Edible Oil: సామాన్యులకు షాక్.. పెరిగిపోతున్న వంట నూనె ధరలు..

హోలీకి ముందే ద్రవ్యోల్బణం ప్రజల జేబుల రంగులను చెదరగొట్టేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukrain) కారణంగా ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న ఏకైక వస్తువు ముడి చమురు(crude) మాత్రమే కాదు...

Edible Oil: సామాన్యులకు షాక్.. పెరిగిపోతున్న వంట నూనె ధరలు..
Sunflower Oil
Follow us

|

Updated on: Mar 05, 2022 | 6:42 AM

హోలీకి ముందే ద్రవ్యోల్బణం ప్రజల జేబుల రంగులను చెదరగొట్టేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukrain) కారణంగా ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న ఏకైక వస్తువు ముడి చమురు(crude) మాత్రమే కాదు. ఎడిబుల్ ఆయిల్(Edible Oil) కూడా వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతోంది. ఢిల్లీలో గత 15 రోజుల్లో పామాయిల్ ధరలు రూ.20-25 పెరిగాయి. సోయా, సన్‌ఫ్లవర్, వేరుశెనగ నూనెల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఆవనూనె ధరలు ఇప్పటికే లీటరు రూ.200కి చేరువలో ఉన్నాయి. ప్రపంచ సరఫరా గొలుసు అడ్డంకుల కారణంగా ఎడిబుల్ ఆయిల్స్ ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దానిని మరింత తీవ్రతరం చేసింది.

దేశంలో వినియోగించే ఎడిబుల్ ఆయిల్‌లో మనం 65% దిగుమతి చేసుకోవాలి. మొత్తం ఎడిబుల్ ఆయిల్ పామాయిల్ దిగుమతిలో 60% వాటా ఉంది. పామాయిల్ మొత్తం మలేషియా, ఇండోనేషియా నుండి దిగుమతి అవుతుంది. అవి కూడా సరఫరా కొరతను ఎదుర్కొంటున్నాయి. మలేషియాలో జనవరిలో డిసెంబర్ పామాయిల్ ఉత్పత్తితో పోలిస్తే, 14% పడిపోయింది. అదేవిధంగా స్టాక్ 8% క్షీణించింది. సరఫరా కొరత ఇప్పటికే పెద్ద సమస్యగా ఉంది. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దానిని కొత్త స్థాయికి తీసుకువెళ్లింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకున్న మొత్తం ఎడిబుల్ ఆయిల్‌లో 14-15% ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం రష్యా , ఉక్రెయిన్ నుంచి వస్తుంది. 2020-21 అక్టోబర్‌తో ముగిసిన చమురు సంవత్సరంలో, 131.31 లక్షల టన్నుల ఎడిబుల్ ఆయిల్ దిగుమతి అయింది. అందులో 19 లక్షల టన్ను సన్‌ఫ్లవర్ ఆయిల్, 16 లక్షల టన్నుల కంటే ఎక్కువ రష్యా , ఉక్రెయిన్ నుంచి దిగుమతి అయింది. యుద్ధం కారణంగా ఇంత సరఫరా ప్రభావితం కావచ్చు.

ఖరీదైన తినదగిన నూనె లు మీ వంటగది ఖర్చులను మాత్రమే పెంచవు. వేసవిలో ఐస్ క్రీం కూడా ఖరీదైనదిగా మారుతుంది. పాల ఉత్పత్తుల పేరుతో విక్రయించే చాలా ఐస్‌క్రీమ్‌లు వాస్తవానికి వనస్పతి నూనెను ఉపయోగించి తయారు చేస్తారు. ఇప్పుడు నూనెలు ఖరీడైనవిగా మారాయి కనుక, ఐస్ క్రీం ధరలు కూడా పెరుగుతాయి. ఐస్‌క్రీం మాత్రమే కాదు, ప్యాక్ చేసిన స్నాక్స్, బయట హోటల్ తిండి కూడా ఖరీదైనదిగా యిపోతుంది. భారతదేశంలో తయారయ్యే నూనె, నూనె గింజలపై ఆధారపడితేనే పరిష్కారం దొరుకుతుంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో నూనెగింజల ఉత్పత్తిని అంచనా వేయగా, వ్యవసాయ మంత్రిత్వ శాఖ 371 లక్షల టన్నుల నూనె గింజల ఉత్పత్తిని అంచనా వేసింది. కానీ రికార్డు ఉత్పత్తి తర్వాత కూడా దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించడానికి తగినంత దిగుబడి రాలేదు.

Read Also.. Fuel Prices: పిడుగు లాంటి వార్త.. సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌పై రేట్లు!