AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 18న నవంబర్‌ నెల శ్రీవారి దర్శన కోటా విడుదల.. పూర్తి వివరాలు

తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా తిరుమల క్షేత్రానికి కార్తీక మాసంలో వెళ్ళడానికి భక్తులు ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపధ్యంలో కార్తీక పౌర్ణమికి శ్రీవారి దర్శనం చేసుకోవాలని కోరుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ నెలలో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునేవారి కోసం వివిధ దర్శన టిక్కెట్ల జారీ తేదీలను టీటీడీ ప్రకటించింది. న‌వంబ‌ర్‌ నెల దర్శన కోటా విడుదల వివరాలు విడుదల చేసింది.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 18న నవంబర్‌ నెల శ్రీవారి దర్శన కోటా విడుదల.. పూర్తి వివరాలు
Tirumala Darshan Current Update
Surya Kala
|

Updated on: Aug 15, 2025 | 10:47 AM

Share

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులు ముందుగానే వారు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందునా శ్రావణ మాసం, కార్తీక మాసం వంటి నెలల్లో శ్రీవారి దర్శనం అంటే తప్పనిసరిగా దర్శనం, బస వంటి సౌకర్యాలు ముందుగానే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో న‌వంబ‌ర్‌ నెలకు సంబంధించి టీటీడీ దర్శనాల, గదుల కోటా బుకింగ్ రిలీజ్ తేదీలను ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నవంబర్‌ కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్‌ డిప్‌ కోసం ఆగస్ట్‌ 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపింది. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని విజ్ఞప్తి చేసింది. న‌వంబ‌ర్‌ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఏమిటంటే..

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన న‌వంబ‌ర్‌ నెల కోటాను ఆగ‌స్టు 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగ‌స్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఆగ‌స్టు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

ఇవి కూడా చదవండి

21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆగ‌స్టు 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.

21న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆగ‌స్టు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు

అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగ‌స్టు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను ఆగ‌స్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయ‌నుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఆగ‌స్టు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగ‌స్టు 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను ఆగ‌స్టు 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా
పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం
పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం