Holi 2022: ‘హోలీ’ వచ్చేస్తోంది.. రాశిచక్రం ప్రకారం ఈ రంగులతో సెలబ్రేట్ చేసుకుంటే అంతా శుభమేనట..!

Holi 2022: భారతీయ సంప్రదాయ పండుగల్లో హోలికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేశ వ్యాప్తంగా హోలి పండుగను ఘనంగా జరుపుకుంటారు ప్రజలు.

Holi 2022: ‘హోలీ’ వచ్చేస్తోంది.. రాశిచక్రం ప్రకారం ఈ రంగులతో సెలబ్రేట్ చేసుకుంటే అంతా శుభమేనట..!
Colors
Follow us

|

Updated on: Mar 05, 2022 | 7:44 AM

Holi 2022: భారతీయ సంప్రదాయ పండుగల్లో హోలికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేశ వ్యాప్తంగా హోలి పండుగను ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ హోలి వేడుకను జరుపుకుంటారు. వివిధ రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు. అయితే, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలి పండుగను జరుపుకుంటారు. హోలిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటారు. అయితే, రంగులు మన భావాలను సూచిస్తాయట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. హోలి రోజున ఉపయోగించే వివిధ రంగులు నవగ్రహాలకు సంబంధం ఉంటుందట. హోలి వేళ రాశిచక్రాల ఆధారంగా రంగులు చల్లుకుంటే శుభం జరుగుతుందని, ఆనందం, శ్రేయస్సు సిద్ధిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఏ రాశి వారికి ఏ రంగు శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం..

మేషం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మేష రాశికి అధిపతి కుజుడు(కుజ గ్రహం). ఈ నేపథ్యంలో ఈ రాశి ప్రజలకు ఎరుపు రంగు శుభప్రదం. దీనికి తోడుగా ఆరెంజ్, పసుపు రంగులతో కూడా హోలీ సంబరాలు చేసుకోవచ్చు. మేషరాశి వారు హోలిలో ఆకుపచ్చ, నీలం రంగులకు దూరంగా ఉండాలి.

వృషభం: వృషభరాశి వారు హోలీలో వెండి, ఆకుపచ్చ, నీలం రంగులను ఉపయోగించవచ్చు. ఈ రంగులన్నీ వృషభరాశికి శుభప్రదం. అయితే.. ఆరెంజ్, పసుపు, ఎరుపు రంగులకు దూరంగా ఉండండి.

మిథునం: బుధుడు అధిపతి అయిన మిథునరాశి వారికి ఆకుపచ్చ రంగు ఎల్లప్పుడూ అదృష్టమే. ఈ నేపథ్యంలో ఈ రాశిచక్రం వారు ఆకుపచ్చ రంగుతో హోలీ జరుపుకోవడం మంచిది. సిల్వర్ కలర్‌తోనూ జరుపుకోవచ్చు. అయితే.. ఎరుపు, ఆరెంజ్ రంగులకు దూరంగా ఉండాలి.

కర్కాటక రాశి: కర్కాటక రాశికి చంద్రదేవుడు అధిపతి. ఈ రాశిచక్రం వారు సిల్వర్ కలర్‌తో హోలీ జరుపుకుంటే మంచి జరుగుతుంది. అలాగే, పసుపు రంగును కూడా యాడ్ చేయొచ్చు. ఈ రెండు రంగులు కర్కాటకరాశిలో జన్మించిన వారికి అదృష్టాన్ని కలిగిస్తాయి. కానీ నీలం రంగుకూ దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.

సింహం: సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారికి రెడ్, ఆరెంజ్, పసుపు రంగులు శుభప్రదం. ఆకుపచ్చ, నీలం రంగులు అశుభం.

కన్య: కన్యా రాశికి అధిపతి బుధుడు. ఆకుపచ్చ రంగు వీరికి చాలా శుభప్రదం. గ్రీన్ కలర్, సిల్వర్ కలర్ కూడా వాడుకోవచ్చు. ఎరుపు, ఆరెంజ్ రంగులకు దూరంగా ఉండాలి.

తులా రాశి: సిల్వర్ కలర్ తులా రాశి వారికి శుభప్రదం. బ్లూ, గ్రీన్ రంగులను కూడా యూజ్ చేయొచ్చు. ఎరుపు, పసుపు, ఆరెంజ్ రంగులకు దూరంగా ఉండాలి.

వృశ్చిక రాశి: కుజుడు వృశ్చిక రాశికి అధిపతి. ఈ నేపథ్యంలో ఈ రాశివారు హోలీకి ఎరుపు, ఆరెంజ్, సిల్వర్, పసుపు రంగులను వినియోగించవచ్చు. ఈ రంగులన్నీ వారికి శుభప్రదంగా ఉంటాయి. అయితే, నీలం రంగుకు మాత్రం దూరంగా ఉండటం ఉత్తమం.

ధనుస్సు: ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ రాశి వారు హోలీ రోజున పసుపు, నారింజ, ఎరుపు రంగులతో పండుగను జరుపుకోవచ్చు. ఈ మూడు రంగులు వారికి అదృష్టాన్ని కలుగజేస్తాయి.

మకరం: మకర రాశికి శని గ్రహం అధిపతి. హోలీ రోజున ఆకుపచ్చ, నలుపు రంగులు వీరికి శుభప్రదం. ఎరుపు, పసుపు, నారింజ రంగులకు దూరంగా ఉండాలి.

కుంభ రాశి: కుంభ రాశికి శనిగ్రహం అధిపతి. ఈ నేపథ్యంలో వీరు హోలీకి నీలం, ఆకుపచ్చ, నలుపు రంగులతో సంబరాలు చేసుకోవడం మంచిది. అయితే ఎరుపు, పసుపు, నారింజ రంగు వీరికి అశుభంగా పగణించడం జరిగింది.

మీనం: బృహస్పతి మీన రాశికి అధిపతి. హోలీలో పసుపు రంగు ఈ రాశికి చాలా శుభప్రదమైనది. ఆరెంజ్ కలర్‌తోనూ హోలీ చేసుకోవచ్చు. అయితే, ఈ రాశి వారు నలుపు, నీలం, ఆకుపచ్చ రంగులను ఉపయోగించవద్దు.

Also read:

Drugs: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

Russia Ukraine Crisis Live: తగ్గేదెలే అంటున్న రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం..

Medaram Hundi: మేడారం హుండీ లెక్కింపు పూర్తి.. ఈసారి తగ్గిన ఆదాయం.. ఇంకా తేలాల్సిన బంగారం, వెండి కానుకల లెక్కలు