Russia Ukraine Crisis: ఖార్కివ్‌లో ‘ఆపరేషన్ గంగా’ విజయవంతం.. నో ఫ్లైజోన్‌పై పుతిన్ వార్నింగ్
Russia-Ukraine War Updates: రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకరమైన యుద్ధం 10వ రోజుకు చేరింది. ఎక్కడచూసినా రక్తపు మడుగులు, గాయాలతో అల్లాడుతున్నవారు, శవాల దిబ్బలు, ధ్వంసమైన భవనాలు కనిపిస్తున్నాయి.
Russia-Ukraine War Live Updates: ప్రపంచదేశాల ఒత్తిడితో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విదేశీయులను తరలించేందుకు వీలు కల్పిస్తూ ఐదున్నర గంటలపాటు యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా ప్రతినిధి తెలిపారు. విదేశీయులను ఉక్రెయిన్ నుంచి తరలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటల నుంచి కాల్పుల విరామం ప్రకటించారు.
రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకరమైన యుద్ధం 10వ రోజుకు చేరింది. ఎక్కడచూసినా రక్తపు మడుగులు, గాయాలతో అల్లాడుతున్నవారు, శవాల దిబ్బలు, ధ్వంసమైన భవనాలు కనిపిస్తున్నాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు వేరే ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఇరు దేశాల మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ప్రపంచంలోని చాలా దేశాలు ఖండిస్తున్నప్పటికీ పుతిన్.. ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. షెల్స్, బాంబులతో ఉక్రెయిన్ నగరాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులతో బరోద్యాంకా, డొనెట్స్ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇరు దేశాల సైనికులతోపాటు వందలాది మంది ప్రజలు సైతం దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతోపాటు చాలామంది గాయాలపాలయ్యారు. చికిత్స అందక అనేక మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
కాగా.. రష్యా ఉక్రెయిన్‌పై అణుబాంబు వెయ్యకపోయినా, అలాంటి విధ్వంసానికే ఆరంభం పలికింది. దేశానికి 40శాతం న్యూక్లియర్ పవర్‌ను అందిస్తున్న జఫ్రోజియా న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసింది. ఈ క్రమంలో మూడోసారి కూడా బెలారస్ బ్రెస్ట్ ప్రాంతంలో చర్చలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే.. ప్రధాన పట్టణాలపై ఫోకస్ చేసిన రష్యన్ బలగాలు ఖార్కీవ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. యుద్ధం మొదలైన 8 రోజుల తర్వాత రష్యా సైన్యం ఖెర్సన్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతోపాటు కీవ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు బలగాలు దూసుకెళ్తున్నాయి.
ఇదిలాఉంటే.. భారతీయ విద్యార్థులను తరలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ యుద్ధం వల్ల ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు నలుగురు కేంద్ర మంత్రుల పర్యవేక్షణలో ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. ఆపరేషన్ గంగా ద్వారా వీరిని స్వదేశానికి చేరుస్తుంది.
LIVE NEWS & UPDATES
-
ముగిసిన రెండో రోజు ఆట.. ఆకట్టుకున్న టీమిండియా బౌలర్లు..
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి లంక జట్టు 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. నిశాంక (26), అసలంక(1) క్రీజులో ఉన్నారు. అశ్విన్ రెండు వికెట్లతో సత్తాచాటగా జడేజా, బుమ్రా తలా ఓ వికెట్ తీశారు. అంతకు ముందు టీమిండియా 574/8 వద్ద తొలి ఇన్సింగ్స్ ను డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అశ్విన్ (61), షమీ (20) రాణించారు. ప్రస్తుతం లంకేయులు ఇంకా 466 పరుగులు వెనకబడి ఉన్నారు.
That will be STUMPS on Day 2 of the 1st Test.
Sri Lanka 108/4, trail #TeamIndia 574/8d by 466 runs.
Scorecard – https://t.co/c2vTOXSGfx #INDvSL @Paytm pic.twitter.com/LqUs9xCxtc
— BCCI (@BCCI) March 5, 2022
-
ముగిసిన రెండో రోజు ఆట.. ఆకట్టుకున్న టీమిండియా బౌలర్లు..
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి లంక జట్టు 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. నిశాంక (26), అసలంక(1) క్రీజులో ఉన్నారు. అశ్విన్ రెండు వికెట్లతో సత్తాచాటగా జడేజా, బుమ్రా తలా ఓ వికెట్ తీశారు. అంతకు ముందు టీమిండియా 574/8 వద్ద తొలి ఇన్సింగ్స్ ను డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అశ్విన్ (61), షమీ (20) రాణించారు. ప్రస్తుతం లంకేయులు ఇంకా 466 పరుగులు వెనకబడి ఉన్నారు.
That will be STUMPS on Day 2 of the 1st Test.
Sri Lanka 108/4, trail #TeamIndia 574/8d by 466 runs.
Scorecard – https://t.co/c2vTOXSGfx #INDvSL @Paytm pic.twitter.com/LqUs9xCxtc
— BCCI (@BCCI) March 5, 2022
-
-
సేఫ్ కారిడార్ రూపొందించండి.. రష్యా, ఉక్రెయిన్‌లకు భారత్ వినతి
ఉక్రెయిన్‌లోని సుమీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను కాపాడేందుకు రష్యా, ఉక్రెయిన్‌లకు భారత ప్రభుత్వం ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. భారతీయ విద్యార్థుల కోసం సురక్షితమైన కారిడార్‌ను రూపొందించాలని రష్యా, ఉక్రెయిన్‌లను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది.
We are deeply concerned about Indian students in Sumy, Ukraine. Have strongly pressed Russian and Ukrainian governments through multiple channels for an immediate ceasefire to create a safe corridor for our students.
— Arindam Bagchi (@MEAIndia) March 5, 2022
-
ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కమలా హారిస్..
ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ వెళ్లనున్నారు. ఈనెల 9 నుంచి 11 వరకూ పోలాండ్, రొమేనియాలో పర్యటించనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో నాటో భాగస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయనున్నారు కమలా హారీస్
-
ఇప్పటివరకు 10 వేల మంది రష్యా సైనికులు మృతి: ఉక్రెయిన్
ఉక్రెయిన్ సైన్యం విడుదల చేసిన డేటాలో.. యుద్ధంలో ఇప్పటివరకు 10 వేల మంది రష్యన్ సైనికులు మరణించినట్లు పేర్కొంది. అలాగే పెద్ద సంఖ్యలో ఆయుధాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్ దాడుల్లో 40 హెలికాప్టర్లు, 269 ట్యాంకులు ధ్వంసమయ్యాయని తెలిపింది.
-
-
సోషల్ మీడియాను బ్యాన్ చేసిన రష్యా
సోషల్ మీడియాపై రష్యా తీవ్రమైన ఆంక్షలు విధిస్తోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూప్‌స్టోర్‌పై రష్యా బ్యాన్ పెట్టింది. రష్యాకు వ్యతిరేకమైన వీడియోలు, వార్తలు ఉన్నాయన్న కారణంగా సోషల్ మీడియాపై రష్యా ఉక్కుపాదం మోపుతోంది.రష్యా చర్యలపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ఆపాలంటూ పలు దేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని డిమాండ్ వ్యక్తం అవుతోంది.
-
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థికి ఎమ్మెల్యే గంటా పరామర్శ
విశాఖపట్నం: ఉక్రెయిన్ నుండి తిరిగివచ్చిన మురళీనగర్ కి చెందిన హర్ష అనే విద్యార్థి నివాసానికి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ వెళ్లారు. విద్యార్థి హర్షను,అతని తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. గ౦టాతో పాటు పరామర్శి౦చిన వారిలో విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, స్థానిక TDP నాయకులు ఉన్నారు.
-
విద్యార్థుల తరలింపు వేగవంతం చేయండి.. కేంద్ర మంత్రులకు ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ
కేంద్ర మంత్రులు జై శంకర్, జ్యోతిరాదిత్య సింధియా, హర్దీప్ సింగ్ పురికి టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖలు రాశాను. రొమేనియా, హంగేరి దేశాలకు అదనపు విమానాలు పంపి విద్యార్థుల తరలింపు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 507 మంది విద్యార్థులు రొమేనియా, హంగేరి సరిహద్దులు దాటి విమానాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ సరిహద్దుల్లోని విద్యార్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారని గుర్తుచేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలకు అభినందనలు తెలిపారు.
-
ఉక్రెయిన్ నుంచి గన్నవరం చేరుకున్న తెలుగు విద్యార్థులు
కృష్ణ జిల్లా: ఉక్రెయిన్ లో చదువుతున్న 17 మంది తెలుగు విద్యార్థులు బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక రిప్రజెంటేటివ్ అధికారి రత్నాకర్, రెవెన్యూ అధికారులు ఎయిర్ పోర్టులో విద్యార్థులను రిసీవ్ చేసుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఉక్రెయిన్ విద్యార్థుల రాక కోసం గన్నవరం డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
-
రష్యా కీలక నిర్ణయం.. ఐదున్నర గంటల పాటు యుద్ధానికి తాత్కాలిక విరామం..
ప్రపంచదేశాల ఒత్తిడితో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులను ఉక్రెయిన్ నుంచి తరలించేందుకు ఐదున్నర గంటలపాటు యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా ప్రతినిధి తెలిపారు.
Russia declares ceasefire in Ukraine from 06:00 GMT (Greenwich Mean Time Zone) to open humanitarian corridors for civilians, reports Russia’s media outlet Sputnik
— ANI (@ANI) March 5, 2022
-
భారతీయ విద్యార్థులను, విదేశీయులను తరలించడానికి సిద్ధంగా ఉన్నాం: రష్యా
తూర్పు యురోపియన్ దేశంలో తీవ్ర ఘర్షణల మధ్య.. అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను, ఇతర విదేశీయులను తరలించడానికి తూర్పు ఉక్రెయిన్ నగరాలైన ఖార్కివ్, సుమీకి వెళ్లడానికి రష్యన్ బస్సులు క్రాసింగ్ పాయింట్ల వద్ద సిద్ధంగా ఉన్నాయని రష్యా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తెలియజేసింది. యూరోప్‌లో అతిపెద్దదైన ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసిన తర్వాత అల్బేనియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, నార్వే, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ పిలుపునిచ్చిన 15-దేశాల కౌన్సిల్ శుక్రవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఉక్రెయిన్ జాతీయవాదులు తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్, సుమీ నగరాల్లో 3,700 మంది భారతీయ పౌరులను బందీలుగా ఉంచారని రష్యా పేర్కొంది.
-
ప్రమాదకర పరిస్థితుల్లో భారతీయలు
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో ఇంకా 1000 మంది భారతీయలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని కేంద్రం వెల్లడించింది. వీరిలో 700 మంది సుమీలో, 300 మంది ఖర్కీవ్‌లో ఉన్నట్లు తెలిపింది.
-
జెలెన్‌స్కీ భద్రత కోసం స్పెషల్ ఫోర్స్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. తన హత్యకు రష్యా కుట్ర చేస్తోందని జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు. నాలుగు సార్లు హత్యాయత్నం జరిగినట్లు ఆరోపణలు గుప్పించారు. తను క్వీవ్‌లోనే ఉన్నట్లు ప్రకటించారు జెలెన్‌స్కీ. జెలెన్‌స్కీ ఇంటి ఆవరణలో రష్యా మిస్సైల్స్ శకలాలు గుర్తించడం కలకలం రేపుతోంది. జెలెన్‌స్కీ పోలాండ్ వెళ్లినట్లు రష్యా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. జెలెన్‌స్కీ భద్రత కోసం స్పెషల్ ఫోర్స్ ఏర్పాటైంది.
-
ఐక్యరాజ్యసమితిలో మాస్కో కీలక ప్రకటన.. బందీలుగా విదేశీయులు
ఐక్యరాజ్యసమితిలో మాస్కో రాయబారి (Moscow Ambassador) కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ జాతీయవాదుల చేతిలో విదేశీయులు బందీలుగా ఉన్నట్లు ప్రకటించారు. ఖార్కివ్‌లో భారతీయులు (Indians) 3,189 మంది ఉండగా, వియత్నామీస్-2700, ఖార్కివ్ (Kharkiv)లో బందీలుగా 202 మంది చైనీయులు, సుమీలో భారతీయులు 576 మంది, ఘనా-101, చైనీయులు 121, చెర్నిహివ్‌లో బందీలుగా 9 మంది ఇండోనేషియన్లు బందీలుగా ఉన్నట్లు పేర్కొన్నారు.
-
ఉక్రెయిన్‌ను విడిచి వెళ్తున్న ప్రజలు..
