AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bulk Deals: బల్క్ డీల్ అంటే ఏమిటో తెలుసా.. మార్కెట్‌ ఓపెన్‌కు ముందే ఇది జరుగుతుందా..

అమరావతిలో నివసిస్తున్న హేమంత్ చాలా కాలంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నాడు...

Bulk Deals: బల్క్ డీల్ అంటే ఏమిటో తెలుసా.. మార్కెట్‌ ఓపెన్‌కు ముందే ఇది జరుగుతుందా..
Bulk Deal
Srinivas Chekkilla
|

Updated on: Mar 05, 2022 | 8:05 AM

Share

అమరావతిలో నివసిస్తున్న హేమంత్ చాలా కాలంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నాడు. కానీ ఇప్పటికీ ఎంత ప్రయత్నించినా ఏదైనా షేరు ధర పెరుగుతుందా లేదా అనే అంచనాను అతను తెలుసుకోలేకపోయాడు. షేర్ ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే అంచనాను వేసుకునే మార్గం ఏదైనా ఉందా అనే విషయాన్ని తెలుసుకోవాలని హేమంత్ ప్రయత్నిస్తున్నాడు. హేమంత్ వంటి వారి కోసం ఒక మార్గం ఉంది. ఇటువంటి షేర్‌హోల్డర్‌లు స్టాక్ మార్కెట్ నుంచి ‘బల్క్ డీల్‌’పై డేటా సహాయం తీసుకోవచ్చు. మీరు స్టాక్ మార్కెట్‌లోని షేర్లను బ్లాక్ అలాగే బల్క్ డీల్ చేశారని చెప్పిన సందర్భాలను చాలా సార్లు వింటూ ఉంటారు. ఈ డేటాను ఇన్వెస్టర్లు ఎక్స్ఛేంజీల నుంచి పొందవచ్చు

ఒక బ్లాక్ డీల్ చాలా పారదర్శక పద్ధతిలో రోజులో ఒక సారి జరుగుతుంది. ట్రేడింగ్ విండో ప్రారంభించడం కంటే ముందు 35 నిమిషాలలో బ్లాక్ డీల్ జరుగుతుంది. అందువల్ల, దాని డేటా తక్షణ ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. మరోవైపు, బల్క్ డీల్స్ విషయంలో ఒకటి కంటే ఎక్కువ ట్రేడ్ లలో లావాదేవీలు జరుగుతాయి. అందువల్ల, బల్క్ డీల్ గురించి ఇన్వెస్టర్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. హేమంత్ బల్క్ డీల్ స్టాక్ ధరను ఎలా ప్రభావితం చేస్తుంది అలాగే స్టాక్ యొక్క కదలికను అంచనా వేయడానికి దానిని ఎలా ఉపయోగించాలి? అనే విషయాలపై బాగా ఆలోచిస్తున్నాడు. బల్క్ డీల్ నిర్దిష్ట స్టాక్ పట్ల పెట్టుబడిదారుల ఆసక్తిని సూచిస్తుంది. NSE అలాగే BSEలో హేమంత్ ఇటువంటి డీల్‌లపై నిఘా ఉంచినట్లయితే, ఏయే సంస్థలు ఏ స్టాక్‌లపై ఆసక్తి చూపుతున్నాయో అతను ఊహించగలడు. ఈ డీల్ ఏదైనా స్టాక్‌పై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందా లేదా అనే ఆలోచనను కూడా ఇస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్ బల్క్ డీల్ డేటాను అర్థం చేసుకోవడానికి, ఆర్బిట్రేజ్ ఫండ్‌లతో బల్క్ డీల్‌లు జరిగాయా లేదా అనె విషయం మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమికంగా, ఆర్బిట్రేజ్ ఫండ్‌లు నగదు – ఉత్పన్నాల విభాగం మధ్య అంతరాన్ని ఉపయోగించుకోవడంలో పనిచేస్తాయి. దీనివలన, ఫ్యూచర్స్ మార్కెట్‌లో నిర్దిష్ట స్టాక్‌ను భారీగా విక్రయించే లేదా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చేస్తున్న ఒప్పందాల ఆధారంగా షేర్ ధరల కదలికను మీరు ఊహించలేరు. మీరు మొత్తం బల్క్ డీల్ నుంచి ఆర్బిట్రేజ్ ఫండ్ డీల్ డేటాను తీసివేసిన తర్వాత మాత్రమే షేర్ల కదలికను మీరు ఊహించగలరు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే, బల్క్ డీల్ డేటా హేమంత్‌ లాంటివారికి ఉపయోగపడుతుందని నిరూపించవచ్చు. అదేవిధంగా ఇది చివరికి ట్రేడింగ్ కోసం సరైన షేర్లను ఎంచుకోవడంలో వారికి సహాయపడుతుంది. బల్క్, బ్లాక్ డీల్‌ల ఆధారంగా షేర్ ధర కదలిక అంచనాలను రూపొందించలేరు.

“బల్క్ డీల్ ఎప్పుడూ స్టాక్ ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని సూచించదు. కానీ ఒక నిర్దిష్ట స్టాక్ కోసం బల్క్ డీల్స్ క్రమం తప్పకుండా జరుగుతూ ఉంటే, దానిలో కొనుగోలు లేదా అమ్మకం ట్రెండ్ ఉందో లేదో అది మీకు సూచన ఇస్తుందని మార్వాడీ షేర్స్ & ఫైనాన్స్ అడ్వైజరీ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ రాఠీ చెబుతున్నారు.

Read Also.. Stock Market: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఇవి తప్పకుండా తెలుసుకోవాలి..