AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Fund: మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. వారికి సెబీ హెచ్చరిక..

కరీంనగర్‌లో నివసించే జయంత్ ఇంట్లో కూర్చొని అంతర్జాతీయ మార్కెట్‌(International Market)లో పెట్టుబడులు పెడుతూ లాభాలు ఆర్జిస్తూ ఆనందంగా ఉన్నాడు...

Mutual Fund: మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. వారికి సెబీ హెచ్చరిక..
Mutual Fund
Srinivas Chekkilla
|

Updated on: Mar 05, 2022 | 6:59 AM

Share

కరీంనగర్‌లో నివసించే జయంత్ ఇంట్లో కూర్చొని అంతర్జాతీయ మార్కెట్‌(International Market)లో పెట్టుబడులు పెడుతూ లాభాలు ఆర్జిస్తూ ఆనందంగా ఉన్నాడు. అతను విదేశీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్‌(Mutual Fund)లో ఇన్వెస్ట్ చేస్తుంటాడు. అయితే ఇటివల సెబీ(Sebi) ఇచ్చిన ఆదేశాలు అతడిని భయాందోళనకు గురి చేశాయి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌ను విదేశీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టకుండా మార్కెట్ నియంత్రణ సంస్థ.. సెబీ నిషేధించింది. చాలా మ్యూచువల్ ఫండ్స్ మన దేశంలో పెట్టుబడి దారుల నుంచి సొమ్ము తీసుకుని విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి.

అయితే విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలని అన్ని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలను సెబీ కోరింది. ఇలాంటి మ్యూచువల్ ఫండ్ స్కీములు.. కొత్త ఇన్వెస్టర్ల డిపాజిట్లను తీసుకోవద్దని అన్ని అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలకు సూచించింది. RBI – SEBI విదేశాల్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టె పెట్టుబడిపై ఏడు బిలియన్ డాలర్ల పరిమితిని విధించాయి. జయంత్ లాగా సెబీ లాజిక్‌ను అర్థం చేసుకోలేనివారు చాలా మంది పెట్టుబడిదారులు ఉన్నారు. కారణం ఏమిటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే సెబీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా విదేశీ పెట్టుబడులపై 7 బిలియన్ డాలర్ల పరిమితిని విధించాయి.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి ఈ పరిమితిని చేరుకున్నప్పుడల్లా SEBI హెచ్చరిస్తుంది కానీ గణాంకాలను వెల్లడించదు. అయితే మ్యూచువల్ ఫండ్స్ నిర్దేశిత పరిమితిని ఉల్లంఘించినట్లు సెబీ భావిస్తుంది. అందుకే సెబీ ఈ నిషేధం విధించింది. జూన్ 2021లో SEBI మ్యూచువల్ ఫండ్స్ ద్వారా విదేశీ పెట్టుబడుల నియమాలలో మార్పులను తీసుకువచ్చింది. జూన్ 2021లో SEBI మ్యూచువల్ ఫండ్స్ విదేశీ పెట్టుబడుల నియమాలను మార్చింది. గత సంవత్సరం సెబీ విదేశాల్లో పెట్టుబడుల విషయంలో కొత్త నియమాలు ప్రకటించింది. మ్యూచువల్ ఫండ్స్ అదేవిధంగా ఇతర ఇన్వెస్టర్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అసలు SEBI కొత్త నిబంధనలు ఏమిటి తెలుసుకుందాం. కొత్త నియమాల ప్రకారం ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ పథకం ఓవర్సీస్ మార్కెట్లో ఎక్కువలో ఎక్కువగా ఒక బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ విదేశాల్లో పెట్టె పెట్టుబడి ఏడు బిలియన్ డాలర్లను మించకూడదు. ఈ నియమం ఎదో ఒక ఆర్ధిక సంవత్సరానికే పరిమితం కాదు. ఎప్పటికీ ఇది వర్తిస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఏ సమయంలోనైనా ఈ పరిమితిని దాటకూడదు.

మ్యూచువల్ ఫండ్ ఓవర్సీస్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (OETF)లో గరిష్ఠంగా 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టవచ్చు. మొత్తం పరిశ్రమకు గరిష్ఠ పెట్టుబడి పరిమితి 1 బిలియన్ డాలరుగా నిర్ణయించారు. సెబీ ఆర్డర్ జయంత్ ప్రస్తుత పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపదు. ఇప్పటికే అతను ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని వెనక్కి తీసుకోవలసిన అవసరం లేదు. అతని SIP ఇన్వెస్ట్మెంట్ కూడా కొనసాగుతుంది. కానీ, అటువంటి పథకాలలో లమ్స్‌సమ్ పెట్టుబడి పెట్టలేరు. అటువంటి పథకాలలో STP, SIP చేయడాన్ని సెబీ నిషేధించలేదు. కొత్త పెట్టుబడిదారులు SIPలను ప్రారంభించే విషయంలో కొంత అనిశ్చితి ఉందని రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ అసోసియేషన్ (ARIA) ఛైర్మన్, లోవై నవ్‌లాఖి అన్నారు. అంతర్జాతీయ పెట్టుబడి పరిమితి మరింత పెరగవచ్చు. ఆ తర్వాత కొత్త పెట్టుబడిదారులు పెట్టుబడులను ప్రారంభిచ్చవచ్చన్నారు.

Read also.. Edible Oil: సామాన్యులకు షాక్.. పెరిగిపోతున్న వంట నూనె ధరలు..