ఉక్రెయిన్‌ను విడిచి వెళ్తున్న ప్రజలు.. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ (UNHCR) నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 24న రష్యా ప్రారంభించిన దాడి తర్వాత మార్చి 3 నాటికి 1.2 మిలియన్లకు పైగా శరణార్థులు ఉక్రెయిన్‌ను విడిచిపెట్టారు.
-
వారంలో 500 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించిన రష్యా..
ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించినప్పటి నుంచి రష్యా వారానికి 500 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్‌కు చెందిన ది కైవ్ ఇండిపెండెంట్ పేర్కొంది. రష్యా రోజుకు రెండు డజన్ల చొప్పున అన్ని రకాల క్షిపణులను ప్రయోగిస్తోందని పెంటగాన్ అధికారి ఒకరు తెలిపారు.
-
రష్యాకు శామ్సంగ్ ఎగుమతులు నిలపివేత..
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా రష్యాకు ఎగుమతులు నిలిపివేసినట్లు Samsung Electronics పేర్కొంది. శామ్సంగ్ కూడా ఈ ప్రాంతంలో నెలకొన్న సంక్షోభంపై ఆందోళన వ్యక్తంచేసింది. దీంతోపాటు సహాయక చర్యల్లో భాగంగా $1 మిలియన్ ఎలక్ట్రానిక్స్‌తో సహా 6 మిలియన్ డాలర్లను విరాళంగా అందిస్తోంది.
-
ఇప్పటివరకు 11 వేల మంది భారతీయులను రక్షించాం: కేంద్రమంత్రి మురళీధరన్
ఇప్పటివరకు 11 వేల మంది భారతీయులను రక్షించాం: కేంద్రమంత్రి మురళీధరన్ ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 11,000 మంది భారతీయులను తరలించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ట్వీట్ చేశారు. న్యూఢిల్లీ విమానాశ్రయంలో 170 మంది భారతీయుల బృందాన్ని ఎయిర్ ఏషియా ఇండియా ద్వారా తరలించినట్లు తెలిపారు.
-
ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను బ్లాక్ చేసిన రష్యా..
ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను బ్లాక్ చేసిన రష్యా..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆంక్షలు విధించిన దేశాలపై ఆంక్షలు ప్రారంభించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లను బ్లాక్ చేశారు. ఉక్రెయిన్‌పై దాడి గురించి అవాస్తవ వార్తలను ప్రసారం చేయకుండా కఠినమైన ఆంక్షలను విధించినట్లు పేర్కొన్నారు ప్రతినిధులు.
-
ఢిల్లీకి చేరుకున్న మరో విమానం..
ఉక్రెయిన్ నుంచి 229 మంది భారతీయ పౌరులతో ప్రత్యేక ఇండిగో విమానం రొమేనియాలోని సుసెవా నుండి ఢిల్లీకి చేరుకుంది.
-
ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటి ఆవరణలో రష్యా మిస్సైల్స్..
ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటి ఆవరణలో రష్యా మిస్సైల్స్.. ఉక్రెయిన్- రష్యా దేశాల మధ్య వార్ కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా నిరంతరం దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇంటి ఆవరణలో రష్యా మిస్సైల్స్ దూసుకొచ్చాయని అధికారులు వెల్లడించారు.
-
ఉక్రెయిన్ బందీలుగా విదేశీయులు..
ఉక్రెయిన్ బందీలుగా విదేశీయులు.. ఖర్కీవ్‌లో భారత్, చైనా, ఇండోనేషియా వాసులు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితిలో మాస్కో రాయబారి ప్రకటించారు.
-
మరోసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం..
ఉక్రెయిన్‌లో రష్యా దాడులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుందని దౌత్యవేత్తలు శుక్రవారం తెలిపారు. ఈ సెషన్ తర్వాత కౌన్సిల్‌లోని 15 మంది సభ్యులు ముసాయిదా తీర్మానంపై చర్చించనున్నారు. ఈ రెండో సమావేశాన్ని మెక్సికో, ఫ్రాన్స్ ప్రతిపాదించాయని.. ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగింపు పలికేందుకు చర్చలు జరపనున్నారు.
-
ఖర్కివ్‌లో భీకర దాడులు
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన ఖర్కివ్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో ప్రజలంతా సమీపంలోని షెల్టర్లలోకి వెళ్లాలని ప్రభుత్వం సూచించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
Published On - Mar 05,2022 7:04 AM