Stock Market: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఇవి తప్పకుండా తెలుసుకోవాలి..

జగిత్యాలలో ఉంటున్న రాజీవ్ స్టాక్ మార్కెట్(Stock Market) వార్తలు వింటూనే నిరాశతో కూలబడిపోయాడు. సాధారణంగా రాజీవ్ జీవితంలో ఎప్పుడూ వివేకంగా వ్యవహరిస్తాడు..

Stock Market: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఇవి తప్పకుండా తెలుసుకోవాలి..
Follow us

|

Updated on: Mar 05, 2022 | 7:53 AM

జగిత్యాలలో ఉంటున్న రాజీవ్ స్టాక్ మార్కెట్(Stock Market) వార్తలు వింటూనే నిరాశతో కూలబడిపోయాడు. సాధారణంగా రాజీవ్ జీవితంలో ఎప్పుడూ వివేకంగా వ్యవహరిస్తాడు. కానీ, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి విషయంలో దొరికిపోయాడు. ఎలాగంటే.. అతను 2018లో యస్ బ్యాంక్‌(Yes Bank)లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. అయితే, యస్ బ్యాంక్‌లో పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో, స్టాక్ మార్కెట్ నుంచి డబ్బు సంపాదించాలనే రాజీవ్ కల ఆవిరైపోయింది. అతను తన డబ్బు అంతా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు, రాజీవ్ ఇకపై స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకోలేదు. అయితే, రాజీవ్ నిజంగా పశ్చాత్తాపపడుతున్న విషయం ఏమిటంటే, యస్ బ్యాంక్‌లో రాబోయే సంక్షోభాన్ని అతను పసిగట్టగలిగితే ఇంత నష్టం ఉండేది కాదు కదా అని. రాజీవ్ లాగానే, చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు(Invester) కార్పొరేట్ మోసాలకు సంబంధించిన అనేక సందర్భాల్లో తమ వేళ్లను కాల్చుకున్నారు.

అసలు రాజీవ్ వంటి రిటైల్ ఇన్వెస్టర్స్ కు ముందుగానే షేర్ మార్కెట్‌కు సంబంధించి ఇటువంటి నష్టపోయే విషయాలను తెలుసుకునే అవకాశం ఉందా? అనేది ప్రశ్న అయితే దానికి సమాధానం ఉంది. మీరు ఏదైనా కార్పొరేట్ హౌస్‌ తప్పు చేయాలనీ చేసే ప్రయత్నాన్ని ముందే తెలుసుకోవచ్చు. దీనికోసం కొన్ని విషయాలను అర్ధం చేసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాం. ముందుగా మీరు కంపెనీ వార్షిక నివేదికను చదవాలి. మీరు వార్షిక నివేదికను చదివితే చాలా కంపెనీకి సంబంధిత సమాచారాన్ని పొందవచ్చు. అయితే, కంపెనీల వార్షిక నివేదిక చాలా పెద్ద డాక్యుమెంట్. ఇందులో ఏ అంశాలపై ఫోకస్ పెట్టాలి అనే సందేహం వస్తుంది. కాబట్టి, ముందుగా మీరు, ఒక సంస్థ క్యాష్ ఫ్లోను చెక్ చేయాలి… క్యాష్ ఫ్లో కార్పొరేట్ ఎక్కడ నుంచి డబ్బును సేకరిస్తోంది.. ఏ కార్యకలాపాలపై డబ్బు ఖర్చు చేస్తోందో మీకు తెలుపుతాం.

సాధారణంగా, క్యాష్ ఫ్లో పేపర్ సంస్థ లాభాన్ని వెల్లడిస్తుంది.అయితే ప్రతిసారీ ఇలా ఉండదు. వాస్తవానికి, కంపెనీలు కాలక్రమేణా అకౌంటింగ్ పుస్తకాల తారుమారు చేయడం నేర్చుకున్నాయి. సంస్థ లాభం దాని క్యాష్ ఫ్లో అనుగుణంగా లేదని చాలా సందర్భాలలో మనం గమనించవచ్చు. ఒక కంపెనీ గత 2 సంవత్సరాలలో ప్రాఫిట్స్ చూపించిందని అనుకుందాం. ఆ సంస్థ మొదట్లో స్థిరమైన క్యాష్ ఫ్లో కొనసాగించింది. అయితే కొంత కాలం తరువాత అది తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది. ఇప్పుడు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది.. మొత్తం డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుంది అలాగే కంపెనీ తన బిజినెస్ పెంచుకోగాలుగుతుందా లేదా అనే అంశాల పై. సంస్థ నిజంగా లాభదాయకంగా ఉంటే, నగదు ప్రవాహాలు ఎందుకు పెరగడం లేదు? ఇది నిజంగా జరిగితే, సంస్థలో ఏదో తప్పు ఉందని ఇది సూచిస్తుంది. ఇప్పుడు, పరిశీలించవలసిన రెండో విషయం గురించి చూద్దాం. కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ లోని డిటైల్డ్ ఫైనాన్షియల్ నోట్స్ పై దృష్టి సారించండి. దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే కొంత వాస్తవ పరిస్థితి అర్ధం అవుతుంది. ఈ డిటైల్డ్ ఫైనాన్షియల్ నోట్స్ చాలా ముఖ్యమైన సమాచారాన్ని ఎక్స్ పోజ్ చేస్తాయి.

ప్రమోటర్లు తమ సొంత ప్రయోజనాల కోసం కంపెనీ సొమ్మును స్వాహా చేస్తున్నారా అనేది ఇక్కడ దృష్టి సారించాల్సిన అత్యంత ఆవశ్యకమైన విషయం. చాలా మంది ప్రమోటర్లు షెల్ కంపెనీలను అంటే నకిలీ కంపెనీలను కూడా సృష్టించి, మాతృ సంస్థ నుంచి అటువంటి కంపెనీలకు డబ్బును డైవర్ట్ చేస్తారు. షెల్ కంపెనీలకు డబ్బును డైవర్ట్ చేయడం అంటే ఆ డబ్బును చివరికి ప్రమోటర్లు తమ సొంత లాభాల కోసం స్వాహా చేయడం అనే విషయం తెలుసుకోవాలి. ఇదిలా ఉంటే మధ్యలో కంపెనీ తన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)ని మార్చేసిందా? అనేది ముఖ్యమైన విషయంగా ఉంటుంది. ఇలా ఏదైనా కంపెనీ చేస్తే కనుక దాని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోండి. కెరీర్ వృద్ధి కోసం CFO నిష్క్రమించారా? లేక అక్రమాలన్నీ బయటపడకముందే సీఎఫ్‌వో వెళ్లిపోవాలనుకుంటున్నారా? అనే అంశాల్ని పరిశీలించండి.

LIC మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ సీనియర్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ ..ఫండ్ మేనేజర్ కరణ్ దోషి మాట్లాడుతూ, ఒక కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ చూస్తున్నప్పుడు, ఇన్వెస్టర్స్ దాని మేయింటేనేన్స్ అలాగే ఎనాలిసిస్ చూడాలని చెప్పారు. ఇది పరిశ్రమ ప్రస్తుత ట్రెండ్‌ను, కార్పొరేట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అదే విధంగా సంస్థ వెళుతున్న డైరెక్షన్ ను వెల్లడిస్తుంది. అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సంస్థ తగినంత నగదు నిల్వ చేయగలదా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని కరణ్ దోషి చెబుతున్నారు.

Read Also.. Mutual Fund: మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. వారికి సెబీ హెచ్చరిక..

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