AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malai Ghevar: స్వాతంత్య దినోత్సవ స్పెషల్ రాజస్థానీ స్వీట్.. త్రివర్ణ మలై ఘేవర్.. రెసిపీ మీ కోసం..

భారతదేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో సాంప్రదాయ వంటకాలు ప్రధాన వేదికగా నిలుస్తాయి. ఈ రంగురంగుల వంటకాలు కుటుంబాలను ఒకచోట చేర్చి, ఆహారం ద్వారా జాతీయ గౌరవాన్ని వ్యక్తపరుస్తాయి. రుచికరమైన ఆహారానికి జెండాలోని త్రివర్ణాలను అద్దుతూ వైవిద్యంగా తయారు చేసుకోవాలనుకుంటే రాజస్తాన్ స్పెషల్ స్వీట్ మలై ఘేవర్ ను ట్రై చేయండి.

Malai Ghevar: స్వాతంత్య దినోత్సవ స్పెషల్ రాజస్థానీ స్వీట్.. త్రివర్ణ మలై ఘేవర్.. రెసిపీ మీ కోసం..
Malai Ghevar
Surya Kala
|

Updated on: Aug 15, 2025 | 12:04 PM

Share

ఆ సేతు హిమాచలం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఆగస్టు 15 ఉదయం నుంచే త్రివర్ణ పతాక రెపరెపలాడుతుండటం, దేశభక్తి గీతాల ప్రతిధ్వనులు, స్వేచ్చ, గర్వం వెచ్చదనంతో మేల్కొంటుంది. వీధులు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలో పెయింట్ చేయబడ్డాయి. మార్కెట్లు జెండాలు, బ్యాడ్జ్‌లు, స్వీట్లు కొనుగోలు చేసే వ్యక్తులతో సందడిగా మారాయి. ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారితో కలిసి కలిసికట్టుగా జరుపుకుంటున్నారు. ఎర్రకోటపై జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని వర్చువల్‌గా చూస్తూ అందిస్తూ.. రుచికరమైన ఆహారానికి జెండాలోని త్రివర్ణాలను అద్దుతూ వైవిద్యంగా తయారు చేసుకోవాలనుకుంటే రాజస్తాన్ స్పెషల్ స్వీట్ మలై ఘేవర్ ను ట్రై చేయండి. రాజస్థానీ స్వీట్ మలై ఘేవర్ తయారీ విధానం మీ కోసం

కావాల్సిన పదార్థాలు:

  1. మైదా- 500 గ్రాముల
  2. నెయ్యి- 150 గ్రాముల
  3. నీరు- 1.5 లీటర్ల
  4. పాలు- 1 లీటరు
  5. ఇవి కూడా చదవండి
  6. చక్కెర- 50 గ్రాముల
  7. యాలకుల పొడి- 5 గ్రాములు
  8. కుంకుమపువ్వు- 1 గ్రాము
  9. డ్రై ఫ్రూట్స్  బాదం, పిస్తా- 50 గ్రాములు కట్ చేసినవి
  10. చక్కెర సిరప్ కోసం: 500 గ్రాముల చక్కెర, 250 మి.లీ నీరు, చిటికెడు కుంకుమపువ్వు
  11. నెయ్యి- వేయించడానికి సరిపడా
  12. పచ్చి బఠానీ ప్యూరీ- 50 గ్రాములు
  13. మలై (మీగడ): అవసరమైనంత 

తయారీ విధానం:

  1. మందపాటి అడుగున ఉన్న పాన్‌లో తీసుకుని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేడి చేసి.. ఐస్‌తో చల్లబరిచి, మలినాలను వేరు చేయండి.
  2. నెయ్యిని చిలికి స్మూతీగా చేయండి.. ఇందులో కొంచెం కొంచెం మైదావేసి కలిగి.. ఆపై నీరు వేసి కలుపుతూ పిండిని ఉండే పిండిలా చేయండి.
  3. పాన్ లో వేయించడానికి సరిపడా నెయ్యి వేసి వేడి చేసి, ప్రత్యేకమైన ఘేవర్  వృత్తాకార అచ్చు తీసుకుని మధ్యలో రెడీ చేసుకున్న మైదా పిండి మిశ్రమాన్ని పోసి.. బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
  4. ఇంతలో సిరప్ రెడీ చేసుకోండి. నీరు , చక్కెర పూర్తిగా కరిగిపోయే వరకు వేడి చేసి చక్కెర సిరప్ సిద్ధం చేసుకోండి. దానికి కుంకుమపువ్వు జోడించండి.
  5. వేయించిన ఘేవర్‌ను వెచ్చని సిరప్‌లో ముంచి తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి.
  6. మలై కోసం పాలు, చక్కెర, యాలకుల పొడి, కుంకుమపువ్వు, పచ్చి బఠానీ ప్యూరీని వేడి చేసి మంట తగ్గించి, చిక్కబడే వరకు చల్లబరచండి.
  7. ఘేవర్ పైన మలైతో అలంకరించి.. డ్రై ఫ్రూట్స్ ముక్కలతో అలంకరించండి.

మలై ఘేవర్ మాధుర్యం రాజస్థాన్ సాంస్కృతిక వేడుకలను సూచిస్తుంది. దీనిని ఇంట్లోనే చాలా సులభం తయారు చేసుకుని అతిథులకు అందించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?