Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: చిన్నతనం నుంచి అన్నీ పంచుకున్న ముగ్గురు సోదరినీమణులు.. చివరికి భర్తను కూడా.. ఒకే వ్యక్తిని ప్రేమించిపెళ్లి

Viral News: ముగ్గురు అక్కచెల్లెలు(Triplets).. కలిసి పుట్టారు.. చిన్న తనం నుంచి కలిసి పెరిగారు... అన్నింటిని పంచుకున్నారు. చివరకు పెరిగి పెద్ద అయ్యి.. పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఒక వ్యక్తినే..

Viral News: చిన్నతనం నుంచి అన్నీ పంచుకున్న ముగ్గురు సోదరినీమణులు.. చివరికి భర్తను కూడా.. ఒకే వ్యక్తిని ప్రేమించిపెళ్లి
Man Marries Triplets At The
Follow us
Surya Kala

|

Updated on: Mar 05, 2022 | 8:05 AM

Viral News: ముగ్గురు అక్కచెల్లెలు(Triplets).. కలిసి పుట్టారు.. చిన్న తనం నుంచి కలిసి పెరిగారు… అన్నింటిని పంచుకున్నారు. చివరకు పెరిగి పెద్ద అయ్యి.. పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఒక వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన కాంగో(Congo)లో జరిగింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(Democratic Republic of Congo)లో బహుభార్యత్వం అమలులో ఉంది. ఓ వ్యక్తికి ముగ్గురు సోదరీమణులు ఒకేసారి ప్రపోజ్ చేశారు. అతను ఆ ముగ్గురిని ఒకే రోజు వివాహం చేసుకున్నాడు. ఈస్ట్ కాంగోకి చెందిన 32 ఏళ్ల లువిజో(Luwizo).. ఒకేసారి నడేగే, నటాషా, నటాలీ అనే ముగ్గురు యువతులను ఒకేసారి వివాహం చేసుకున్నాడు. అయితే ఆ దేశంలో ఒక వ్యక్తి .. ఎక్కువ మందిని వివాహం చేసుకోవడానికి బహుభార్యాత్వానికి చట్టబద్ధత ఉంది.

తన పెళ్లి విషయంపై లువిజో స్పందిస్తూ.. తనకు ముగ్గురు యువతులు ప్రపోజ్ చేశారని.. వారి ప్రేమను తాను  తిరస్కరించలేకపోయినట్లు చెప్పాడు. అందుకనే తాను వారందరినీ వివాహం చేసుకోవలసి వచ్చిందని చెప్పాడు. అయితే తాను తీసుకున్న నిర్ణయం అంత ఈజీకాదని.. తన తల్లిదండ్రులకు తన నిర్ణయం కూడా అర్ధం కాలేదని చెప్పాడు. తన నిర్ణయం తనవాళ్లకు అర్ధం కాలేదని.. అందుకనే తల్లిదండ్రులేకాదు.. తన కుటుంబ సభ్యులు కూడా ఈ  వివాహానికి హాజరుకాలేదని తెలిపాడు.

“ఒకటి పొందాలంటే దేనినైనా పోగొట్టుకోవాలి..ఎవరికైనా సొంత ప్రాధాన్యతలు, స్వంత నిర్ణయాలు ఉంటాయి. కనుక తాను  ఇతరులు ఏమనుకున్నా ముగ్గురిని పెళ్లి చేసుకున్నానని.. ఇలా చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. తల్లిదండ్రులు నా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అందుకే వారు నా పెళ్లికి హాజరు కాలేదు. అయితే ప్రేమకు పరిమితులు లేవు అని నేను చెప్పగలనని అన్నాడు. అయితే పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వివాహానికి హాజరు కానప్పటికీ.. సన్నిహితులు, పెళ్లి కూతుళ్ళ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

అయితే తాను ఇద్దరు సోదరీమణులను కలవడానికి ముందు .. ముగ్గురు అక్కచెల్లల్లో మొదట నటాలీతో ప్రేమలో పడ్డానని లువిజో చెప్పాడు. అయితే.. నటాలీ .. తన బాయ్ ఫ్రెండ్ ను కవల సోదరీమణులు నడేగే , నటాషాలకు పరిచయం చేసింది. అప్పుడు మిగిలిన ఇద్దరూ కూడా అతనితో ప్రేమలో పడ్డారు. తనను వారిద్దరూ కూడా ప్రేమించడం ఎంతో ఆశ్చర్య పరిచిందని లువిజో చెప్పాడు. తాను దాదాపు “మూర్ఛపోయాడని” చెప్పాడు. ముగ్గురు సోదరీమణులలో ఒకరికొకరు చిన్నప్పటి నుండి ప్రతిదీ పంచుకున్నారని.. కనుక ఇప్పుడు భర్తను పంచుకోవడంవారికీ కష్టం కాదని చెప్పాడు

Also Read:

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఇవి తప్పకుండా తెలుసుకోవాలి..