Fuel Prices: పిడుగు లాంటి వార్త.. సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌పై రేట్లు!

ఇప్పటికే పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బండి బయటికి తీయాలంటేనే వణికిపోతున్నారు సామాన్య ప్రజలు. అలాంటి వారికి మరో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నాయి ఆయిల్‌ కంపెనీలు.

Fuel Prices: పిడుగు లాంటి వార్త.. సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌పై రేట్లు!
Fuel Prices
Follow us

|

Updated on: Mar 04, 2022 | 9:52 PM

కారణం ఏదైనా, మూన్నాలుగు నెలలుగా పెట్రోల్‌ ధరల్లో పెద్దగా మార్పులేవి లేవు. అలా అని సంతోషపడే లోపే మరో పిడుగు లాంటి వార్త ప్రచారంలోకి వచ్చింది. అదే, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు త్వరలో ప్రియం కానున్నాయని. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు గరిష్ఠ స్థాయికి చేరిన నేపథ్యంలో, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరలు పెంచేందుకు సన్నద్ధమవుతున్నాయి. దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎల్లుండితో ముగుస్తున్నాయి. దీంతో తర్వాతి రోజు నుంచే ధరలు సవరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు ఏకంగా 12 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఈ పెంపు దశలవారీగా ఉండాలని చమురు సంస్థలకు ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. అయితే, ఈ ధరల పెంపునకు అనేక కారణాలు చెబుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరిగాయని, బ్యారెల్‌ చమురు ధర గురువారం ఏకంగా 120 డాలర్లకు చేరిందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే, యూపీ, పంజాబ్‌ వంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలను సవరించే వీలున్నప్పటికీ, చమురు సంస్థలు ఆ పనిచేయలేదు.

మార్చి 7న చివరి విడత పోలింగ్‌, 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత ధరలు పెంచే ఛాన్స్‌ ఉంది. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల కారణంగా చమురు సంస్థలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. తమ మార్జిన్లు కోల్పోకుండా ఉండాలంటే పెట్రోల్‌, డీజిల్‌పై మార్చి 16వ తేదీలోపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కనీసం 12 రూపాయల మేర పెంచాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌. అటు తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇప్పటికే వంద రూపాయల పైనే ఉన్నాయి. ఇక ఇంకా 12 రూపాయలు పెంచితే భారీ భారం తప్పదంటున్నారు వాహనాదారులు.

Also Read: Andhra Pradesh: మరో సోషల్ మీడియా సంచలనం.. మన ఒంగోలు వ్యక్తే.. స్పెషాలిటీ ఏంటంటే..?

కరెంట్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే మీ గుండె గుబేలుమంటుంది

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??