AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi in Mathura: యువతుల కోలాటాలు.. యువకుల కేరింతలు.. మథురలో ఘనంగా హోలీ

హోలీ అంటే రంగుల పండుగ. ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే పండుగ హోలి(Holi). అయితే ఈ పండుగకు మూలమైన కృష్ణ భగవానుడి మందిరం గల నగరం...

Holi in Mathura: యువతుల కోలాటాలు.. యువకుల కేరింతలు.. మథురలో ఘనంగా హోలీ
Holi
Ganesh Mudavath
|

Updated on: Mar 16, 2022 | 7:42 PM

Share

హోలీ అంటే రంగుల పండుగ. ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే పండుగ హోలి(Holi). అయితే ఈ పండుగకు మూలమైన కృష్ణ భగవానుడి మందిరం గల నగరం ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని మథుర. మథురలో ఈ పండుగను 40 రోజుల పాటు అట్టహాసంగా జరుపుకుంటారు. వసంతకాలం ప్రారంభంతోనే ఈ వేడుకలు(Celebrations) ప్రారంభమవుతాయి. దేవాలయాలలో హోలీ ఉత్సవాల సందడి కొనసాగుతోంది. మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం యూపీలోని అన్నిచోట్లా హోలీ ఉత్సాహం కనిపించింది. బర్సానాలోని లాడ్లీజీ ఆలయంలో లడ్డూ హోలీ ఆటతో హోలీ ఆనందం తారాస్థాయికి చేరుకుంటుంది. శ్రీకృష్ణునిపై భక్తులు లడ్డూల వర్షం కురిపిస్తారని సేవాయత్ గోస్వామి చెప్పారు. వేడుకల అనంతరం ఈ లడ్డూలను ప్రసాదంగా భక్తులకు పంచి పెడతారు. దీనిని ‘లడ్డూ హోలీ’ లేదా ‘లడ్డూ లీలా’ అంటారు. మార్చి 14 న భక్తులు మథురలోని ఠాకూర్ ద్వారకాధీష్, బృందావన్‌లోని ఠాకూర్ బాంకే బిహారీ ఆలయంలో రంగులతో హోలీ ఆడతారు. గోకుల్ ఛదిమార్ హోలీ మార్చి 16న జరగనుంది. బాలకృష్ణతో హోలీ ఆడేందుకు గోపికలు కోలాటాలు తీసుకుని బయటకు వస్తారు. మరుసటి రోజు బ్రజ్వాసీలు హోలీ ఆడుతారు.

ప్రతి సంవత్సరం భారతీయుల సంప్రదాయం ప్రకారం పాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ పూర్ణిమను కాముని పున్నమిగా పిలుస్తారు. ఈ పౌర్ణమికి ముందురోజు రాత్రి పిడకలతో కాముడి దహనం చేస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని హోలీ జరుపుకుంటారు.హోలీ వెనుక చాలా పురాణ గాథలు ఉన్నాయి. దైవకార్య నిమిత్తం యోగ నిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి తపోభంగం కలిగించమని దేవతలందరూ మన్మథుడిని కోరడంతో ఆయన శివుడి మీదకు తన బాణం ప్రయోగిస్తాడు. దీంతో ఆగ్రహం చెందిన పరమేశ్వరుడు తన మూడో కంటిని తెరచి మన్మథుడిని బూడిద చేస్తాడు. మదనుడి భార్య రతీదేవి పరమేశ్వరుడిని వేడుకోవడంతో బోళా శంకరుడు కరిగిపోయి మన్మథుడు రతీదేవికి మాత్రమే కనిపించేలా వరమిచ్చాడు అలా మళ్లీ మన్మథుడు రతీదేవికి దక్కాడు.

ఈ పండుగ జరుపుకోవడానికి ఈ కథ కూడా ఓ కారణమైందని కొందరు విశ్వసిస్తారు. పూర్వం రఘుమహారాజు కాలంలో హోలిక అనే ఓ రాక్షసి ఉండేదట. అది పసిపిల్లలను సంహరిస్తుండేది. ఒక యోగి సూచన మేరకు ఓ వృద్ధురాలు పిల్లల చేత ఆ రాక్షసిని బాగా తిట్టించిందట ఆ తిట్లు వినలేక హోలిక చనిపోయింది. ఆమెను ఊరి ప్రజలందరూ తగలబెట్టి హోలీ పండుగను జరుపుకున్నారట. ఆ సంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతోందని మరికొందరి నమ్మకం.

Also Read

Hijab Row: దేశంలో హిజాబ్ వివాదం కలకలం.. కోర్టు తీర్పును నిరసిస్తూ.. రేపు కర్ణాటక బంద్‌కు పిలుపు

భోజనం తర్వాత సోంపు తింటున్నారా..? అయితే ఒకసారి ఇవి తెలుసుకోండి..

IPL 2022: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా యుజ్వేంద్ర చాహల్.. షాకిస్తోన్న వరుస ట్వీట్స్.. అసలు విషయం ఏంటంటే?