేకమైన సంప్రదాయానికి ఎలా జన్మనిస్తుందో చూపిస్తుంది.
కర్ణాటకలోని కుక్కల ఆలయం కర్ణాటకలోని రాంనగర్ జిల్లాలోని చిన్నపట్న గ్రామంలో కుక్కలను పూజించే ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం ఇతర దేవాలయాల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక నిర్దిష్ట కుక్కను మాత్రమే పూజించరు. కానీ అన్ని కుక్కలను పూజిస్తారు.
ఆలయం ఎందుకు ప్రత్యేకమైనదంటే ఇక్కడ ప్రజలు కుక్కలకు సహజమైన, అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతారు. అవి మనల్ని అదృశ్య శక్తుల నుంచి రక్షిస్తాయని నమ్మకం. ఈ ఆలయాన్ని స్థాపించడం వెనుక ఉన్న ఆలోచన కుక్కల పట్ల గౌరవం చూపించడమే. మనం కుక్కలను గౌరవిస్తే, అవి ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తాయని ప్రజలు నమ్ముతారు. ప్రతి జీవిని గౌరవించాలని ఈ ఆలయం మనకు బోధిస్తుంది. ఎందుకంటే ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








