పూర్వీకుల ఆశీర్వాదం కోసం కాకులకు ఎందుకు ఆహారం ఇస్తారు? ఈ సంప్రదాయం రాముడికి మధ్య సంబంధం ఏమిటంటే
జయంతుడు శ్రీరాముడిని పరీక్షించాలనే ఉద్దేశ్యంతో కాకి రూపాన్ని ధరించాడు. తన పదునైన ముక్కుతో సీతాదేవి పాదాలను గాయపరిచాడు. దీని సీతాదేవి పాదాల నుంచి రక్తస్రావం మొదలైంది. సీతాదేవి కాలికి తగిలిన గాయాన్ని చూసిన రాముడు చాలా కోపించి, కాకికి గుణపాఠం చెప్పేందుకు బాణాన్ని సంధించాడు. శ్రీరాముడు బాణాన్ని విడువడాన్ని చూసిన జయంతుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి మొదట బ్రహ్మలోకానికి ఆపై శివ లోకానికి పరుగెత్తాడు.
పితృ పక్షం సమయంలో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, పెద్దల ఆశీర్వాదం పొందడానికి కాకులకు ఆహారం ఇచ్చే సంప్రదాయం ఉంది. హిందూ మతంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కాకులకు ఆహారం ఇవ్వడం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెందుతారు. సంతోషంగా ఉంటారు. ఈ సంప్రదాయం గురించి రామచరితమానస్‌లో ఒక కథ ఉంది. ఈ రోజు రామచరితమానస్ పురాణ కథను గురించి తెలుసుకుందాం.
పురాణం ప్రకారం శ్రీ రామచరితమానస్ కథ ప్రకారం ఒకసారి రాముడు.. సీత దగ్గర కూర్చుని సీతాదేవి జుట్టును పూలతో అలంకరిస్తున్నాడు. ఆ సమయంలో ఇంద్రదేవుడు కొడుకు జయంతుడు అక్కడే ఉన్నాడు. భార్య జడలో పువ్వులు పెడుతున్న రామయ్య దృశ్యాన్ని చూసి.. అసలు ఈ వ్యక్తి నిజంగా విష్ణువు అవతారమేనా అని సందేహించాడు. అంతేకాదు తన సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకున్నాడు. జయంతుడు శ్రీరాముడిని పరీక్షించాలనే ఉద్దేశ్యంతో కాకి రూపాన్ని ధరించాడు. తన పదునైన ముక్కుతో సీతాదేవి పాదాలను గాయపరిచాడు. దీని సీతాదేవి పాదాల నుంచి రక్తస్రావం మొదలైంది.
రామయ్యకు కోపం సీతాదేవి కాలికి తగిలిన గాయాన్ని చూసిన రాముడు చాలా కోపించి, కాకికి గుణపాఠం చెప్పేందుకు బాణాన్ని సంధించాడు. శ్రీరాముడు బాణాన్ని విడువడాన్ని చూసిన జయంతుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి మొదట బ్రహ్మలోకానికి ఆపై శివ లోకానికి పరుగెత్తాడు. అయితే బ్రహ్మ, శివుడిలతో పాటు ఏ దేవుడూ జయంతుడికి సహాయం చేయలేకపోయారు.
శ్రీరాముడిని శరణుజొచ్చిన జయంతుడు ప్రతిచోటుకు వెళ్లి విసుగు చెంది జయంత్ తన తండ్రి ఇంద్ర దేవుడి వద్దకు వెళ్లి సహాయం కోరాడు. రామ బాణం నుంచి రాముడు మాత్రమే నిన్ను రక్షించగలడు.. కనుక నువ్వు రాముడినే ఆశ్రయించు అని ఇంద్రదేవుడు చెప్పాడు. దీని తరువాత జయంతుడు పరిగెత్తుకుంటూ వెళ్లి శ్రీరాముని పాదాలపై పడి క్షమించమని ప్రార్థించడం ప్రారంభించాడు.
చేసిన పనికి కర్మల ఫలం అప్పుడు శ్రీరాముడు జయంతుడితో సంధించిన బాణాన్ని నిష్ఫలం చేయలేమని..అయితే దాని వల్ల కలిగే నష్టాన్ని తగ్గించవచ్చని చెప్పాడు. అప్పుడు ఆ బాణం కాకి వేషంలో ఉన్న జయంతుడి ఒక కంటికి తగిలి విరిగింది. ఆ రోజు నుంచి కాకులు ఒక్క కన్నుతో చూడగలవని నమ్ముతారు.
కాకికి వరం ఇచ్చిన రామయ్య ఈ సంఘటన తర్వాత కాకులకు ఆహారం ఇవ్వడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారని శ్రీరాముడు వరం ఇచ్చాడు. పితృ పక్షంలో పూర్వీకులతో పాటు కాకులకు ఆహారం అందించే సంప్రదాయం అప్పటి నుంచి ప్రారంభమైందని నమ్ముతారు. అందువల్ల పితృ పక్షం సమయంలో కాకులకు ఆహారాన్ని అందించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు