Stock Market: పెట్టుబడిదారుల 15 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మూడు వారాల్లో భారీ నష్టం..
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం(Russia, Ukraine War), ద్రవ్యోల్భణం(Inflation) పెరుగుదల కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) తీవ్రంగా నష్టపోతున్నాయి...
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం(Russia, Ukraine War), ద్రవ్యోల్భణం(Inflation) పెరుగుదల కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) తీవ్రంగా నష్టపోతున్నాయి. మార్కెట్లు ఇప్పటివరకు 1970 కోట్ల డాలర్లు కోల్పోయాయి. అంటే దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడులు ఆవిరయ్యాయి. గత మూడు వారాల్లో సెన్సెక్స్ 4000 పాయింట్లు నష్టపోయింది. రూపాయి విలువ భారీగా పతనమైంది. ప్రస్తుతం డాలర్ విలువ 76 రూపాయలకు చేరింది. మార్చిలో ఇప్పటికే రూ. 8500 కోట్లకు పైగా షేర్లను ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్ముకున్నారు. ఫిబ్రవరి లో 33838 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరగడంతోపాటు ద్రవ్యోల్బణం భయాలను రేకెత్తించడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా నష్టాలను చవిచూశాయి. బ్లూ-చిప్ NSE నిఫ్టీ 50 ఇండెక్స్ 1.53% పడిపోయి 16,245 వద్ద స్థిరపడగా, S&P BSE సెన్సెక్స్ 750 పాయింట్లకు పైగా క్షీణించి 54,333 వద్ద ముగిసింది. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లను కోల్పోయింది. ఉక్రెయిన్ సరిహద్దు వెంబడి రష్యా పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించడంతో మార్కెట్లు అంతకుముందు కూడా గందరగోళానికి గురయ్యాయి.
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 76 రూపాయలు దాటింది. భారత్ ముడి చమురును దిగుమతిలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. యుద్ధం ఇంకా కొనసాగినట్లైతే ప్రపంచ ఆర్థిక వృద్ధి ప్రభావితం కావచ్చు. భారత్‌లో ప్రభుత్వం, RBI రెండూ ముడి చమురు ధరను దాదాపు 75 డాలర్లుగా ఉంటాయని భావించాయి. కానీ క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగింది.
Read Also.. Bulk Deals: బల్క్ డీల్ అంటే ఏమిటో తెలుసా.. మార్కెట్ ఓపెన్‌కు ముందే ఇది జరుగుతుందా..