AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hijab Row: దేశంలో హిజాబ్ వివాదం కలకలం.. కోర్టు తీర్పును నిరసిస్తూ.. రేపు కర్ణాటక బంద్‌కు పిలుపు

దేశంలో హిజాబ్ వివాదం కలకలం రేపుతుంది. హిజాబ్ వివాదంపై చెన్నైలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలు విన్నంటాయి. రేపు కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చాయి ముస్లిం సంఘాలు.

Hijab Row: దేశంలో హిజాబ్ వివాదం కలకలం.. కోర్టు తీర్పును నిరసిస్తూ.. రేపు కర్ణాటక బంద్‌కు పిలుపు
Hijab Row
Balaraju Goud
|

Updated on: Mar 16, 2022 | 7:35 PM

Share

Hijab controversy: దేశంలో హిజాబ్ వివాదం కలకలం రేపుతుంది. హిజాబ్ వివాదంపై చెన్నై(Chennai)లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలు విన్నంటాయి. రేపు కర్ణాటక బంద్(Karnataka Bandh) కు పిలుపునిచ్చాయి ముస్లిం సంఘాలు. అయితే, హిజాబ్ వివాదం పై కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రేపు కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చాయి ముస్లిం సంఘాలు. బంద్‌ లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించాయి. హిజాబ్‌ వివాదంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును గట్టిగా వ్యతిరేకించాలని భావించాయి. బంద్ కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశాయి ముస్లిం సంఘాలు.

కర్ణాటక కేంద్రంగా మొదలైన హిజాబ్ వివాదం యావత్తు దేశాన్ని కలవరపెడుతుంది. కర్ణాటకలో చిచ్చురేపిన హిజాబ్ వివాదం.. ఇప్పుడే సమసిపోయేలా లేదు. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు చెన్నైలోని ది న్యూ కాలేజీ విద్యార్థులు. కాలేజ్ క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీ వాంట్ జస్టిస్ట్ అంటూ నినదించారు. అయితే విద్యార్థుల నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన కారులను బయటకు రాకుండా ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

అయితే హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పటికే పలు ముస్లిం సంఘాలు వ్యతిరేకించాయి. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే హిజాబ్ వివాదంపై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించింది. హోలీ తర్వాత విచారణ జరుపుతామంటూ సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపు కర్నాటక బంద్‌కు ముస్లిం సంఘాలు పిలుపునివ్వడం ఆందోళన కలిగిస్తుంది. అయితే కర్ణాటక ఉడుపిలో మొదలైన హిజాబ్ వివాదం.. రాష్ట్ర హైకోర్టు తీర్పు తర్వాత ఉడిపిలో స్కూళ్లు, కాలేజ్ లు రీఓపెన్ చేశారు అధికారులు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే ర్యాలీలు, నిరసనలు బ్యాన్ చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

Read Also…  President Elections: బీజేపీ గెలవడం అంత ఈజీ కాదు.. రాష్ట్రపతి ఎన్నికలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు!